విడుదల తేదీ: 12 అక్టోబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5 |
||
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ |
||
నిర్మాత : జితేంద్ర జైన్ | ||
సంగీతం: సలీం – సులేమాన్ |
||
నటీనటులు : జె. డి చక్రవర్తి, మనీషా కోయిరాలా మరియు మధు శాలిని. |
వైవిధ్యమైన పాయింట్స్ ను తీసుకుని తన స్టైల్లో సినిమాలు తీసే రాం గోపాల్ వర్మ హర్రర్ సినిమాలు తీయడంలో కూడా మంచి దిట్ట. ‘భూత్’ అనే సినిమా తీసి అప్పట్లో ప్రేక్షకులను భయపెట్టిన వర్మ మరోసారి ‘భూత్ రిటర్న్స్’ అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముదుకు వచ్చారు. ఈ సినిమాని 3డిలో రూపొందించారు. ఈ సినిమా తెలుగులో ‘బూచి’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో జె. డి చక్రవర్తి , మధు శాలినితో పాటు మనీషా కోయిరాలా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ 3డిలో భయపెట్టాలి అని తీసిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకూ భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
చూడటానికి చాలా బాగుండే ఒక మంచి ఇల్లు తక్కువ అద్దేకే దొరకడంతో తరుణ్ అవస్తి(జె.డి చక్రవర్తి) ఆ ఇంటిలో చేరుదాం అనుకుంటారు. అతని భార్య నమ్రత(మనీషా కోయిరాలా), పిల్లలు తపన్ మరియు నిమ్మి కొత్త ఇంట్లోకి రావడం కోసం ఎంతో ఆసక్తి చూపిస్తారు. అన్ని వర్మ సినిమాల్లోలాగానే ఆ ఇంటికి ఓ ఆసక్తి కరమైన కథ ఉంటుంది. కొంత మంది కొత్త వారు ఆ ఇంటి కింది భాగంలో చేరుతారు. వాళ్ళు వింత శబ్దాలు వినడం మరియు కొత్త కొత్త సంఘటనలు జరగడం గుర్తిస్తారు. చిన్న పాప నిమ్మి(ఆలయన శర్మ) ని షబ్బు అనే దెయ్యం ఆవహించి అందరికీ ఇబ్బందులు కలుగ జేస్తూ ఉంటుంది.
తరుణ్ ఆ దెయ్యం పెట్టే ఇబ్బందులు ఎదుర్కొనే వరకు మిగతావారు చెప్పే వాటిని నమ్మడు. నిమ్మి రాను రానూ అనుకోని విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది మరియు చాలా మంది చుట్టు పక్కల వారు కనపడకుండా పోతూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంతకీ ఆ షబ్బు ఎవరు? అసలు దేయ్యమేనా? అనేదే మిగిలిన కథాంశం.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని 3డి షాట్స్ మరియు కెమెరా యాంగిల్స్ బాగున్నాయి వాటికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చిన్న పాప ఆలయన శర్మ మరియు చక్రవర్తి నటన బాగుంది. సినిమాలో వచ్చే ఊహించని ట్విస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. సినిమాని 88 నిమిషాల్లోనే పూర్తి చేసినందుకు వర్మకి థాంక్స్ చెప్పాలి. నాకు తెలిసి ఇంతకంటే చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఇంకేమి లేవు.
మైనస్ పాయింట్స్ :
మనీషా కోయిరాలా తన వయసు కంటే చాలా ఎక్కువ వయసు ఉన్నామేలా కనిపిస్తుంది మరియు కొన్ని సన్నివేశాల్లో కావాల్సిన దాని కంటే ఎక్కువగా హావ భావాలు పలికించి ఇబ్బంది పెట్టింది. మధు శాలిని పాత్ర కూడా బాలేదు. ఈ చిత్రానికి ముఖ్యమైన సమస్య స్క్రిప్ట్ లేక అనుకున్న ప్లాన్ సరిగ్గా లేదని చెప్పుకోవాలి. వర్మ కొన్ని సన్నివేశాలను చాలా బాగా తీసి భయపెట్టారు, కానీ అలాంటి సన్నివేశాలే రిపీట్ అయినట్టు అనిపించడం వల్ల సినిమా చెడిపోయింది. దీనికి భూత్ సినిమాకి సంబంధం ఏమీ ఉండదు.
ఇప్పుడు ఈ సినిమా ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని చేసారో చూద్దాం. ఈ సినిమా విజువల్స్ ని చాలా హర్రర్ సినిమాలలోని సన్నివేశాలని స్పూర్తిగా తీసుకొని చేసారు. ఈ సినిమాకి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళండి, అలావెలితే మంచి గేమ్ ఆడుకోవచ్చు ఎలా అంటారా, సినిమా చూస్తున్నప్పుడు సడన్ గా ఈ సీన్ ఏ సినిమాలోదో చెప్పుకోండి చూద్దాం? అంటే వెంటనే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పారానార్మల్ యాక్టివిటీ లోనిది కదూ అని అంటారు. సినిమా క్లైమాక్స్ చాలా అర్థవంతమగా ముగించేశారు. బహుశా ‘భూత్ 3’ కి సీక్వెల్ కోసమని అలా ముగించారేమో మరి.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మరియు కొన్ని సన్నివేశాల్లో వర్మ టాలెంట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 3డి ఎఫ్ఫెక్ట్స్ బాగున్నాయి. ఇంటి సెట్ కి తగ్గట్టుగానే సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ క్లీన్ గా ఉంది. ఇక వర్మ డైరెక్షన్ విషయానికొస్తే ఎక్కడైనా ఆర్నాల్డ్ లాగా ‘ఐ యాం బ్యాక్’ అంటాడేమో అని చూసా కానీ అలా అనే దానికి ఆస్కారమే లేకుండా పోయింది.
తీర్పు :
రామ్ గోపాల్ వర్మ తన పాత సినిమాల్లాగానే చూపించిన అవే ట్రిక్స్(బొమ్మలని, నీడల్ని మరియు విచిత్రమైన హావభావాలు చూపించి భయపెట్టడం) ఇందులోనూ చూపించారు. వర్మ ఈ సినిమాతో భయపెట్టాడు కానీ బూ అని కాదండోయ్ తన పైత్యంతో మనిషిని ఇలా కూడా భయపెట్టోచ్చా అనేలా మీ తల బద్దలయ్యేలా భయపెట్టారు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫి మరియు 3డి ఎఫెక్ట్స్ చెప్పుకోదగ్గ అంశాలు. రామ్ గోపాల్ వర్మ అభిమానిగా ఒక మంచి సినిమా కోసం ఎదురు చూసాను కానీ వర్మ మళ్ళీ నిరాశపరిచారు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
అనువాదం : రాఘవ
Click Here For ‘Boochi’ English Review