విడుదల తేదీ : 08 నవంబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5 | ||
దర్శకుడు : వి. సముద్ర | ||
నిర్మాత : డా. శ్రీనుబాబు | ||
సంగీతం : ఎన్ ఆర్ శంకర్, చిన్న | ||
నటీనటులు :ప్రియమణి, కృష్ణంరాజు, శరత్ కుమార్… |
ప్రియమణి నటించిన ‘చండీ’ సినిమా ఈ రోజు ఆంద్రప్రదేశ్ అంతట విడుదలైంది. సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఒమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమాలో కృష్ణంరాజు, శరత్ కుమార్, వినోద్ కుమార్ లు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి ఉపశీర్షిక ‘ది పవర్ అఫ్ ఉమెన్’. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
చండీ (ప్రియమణి) పవర్ ఫుల్, తెలివైన యంగ్ లేడి. ఆమెకి విలువిద్య (బాణాలు వేయడం) చాలా బాగా తెలుసు. ఆమెకి ఆజాద్ (శరత్ కుమార్) గైడెన్స్ ఇస్తూ వుంటాడు. వారు ఇద్దరు కొంతమంది ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను వేటాడుతూ ఉంటారు. దీనితో వారిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాకపోవడంతో వారు సిబీఐ సహాయం కోరతారు. అప్పుడు ఈ కేసు విషయంలో సిబీఐ అధికారిగా నాగబాబు ఎంట్రీ ఇస్తాడు. తను ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో అతను చండీ గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుంటాడు. ఆమెకు సంబందించిన ఓ విషాదమైన, భాదాకరమైన గతాన్ని తెలుసుకుంటాడు. ఆమె కృష్ణపట్నం అనే పల్లెటూరిలో నివసిస్తూ ఉండేది. ఆమె తండ్రి ల్లూరి సీతారామరాజు వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు(కృష్ణంరాజు).
కృష్ణపట్నంలో భూముల్లో వున్న మైన్స్ కోసం మంత్రి (ఆశిష్ విద్యార్ధి) కృష్ణపట్నం ఊరిని, అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని నాశనం చేస్తాడు. దానితో అతడిపై అశోక్ గజపతి రాజు కూతురు ప్రతీకారం తీర్చు కోవలనుకుంటుంది. ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకునేది చూడాలంటే మీరు ‘చండీ’ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
అశోక్ గజపతి రాజు గా కృష్ణం రాజు చూడటానికి బాగున్నాడు. కొన్ని సన్నివేశాలలో ప్రియమణి చూడటానికి చాలా అందంగా ఉంది. పోసాని కొన్ని సన్నివేశాలలో తన మాటలతో నవ్వించడానికి ప్రయత్నిచాడు.
మైనస్ పాయింట్స్:
‘చండీ’ సినిమా అనేది సినిమాని ఎలా తీయకూడదు అనడానికి ఒక టెస్ట్ బుక్ లాంటి ఉదాహారణ. నేషనల్ అవార్డ్ సాదించిన ప్రియమణి ఇలాంటి సినిమా చేస్తుందని ఎవరు అనుకోరు. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న ప్రియమణికి ఈ సినిమా ఆమెకు హెల్ప్ కాకపోగా, ఆమెపై ఉన్న కాస్తో కూస్తో ఇంప్రెషన్ ని పోగొట్టేలా ఉంది. ఈ సినిమాలో లాజిక్ గానీ లేదా చెప్పడానికి కానీ ఏమిలేదు. సముద్ర డైరెక్షన్ చాలా చెత్తగా వుంది. ఈ సినిమాలో డైలాగ్స్ మరీ భయంకరంగా ఉన్నాయి. కొన్ని పోసాని సన్నివేశాలు తప్ప ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు. శరత్ కుమార్, వినోద్ కుమార్ ల పాత్రలు కథకి అసలు అవసరం లేదు. అలాగే ఆ పాత్రలను తీర్చి దిద్దడం కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్ధి చూడటానికి ఎందుకు పనికి రానివాడిలా కనిపిస్తాడు.
ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఒక్కటి కూడా నమ్మశక్యంగా లేవు. ల్యాండ్ మాఫియా లాంటి సన్నివేశాలు ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక పోయాయి. ‘గబ్బర్ సింగ్’ లోని ఫేమస్ అంత్యాక్షరి ఎపిసోడ్ ని కూడా ఈ సినిమాలో చాలా చెండాలంగా చిత్రీకరించారు. ఈ సినిమాలోని అంత్యాక్షరి సన్నివేశాన్ని గనుక హరీష్ శంకర్ చూస్తే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సినిమా చాలా నెమ్మదిగా ఉంటుంది. సినిమా మొదలైన కొద్దిసేపటి నుండే బోర్ కొట్టడం మొదలవుతుంది. ఈ సినిమాలోని పాటలను కేవలం పెట్టాలని మాత్రమే పెట్టడం జరిగింది. అవి కూడా సమయం సందర్భం లేకుండా రావడంతో ప్రేక్షకులకు విసుగొస్తుంది.
సాంకేతిక విభాగం:
ఈ సినిమా సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్ అంత బాగాలేదు. మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు. సంగీతం ఎక్కడ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఈ సినిమాకి సముద్ర డైరెక్షన్ ఒక పెద్ద మైనస్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు అలాగని సీరియస్ పొలిటికల్ డ్రామా కూడా లేదు.
తీర్పు :
ఈ వారం సింపుల్ గా వెల్లకుండా ఉండాల్సిన సినిమా ‘చండీ’. ఈ సినిమా ట్యాగ్ లైన్ ‘ది పవర్ అఫ్ ఉమెన్’ కానీ దీనికి ‘ది పవర్ అఫ్ టార్చర్’ అనే ట్యాగ్ లైన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చెత్తగా అనిపించే డైరెక్షన్, బాగాలేని స్క్రీన్ ప్లే, బరించలేని డైలాగులు, సమయం సందర్బం లేకుండా వచ్చే పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఆడియన్స్ భరించలేని సినిమా ‘చండీ’.
123తెలుగు.కామ్ రేటింగ్ 1. 5/5
రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల