ఆడియో రివ్యూ : బలుపు – థమన్ అందించిన మాస్ బీట్స్

ఆడియో రివ్యూ : బలుపు – థమన్ అందించిన మాస్ బీట్స్

Published on Jun 4, 2013 4:00 AM IST

Balupu (6)

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమా ‘బలుపు’. ఈ సినిమా జూన్ 21న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ఆడియోని ఈ మద్య హైదరాబాద్లో విడుదల చేశారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హసన్, అంజలిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రవితేజకి చాలా ముఖ్యమైంది. ఈ సినిమా ఆడియో ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.

1. కాజల్ చెల్లివ
పాడిన వారు : రవితేజ, ఎస్.ఎస్. థమన్
రచయిత : భాస్కర భట్ల

4

రవితేజ మొదటి సారిగా ఈ పాటకి తన వాయిస్ ని అందించారు. ఈ పాటని మొత్తం దాదాపుగా థమన్ పాడాడు. భాస్కర భట్ల అందించిన ఈ పాట చక్కని పల్లెటూరి పాటల ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడుతూ పడే పాట ఇది. ఈ పాటని మొదటి బెంచ్ ప్రేక్షకులకు భాగా నచ్చుతుంది. ఈ పాటని ఎంటర్టైనింగ్ కోసం చిత్రీకరించారని సమాచారం. ఈ పాటకి తగినట్టుగా థమన్ సంగీతాన్ని అందించాడు.

2. ఏవైందో
పాడిన వారు : ఎస్.పీ బాలసుబ్రమణ్యం, గీత మధురి
రచయిత : సిరివెన్నెల సిత రామ శాస్త్రి
6
ఎస్.పీ బాలసుబ్రమణ్యం గారు చాలా రోజుల తరువాత తెలుగులో పాడిన రొమాంటిక్ పాట ఇది. ఈ పాటని ఆయన వాయిస్ వింటుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. గీత మధురి ఎస్.పీ బాలు గారితో పాటు చాలా చక్కగా పడింది. ఇది ఒక మెలోడియస్ సాంగ్. ఈ పాటని సహజంగా అందమైన ప్రకృతి మద్య చిత్రీకరించే అవకాశం ఉంది. ఈ పాటని వింటుంటే సైలెంట్ ఫీల్ కలుగుతుంది. థమన్ మ్యూజిక్ చాలా సులభంగా మన చెవులలోకి వెళ్తుంది. సిరివెన్నెల సీత రామశాస్త్రి రచన బాగుంది. ఈ పాట అందరికి త్వరగా నచ్చుతుంది.

3. లక్కీ లక్కీ రాయి
పాడిన వారు: నవీన్ మాధవ్, ఎం.ఎం. మనసి
రచయిత : భాస్కర భట్ల
1
ఈ పాటని రవితేజ, అంజలి పై చిత్రీకరించే అవకాశం ఉంది. నవీన్ మాధవ్, మనసి ఈ పాటని చాలా జాగ్రత్తగా, చక్కగా పాడారు. ఈ పాట మంచి వేగంతో, మనసుకు ఆకట్టునే మ్యూజిక్ ని అందించారు. భాస్కర భట్ల రచన ఒకే. ఈ పాటని సహజంగా అందమైన ప్రకృతి మద్య చిత్రీకరించే అవకశం ఉంది. లక్ష్మీ రాయి గ్లామర్ ఈ పాటకి మరింత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాట ముందు బెంచ్ వారికి నచ్చుతుంది.

4 . పడిపోయానిల
పాడిన వారు: సుచిత్ సురేసన్, మేఘ
రచయిత: అనంత శ్రీరామ్
3
‘పడిపోయానిల’ ఒక పెప్పి రొమాంటిక్ పాట. సుచిత్ సురేసన్, మేఘ మంచి ఎనర్జీ తో ఈ పాటని పాడారు. ఈ పాటకి థమన్ మ్యూజిక్ ఎప్పటిలాగే ఉన్నప్పటికి ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పటిలాగే ఈ పాటకి సహజ వాయిద్యాలతో సంగీతాన్ని అందించాడు. ఈ పాటని మనం టిసర్లో చూడవచ్చు. ఈ పాటలో శృతి హాసన్ గ్లామరస్ గా ఒక కొత్త అవతారంలో కనిపించనుంది. అనంత శ్రీరామ్ రచన బాగుంది. మొత్తానికి ఈ పాట డీసెంట్ గా ఉండే అవకాశం ఉంది.

5 పాతికేళ్ళ సుందరి
పాడిన వారు: మిక సింగ్, రనిన
రచయిత: భాస్కర భట్ల
5

ఈ పాటని పూర్తిగా మాస్ నెంబర్ గా రవితేజ, శృతి హసన్ పై చిత్రీకరించే అవకాశం వుంది. ఈ పాటలో శృతి హసన్ ని అద్భుతంగా చూపించవచ్చు. మిక సింగ్, రనిన రెడ్డి ఈ పాటని చాలా చక్కగా పాడారు. ఈ పాటలో రనిన వాయిస్ చాలా ఎనర్జీటిక్ గా ఉంది. థమన్ ఈ పాటకి తగినట్టుగా చక్కని వాయిద్యాలతో సంగీతాన్ని అందించాడు. కానీ ఈ పాట ‘బాద్షా’ సినిమాలోని ‘బంతిపూల జానకి’ పాటల ఉంటుంది. భాస్కర భట్ల రచన బాగుంది.

తీర్పు:

ఈ మద్య విడుదలైన ఆల్బంలలో రవితేజ ‘బలుపు’ ఆడియో ఆల్బం మంచి కమర్శియాల్ ఆల్బం. ఈ ఆల్బం లో థమన్ సంగీతం కాస్త ఎప్పటిలాగే అనిపించింది. కానీ ఈపాటలు మంచి ప్రేక్షకాదరణ పొందుతాయని అనిపిస్తుంది. వీటిలో ‘ఏవైందో’, ‘పడిపోయానిల’, ‘పాతికేళ్ళ సుందరి’ పాటలకి మంచి ఆదరణ లబిస్తుంది. శృతి హసన్ గ్లామర్, రవితేజ ఎనర్జీ లు ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ఆడియో రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు