మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ – మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ – సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో త్వరలో మనముందుకు రానున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో ఆగష్టు 23న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం 5 పాటలని కంపోజ్ చేసాడు, అందులో ఒకటి చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.786’లో ఫేమస్ అయిన ‘గువ్వ గోరింకతో’ సాంగ్ ని రీమిక్స్ చేయడం విశేషం. మరి మిక్కీ అందించిన ఈ 5 పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గాయకుడు : రాహుల్ నంబియార్
సాహిత్యం : వనమాలి
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆల్బంలో వచ్చే మొదటి పాట టైటిల్ సాంగ్. హీరో పాత్రని రెప్రజెంట్ చేస్తూ, ఈ ప్రపంచంలో అన్నిటికీ కావాల్సింది డాలర్, ఆ డాలర్ కోసం ఆనందం, అనుబంధం, ఇప్పటి వరకూ కొనలేని కన్నీళ్లని కూడా సేల్ చేయగలిగే వ్యక్తిత్వం గల హీరో పాత్రని బేస్ చేసుకొని వనమాలి సూపర్బ్ లైన్స్ రాసారు. ఆ రాసిన లైన్స్ ని చాలా క్లియర్ గా అర్థమయ్యేలా రాహుల్ నంబియార్ పాడారు. ఫుల్ ఎనర్జీతో హై పిచ్ లో పాడిన రాహుల్ తన వాయిస్ తో ఈ పాటకి పూర్తి న్యాయం చేసాడు. ఇక ఈ పాటకి హైలైట్ మిక్కీ మ్యూజిక్. హాలీవుడ్ పాప్ సాంగ్ స్టైల్లో క్రేజీ ఎలక్ట్రిక్ గిటార్ తో సాంగ్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత డ్రమ్ బీట్స్ తో మనలో ఊపు తెచ్చాడు. ఇక్కడ చెప్పాల్సింది మధ్య మధ్యలో బీట్స్ కి ట్రంపెట్ సౌండ్స్ ని మిక్స్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వచ్చే ఈ పాటలో సాయి ధరమ్ తేజ్ నుంచి అదిరిపోయే స్టెప్స్ ని ఆశించవచ్చు. అలాగే ఈ పాట వినగానే నచ్చేస్తుంది.
గాయకులు : ఐశ్వర్య మజ్ముదర్, ఆదిత్య
సాహిత్యం : వనమాలి
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆల్బమ్ లో వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ‘ఐ యామ్ ఇన్ లవ్’. ఈ పాటని వాయిస్ పరంగా, మ్యూజిక్ పరంగా చైనీస్ స్టైల్లో మొదలు పెట్టారు, అది వినడానికి చాలా బాగుంది. హీరో – హీరోయిన్ లు ఒకరితో ఒకరు ప్రేమలో పడి, ఒకరికి ఒకరు తమ ప్రేమని వ్యక్తపరుస్తూ పాడే ఈ పాటకి వనమాలి చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాన్ని వారి ప్రేమకి అన్వయిస్తూ స్వచ్చమైన తెలుగు పదాలతో వనమాలి చెప్పిన తీరు చాలా బాగుంది. ఐశ్వర్య వాయిస్ ఈ పాటకి పెద్ద హైలైట్. తన వాయిస్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఆదిత్య కూడా బాగా పాడాడు. మిక్కీ ఈ పాటలో పాటని పాడించిన విధానం మనము ఎక్కడో విన్న ఫీలింగ్ ని కలిగిస్తుంది కానీ తను ఈ పాటలో వాడిన గిటార్స్, డ్రమ్స్, కీ బోర్డ్ మరియు గలౌబెట్ ఫ్లూట్ సౌండ్స్ మరియు అతని ట్యూన్ మాత్రం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే పాట మధ్యలో వచ్చే లేడీ హమ్మింగ్ చాలా బాగుంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్ కూడా వినగానే నచ్చేలా ఉంది.
గాయకులు : కృష్ణ చైతన్య, రమ్య బెహ్రా
సాహిత్యం : భాస్కర భట్ల
‘ఆకాశం తస్సదియ్యా’ అని మొదలయ్యే ఈ పాట ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో వచ్చే మాస్ సాంగ్. మనుషుల జీవితాల్లో వచ్చే కష్టాలను చూసి భయపడకుండా ముందుకు దూసుకుపోవాలనే థీమ్ ఉన్న ఈ పాటలో భాస్కర భట్ల పూర్తిగా మాస్ పదాలని వాడుతూ రాసారు. ఆ లిరిక్స్ లోని మాస్ అప్పీల్ ని తమ వాయిస్ లో తీసుకు రావడానికి సింగర్స్ అయిన కృష్ణ చైతన్య, రమ్య బాగా ట్రై చేసి, తమ వంతు న్యాయం చేసారు. మిక్కీ ఈ సాంగ్ ట్యూన్ కోసం పెద్దగా కష్టపడలేదు. మాస్ కి నచ్చే డ్రమ్ బీట్స్ తో సాంగ్ ని ఫినిష్ చేసాడు. ఈ పాట విన్నప్పుడు పెద్దగా అనిపించకపోయినా ఆన్ స్క్రీన్ సాయి ధరమ్ తేజ్, రెజీనలు వేసిన మాస్ స్టెప్స్ వలన మాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం ఉంది.
గాయకులు : మనో, రమ్య బెహ్రా
సాహిత్యం : భువన చంద్ర
‘ఖైదీ నెం 786’లో బాగా ఫేమస్ అయిన ‘గువ్వ గోరింకతో’ సాంగ్ కి రీమిక్స్ ఇది. మిక్కీ జె మేయర్ రీమిక్స్ అనగానే ఓ రేంజ్ ఫాస్ట్ బీట్స్, డిఫరెంట్ డిఫరెంట్ వాయిద్యాల సౌండ్స్ ని మిక్స్ చేసేసి ఒరిజినల్ సాంగ్ లోని ఫ్లేవర్ ని పోగొట్టలేదు. అప్పటి ట్యూన్ కి ఇప్పటి వాయిద్యాలతో ఇంకాస్త కొత్తదనం మరియు క్లారిటీని తీసుకొచ్చాడు. అప్పట్లో ఎస్.పి బాలు – జానకి కలిసి పాడిన పాటని ఇందులో మనో – రమ్య కలిసి బాగా పాడారు. అప్పట్లో భువనచంద్ర రాసిన లిరిక్స్ ని కూడా మార్చలేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని కాస్త సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉండేలా కంపోజ్ చేసిన ఈ రీమిక్స్ పాట మాస్ పిక్చరైజేషన్ మాత్రం ఆన్ స్క్రీన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
గాయకుడు : శంకర్ మహదేవన్
సాహిత్యం : చంద్రబోస్
అమెరికాలో ఉన్న తెలుగువారందరికీ మన తెలుగు నేల మరియు తెలుగు వారి గొప్పదనాన్ని ఓ సారి గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘తెలుగంటే’ పాట. చంద్రబోస్ ఈ పాటలో రాసిన సాహిత్యం సింప్లీ సూపర్బ్. అలాంటి సూపర్బ్ లిరిక్స్ కి ఇండియన్ ఫేమస్ సింగర్ శంకర్ మహదేవన్ తన గాత్రంతో అద్భుతంగా పాడాడు. ఆయన కాకపోతే ఇంకెవరూ ఈ పాటని ఆ రేంజ్ లో పాడలేకపోయేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లీష్ లైన్స్ తో పాప్ సాంగ్ స్టైల్ లో ట్రంపెట్, ట్రోంబోన్ సౌండ్స్ కి డ్రమ్ బీట్స్ ని మిక్స్ చేసి స్టార్ట్ చేసిన ఈ పాట వినగానే అందరికీ బాగా ఎక్కేస్తుంది. మిక్కీ జె మేయర్ ఈ పాటలో హై పిచ్ లో డ్రమ్ బీట్స్, ట్రంపెట్, ట్రోంబోన్ సౌండ్ కి అక్కడక్కడా ఎలక్ట్రిక్ గిటార్ సౌండ్ ని మిక్స్ చేసిన విధానం అదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట వినగానే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది, అలాగే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియోలో చార్ట్ బస్టర్ గా నిలిచే సాంగ్.
తీర్పు :
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మిక్కీ జె మేయర్ కెరీర్లో వచ్చిన ఫుల్ ఊపున్న ఆల్బమ్ అని చెప్పాలి. మిక్కీ తన కెరీర్లో ఇప్పటి వరకూ అడపాదడపా మాస్ సాంగ్స్ లేదా ఫుల్ బీటున్న సాంగ్స్ చేసాడే తప్ప ఫుల్ మాస్ ఆల్బం చెయ్యలేదు. కానీ హరీష్ శకర్ లాంటి మాస్ డైరెక్టర్ తో జత కలవడం వల్ల అనుకుంటా ఈ సినిమాలో స్లో అండ్ మెలోడీ అనే టచ్ అస్సలు లేకుండా ఫుల్ బీట్స్ తో కూడిన ఆల్బమ్ అందించాడు. మిక్కీ కొత్తగా చేసినా ఎక్కడా తడబడకుండా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి మాస్ టచ్ ఉన్న సినిమాకి పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. మా వరకూ ఈ సినిమాలోని బెస్ట్ చాయిస్ విషయానికి వస్తే.. ‘తెలుగంటే’ సాంగ్ చార్ట్ బస్టర్ అయితే, ‘ఐ యామ్ ఇన్ లవ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆల్బంలో హిట్ సాంగ్స్ గా నిలుస్తాయి. మిక్కీ జె మేయర్ – దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ‘కొత్త బంగారులోకం’, ‘మరో చరిత్ర’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కేరింత’ సినిమాలలానే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుంది.
సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ఆడియో రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాఘవ