సమీక్ష : అమృతం చందమామలో – సీరియల్ నచ్చిన వారికి మాత్రమే.!

సమీక్ష : అమృతం చందమామలో – సీరియల్ నచ్చిన వారికి మాత్రమే.!

Published on May 17, 2014 7:04 PM IST
amrutham-chandamamlo విడుదల తేదీ : 17 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం గుణ్ణం గంగరాజు
నిర్మాత : గుణ్ణం గంగరాజు
సంగీతం : శ్రీ
నటీనటులు :  శ్రీనివాస్ అవసరాల, హరీష్, ధన్య బాలకృష్ణ..

గత లో ఎంతో మంచి సినిమాలు తీసిన గుణ్ణం గంగరాజు ‘అమృతం చందమామలో’ అనే మరో ప్రయోగాత్మక సినిమాతో మళ్లీ మన ముందుకు వచ్చారు. శ్రీనివాస్ అవసరాల, హరీష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. ఈ చిత్రం ఎలా వుందో చుద్దామా.

కథ:

అమృతరావు (శ్రీనివాస్ అవసరాల), ఆంజనేయులు (హరీష్) మంచి స్నేహితులు. అమృత రావు మామ పెట్టిన ఒక చిన్న కండిషన్ వల్ల ఈ ఇద్దరు స్నేహితులు విడిపోతారు. ఎవరి దారి వారు చూసుకున్న అమృత రావు, ఆంజనేయులు వారి వారి హోటల్ వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారు.

ఆ సమయంలో ప్రభుత్వం స్పేస్ టూరిజం మొదలుపెడుతుంది. అమృతం అంజనేయుల పాత ఇంటి ఓనర్ అప్పాజీ (శివన్నారాయణ) ఒక సరి కొత్త ఐడియాతో వారివురిని కలవడంతో కధ మలుపు తిరుగుతుంది. అప్పాజీ వలలో పడిన ఆ ఇద్దరు వారి ఆస్తులు మొత్తం అమ్మేసి ఇంకొంత మంది తో కలసి స్పేస్ లో అడుగు పెడతారు. మిగిలిన కథ అంతా వారు స్పేస్ లో అడగు పెట్టాక ఎం జరిగింది అన్న దాని చుట్టూ తిరుగుతుంది. అసలు అప్పాజీ చెప్పిన ఐడియా ఏంటి? వారంతా స్పేస్ లోకి ఎందుకెళ్ళారు? అక్కడ ఏం చేసారు అన్నది మీరు వెండితెరపై చూడాలి..

ప్లస్ పాయింట్స్:

శ్రీనివాస్ అవసరాల హరీష్ చాలా బాగా నటించారు. సినిమా మొత్తం బాగా నవ్వించారు. వారిద్దరి కెమిస్ట్రీ కొన్ని సన్నివేశాలలో చాలా బాగుంది. సహాయ నటులు తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. అప్పాజీ పాత్ర పోషించిన శివన్నారాయణ అద్బుతంగా నటించారు. ఒక ఫన్నీ ఇంటి ఓనర్ పాత్ర లో చాలా నవ్వు తెప్పిస్తాడు. సెకండ్ హాఫ్ లో స్పేస్ లో తీసిన కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగా తీసారు.

అలాగే స్పేస్ సెటప్ లో తీసిన కొన్ని సన్నివేసాలు చాలా రిచ్ గా వున్నాయి. ఒక ఫ్యాక్షనిస్ట్ పాత్రలో ఆహుతి ప్రసాద్ బాగా నటించారు. అతని పంచ్ డైలాగ్స్ మరియు సెటైర్ లు బాగా పేలాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కథ ఎంతో విజయవంతమైన టీవీ సీరియల్ ‘అమృతం’ ఆధారంగా రాసుకుంది. కానీ ఈ సినిమా ఆ సీరియల్ అంత ప్రభావం చూపలేకపోయింది. కథలో కొత్తదనం వున్నా తీసిన విధానంలో స్పష్టత లోపించడంతో బోర్ కొడుతుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం స్పేస్ లోనే సాగుతుంది అని ప్రమోట్ చేసారు కానీ చివరి 30 నిమిషాలు మాత్రమే స్పేస్ లో వుంటుంది. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది.

సినిమా స్పేస్ సెటప్ లోకి అడుగుపెట్టాక చాలా చైల్డిష్ గా వుంటుంది. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ కొంచం నెమ్మదిగా సాగుతుంది. అలాగే నిడివి ఎక్కువగా వుండడం ఈ సినిమాకి తోడ్పడకపోవచ్చు.

సాంకేతిక విభాగం:

ఈ చిత్రం సాంకేతింగా కొన్ని విభాగాల్లో చాలా బాగుంది. సంగీతం పర్వాలేదు. లక్కీ గా పాటలు సినిమా ఫ్లో కి అడ్డం కాకపోవడం ఈ సినిమాకి ప్లస్. కొన్ని డైలాగ్స్ లో చాలా తెలివిగా కామెడీ ఉండేలా రాసుకున్నారు. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ చివర్లో వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ మరియు భారీ గ్రాఫిక్స్ బాగా డిజైన్ చేసారు.
గుణ్ణం గంగరాజు అనుకున్న కాన్సెప్ట్ చాలా మంచిది అయితే ఆయన కథని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకోవడం, అనవసరమైన ఎన్నో సన్నివేశాలు రాసుకోకుండా ఉండాల్సింది.

తీర్పు:

మొత్తం మీద చూస్తే ‘అమృతం చందమామ లో’ అక్కడక్కడ మంచి కామెడీ వున్నా ‘అమృతం’ సీరియల్ చూడని వారకి ఈ సినిమా ని ఎంజాయ్ చేయడం కొంచం కష్టం కావొచ్చు. అలాగే ‘అమృతం’ గురించి తెలిసిన వారైతే కొంతవరకూ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

 

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు