ఆడియో రివ్యూ : జబర్దస్త్ – జబర్దస్త్ ఆల్బమ్

ఆడియో రివ్యూ : జబర్దస్త్ – జబర్దస్త్ ఆల్బమ్

Published on Feb 5, 2013 4:05 AM IST

Jabardasth

అలా మొదలైంది తరువాత నందిని రెడ్డి రెండేళ్ళు గ్యాప్ తీసుకుంది. సిద్ధార్థ్, సమంత లతో జబర్దస్త్ అనే టైటిల్ పెట్టి రొమాంటిక్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందొంచింది. వరుస హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఊపు మీదున్న తమన్ సంగీతం అందించిన జబర్దస్త్ ఆడియో ఇటీవలే విడుదలైంది. మొత్తం ఐదు పాటలున్న ఈ జబర్దస్త్ ఆడియో ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

 

1. పాట : అరెరే అరెరే

గాయకులు : నిత్య మీనన్

సాహిత్యం : శ్రేష్ట

Jabardasth6 నందిని రెడ్డి ఫస్ట్ మూవీ అలా మొదలైందిలో నిత్య మీనన్ నటించడమే కాకుండా రెండు పాటలు కూడా పాడింది. ఆ పాటలు ప్రజాదరణ పొందడం, నిత్య మీనన్ పాడడం సెంటిమెంట్ గా భావించారేమో ఈ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసి ఈ అరెరే అరెరే పాట కూడా పాడింది. ఏదో సరదాగా పాడామని కాకుండా నిత్య మంచి ఫీల్ తో ఈ పాటని పాడింది. విషాద గీతం అని సాహిత్యం వింటే అర్ధమైపోతుంది. ఇద్దరు ప్రేమికులు/స్నేహితులు విడిపోయిన సమయంలో వచ్చే పాట. ఆరంభంలో వచ్చే కోరస్ బిట్ చాలా బావుంది. శ్రేష్ట సాహిత్యం కూడా బావుంది.

 

2. పాట : అల్లా అల్లా

గాయకులు : శ్రేయా ఘోషల్, రంజిత్, నవీన్ మాధవ్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

Jabardasth5 అల్లా అల్లా పాట ఖవాలీ స్టైల్లో ఫుల్ జోష్ తో సాగుతుంది. సినిమాల్లో ముస్లిం వారి పెళ్ళిలలో ఈ తరహా పాటలని ఎక్కువగా ఉపయోగిస్తారు. శ్రేయా ఘోషల్ పాటకి ఊపిరినిస్తూ ఫుల్ ఎనర్జీతో పాడింది. రంజిత్, నవీన్ మాధవ్ ఇద్దరు అదనపు ఆకర్షణగా పాడారు. ఆల్రెడీ విన్న ట్యూన్ లాగా అనిపించడం వల్ల మొదటిసారి విన్నప్పుడే ఈ పాట బాగా నచ్చేస్తుంది. ట్యూన్ కోసం సాహిత్యాన్ని అక్కడక్కడా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పర్వాలేదు.

 

3. పాట : మేఘ మాల

గాయకులు : మురళీధర్, రాహుల్, వందన, రిట, మేఘ

సాహిత్యం : లక్ష్మిభూపాల్

Jabardasth3 1950, 60ల నాటి పాత పాటలని, 80లలో వచ్చిన డిస్కో పాటలని మిక్స్ చేస్తూ రెట్రో టైపులో ఈ పాటని కంపోస్ చేసారు. సింగర్స్ అందరూ పర్వాలేదనిపించగా సాహిత్యం కూడా పర్వాలేదు. చిత్రీకరణ మీద ఆధారాపడిన పాట ఇది.

 

 

4. పాట : తీస్ మార్ ఖాన్

గాయకులు : నవీన్ మాధవ్

సాహిత్యం : లక్ష్మిభూపాల్

Jabardasth4హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. తమన్ రెగ్యులర్ ఇంట్రడక్షన్ పాటల్లో ఉండే జోష్ ఇందులో కూడా కంటిన్యూ చేసాడు. ఆరంభంలో వచ్చే కోరస్ బిట్ ఆకట్టుకుంటుంది. సాహిత్యం కూడా ఫన్నీగా సరదాగా ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. చిత్రీకరణ బావుంటే బాగా హెల్ప్ అయ్యే సాంగ్ ఇది.

 

5. పాట : లష్కర్ పోరి

గాయకులు : మురళీధర్, కోరస్

సాహిత్యం : లక్ష్మిభూపాల్
Jabardasth2 ఈ ఆల్బంలో ఫుల్ మాస్ సాంగ్ ఇది. తెలంగాణ స్టైల్లో సాగుతూ పెళ్లిలో పడే పాట. ప్రోమోలో చూపించిన విధానం చూస్తుంటే చిత్రీకరణ కూడా బావుంటుందని అనిపిస్తుంది. ఇటీవలే మరణించిన ఖుషి మురళి పాడిన పాట ఫుల్ ఎనర్జీతో సాగింది. లక్ష్మిభూపాల్ సాహిత్యం కూడా సరదాగా ఫన్నీగా ఉంది. ఈ పాటలో సమంత నుండి మాస్ స్టెప్స్ ఆశించవచ్చు.

 

 

తీర్పు :

జబర్దస్త్ తమన్ నుండి వచ్చిన మరో కమర్షియల్ ఆల్బం. అల్లా అల్లా పాట మొదటిసారి వినగానే నచ్చుతుంది. అరెరే అరెరే, లష్కర్ పోరి, తీస్ మార్ ఖాన్ పాటలు రెండు మూడు సార్లు వినగా బాగా నచ్చేస్తాయి. వీటికి చిత్రీకరణ తోడైతే సినిమాకి బాగా హెల్ప్ అయ్యే ఆల్బం ఇది.

అనువాదం : అశోక్ రెడ్డి

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు