విడుదల తేదీ : ఫిబ్రవరి 19, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, కె ఆర్ విజయ, సృష్టి దాంగె, మనోబాల
దర్శకత్వం : ఎం ఎస్ ఆనందన్
నిర్మాతలు : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణీమ్
ఎడిటింగ్ : తీయగు
కథ:
భారతదేశం యొక్క 73వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇద్దరు నేరస్థులు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో వృద్ధుల నివాసాలను టార్గెట్ చేసుకుని కొద్ది గంటల్లోనే 50 దొంగతనాలకు పాల్పడతారు. అయితే ఈ కేసును పరిష్కరించడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ గాయత్రీ (శ్రద్ధా శ్రీనాథ్)ను నియమిస్తారు. ఆ తరువాత ఆమె ప్రియుడు మరియు మిలిటరీ ఆఫీసర్ చంద్రు అలియాస్ సుభాష్ చంద్రబోస్ (విశాల్) ఈ కేసు దర్యాప్తులో జాయిన్ అవుతారు.
అయితే అసలు విశాల్ ఈ కేసు దర్యాప్తులో ఎందుకు చేరాడు? చక్ర టైటిల్ విశాల్ మరియు కథతో ఎలా అనుసంధానించబడింది? సైబర్ నేరాలకు మరియు హ్యాకింగ్‌కు సీరియల్ నేరాలకు ఏమి సంబంధం ఉంది? విశాల్ నేరస్థులను పట్టుకుని కేసును ఎలా పరిష్కరించాడు? ఈ అంశాలన్నీ తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఇలాంటి యాక్షన్ పాత్రలు విశాల్‌కు బాగా సరిపోతాయి మరియు అతను చాలా చక్కగా తన పాత్రను పోశిస్తాడు. ఇక శ్రద్ధా శ్రీనాథ్‌ను బాదాస్ కాప్‌గా చూడటం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో మరో నటుడు ఉన్నారు. ఆయన ఎవరో చెప్పి మీ సరదాను మిస్ చేయలేము. ఇకపోతే మిగిలిన సహాయక నటులు తమ పనిని చాలా చక్కగా చేశారు మరియు కథ పురోగతికి బాగా సహాయపడ్డారు.
సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్ మరియు ఈ డిజిటల్ యుగంలో హ్యాకింగ్ వంటి ప్రధాన దోపిడీనీ వెలికితీయడం, కీలకమైన ‘డయల్ యువర్ హెల్ప్’ యుటిలిటీ సర్వీస్ యాప్ ఎపిసోడ్, చెస్ గేమ్ మరియు విశాల్ వీటన్నిటిని చక్కగా చేసి ఇంప్రెస్ చేయడంతో చక్ర మంచి థ్రిల్లర్ అభిప్రాయాన్ని ఇచ్చింది.
మైనస్ పాయింట్స్:
చక్ర ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రంలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఇంతటి పెద్ద కేసును పరిష్కరించడానికి ఒక మిలటరీ అధికారి న్యూ ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు రావడం లాజిక్ మిస్ అయినట్టు అనిపించింది. అయితే దర్శకుడు శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఒప్పించటానికి ప్రయత్నించినప్పటికీ ఆ లోటు భర్తీ కాలేదు.
విశాల్ యొక్క వీరత్వాన్ని పెంచడానికి శ్రద్ధా శ్రీనాథ్ మరియు డీజీపీ పాత్రలకు చిత్ర యూనిట్ ఎక్కువ ఖర్చు చేసినట్టుంది. అయితే వాస్తవానికి మిలటరీ ఆఫీసర్‌కు బదులుగా విశాల్‌ను పోలీసుగా చూపించిన పెద్ద తేడా ఏమి ఉండేది కాదు.
సాంకేతిక విభాగం:
పైన పేర్కొన్న కొన్నిటిని మినహాయించి, రచయిత-దర్శకుడు ఎంఎస్ ఆనందన్ పాటలు లేదా ప్రత్యేక కామెడీ వంటి అనవసరమైన ట్రాక్‌లను జోడించకుండా మంచి ఆకర్షణీయమైన ఆలోచనతో కథను ముందుకు తీసుకెళ్ళారు. ఈ చిత్రం ప్రధాన నటుల ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడదు, ఎంఎస్ ఆనందన్ యొక్క స్క్రీన్ ప్లే, ముఖ్యంగా రెండవ భాగంలో కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు అటెన్షన్‌గా ఉండేట్టు చేశాయి.
స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా యొక్క పల్సేటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా దర్యాప్తు దృశ్యాలు మరియు యాక్షన్ సన్నివేశాలలో వీక్షకుల దృష్టిని అటెన్షన్ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లే యొక్క తీవ్రతను మరింత పెంచింది.
సీనియర్ లెన్స్ మాన్ బాలసుబ్రమణీమ్ యొక్క సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మరియు ఇది ముఖ్యంగా రాత్రి చిత్రీకరించిన పోరాట సన్నివేశాల్లో బాగా అనిపించింది. ఇక ఎడిటర్ తియాగు చాలా చక్కగా పనిచేశాడు. ఈ చిత్రం రన్-టైమ్ చిన్నదిగా మరియు స్క్రీన్ ప్లే రేసీని ఉంచుతుంది. అయితే విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం అనవసరంగా అనిపించింది.
తీర్పు:
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మంచి హైప్ తో వచ్చిన ఈ థ్రిల్లర్ చిత్రం “చక్ర” లో కొన్ని ఎలిమెంట్స్ మంచి ఎంగేజింగ్ గా ఉంటాయి అలాగే ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమా నుంచి ఏవైతే అంశాలను కోరుకుంటారో అంటే విశాల్ మరియు విలన్ ల నడుమ మైండ్ గేమ్ వాటితో థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ ఈ ఇంటెలిజెన్స్ మేకింగ్ లో కూడా కొన్ని లోటు పాట్లు సిల్లీగా అనిపిస్తాయి. జస్ట్ వాటిని పక్కన పెడితే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ వారాంతంలో మూవీ లవర్స్ కు మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team