సమీక్ష : చంద్రిక – భయపెట్టలేకపోయిన హర్రర్ ఫిల్మ్

సమీక్ష : చంద్రిక – భయపెట్టలేకపోయిన హర్రర్ ఫిల్మ్

Published on Sep 26, 2015 3:00 PM IST
Chandrika review

విడుదల తేదీ : 25 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : యోగేష్

నిర్మాత : వి. ఆశ

సంగీతం : గుణ్వంత్

నటీనటులు : కామ్న జఠ్మలాని, శ్రీముఖి, జెకె, గిరీష్ ఖర్నాడ్..


ఈ మధ్యకాలంలో తెలుగులో బాక్స్ ఆఫీసు వద్ద బాగానే సేల్ అవుతున్న హర్రర్ నేపధ్యంలో వచ్చిన తెలుగు – కన్నడ ద్విభాషా చిత్రం ‘చంద్రిక’. ఈ రోజే తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కామ్న జఠ్మలాని, శ్రీముఖి, కార్తీక్ జయరాం (జెకె)లు ప్రధాన పాత్రలు పోషించారు. యోగేష్.ఎం దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ హర్రర్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

అర్జున్(కార్తీక్ జయరాం) ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించుకున్న చిత్ర కారుడు. అతని భార్య శిల్ప(శ్రీముఖి). అర్జున్ దైవంగా భావించే తన గురువు రవివర్మ(గిరీష్ ఖర్నాడ్) చనిపోయాడని, తన బంగాళా వేలంకి పెట్టారని తెలియగానే ఆ బంగాళాని అర్జున్ కొనుక్కుంటాడు. శిల్పకి ఆ బంగాళా చాలా బాగా నచ్చడంతో అక్కడికే షిఫ్ట్ అవుతాడు. ఆ బంగాలాకి వెళ్ళాక అక్కడ శిల్పకి చంద్రిక (కామ్న జఠ్మలాని) పెయింటింగ్ కనపడుతుంది. దానిని హాల్ లో పెట్టినప్పటి నుంచి శిల్ప వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది.

ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలని ప్రయత్నించిన అర్జున్ కి శిల్పలో చంద్రిక ఆత్మ ఉందని, ఆ చంద్రిక తననే చంపాలనుకుంటుంది అని తెలుసుకొని షాక్ అవుతాడు. అక్కడి నుంచి ఏం జరిగింది .? అసలీ చంద్రిక ఎవరు.? ఎందుకు అర్జున్ ని చంపాలనుకుంటోంది.? అసలు అర్జున్ – చంద్రికకి ఉన్న సంబంధం ఏమిటి.? చివరికి చంద్రిక అర్జున్ ని చంపి తన పగ తీర్చుకుందా.? లేక క్లైమాక్స్ లో వేరే ఏమన్నా జరిగిందా.? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ చంద్రిక అనే హర్రర్ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. సినిమా మొదటి 15 నిమిషాలు బాగుంది. అ టైంలో చూసే అందరిలోనూ ఏం జరగబోతుంది అనే ఆసక్తిని బాగానే క్రియేట్ చేసాడు. అలాగే అక్కడ చూపిన కొన్ని థ్రిల్స్ కూడా ఓకే. ఈ సినిమా కథకి సరిపోయే లొకేషన్ ని ఆర్ట్ డైరెక్టర్ బాగా డిజైన్ చేసాడు.

ఇక నటీనటుల పరంగా.. శ్రీముఖి సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసింది. తనకిచ్చిన పాత్రకి 70% న్యాయం చేసింది. చాలా సీన్స్ లో బాగా చేసినా కొన్ని సీన్స్ లో మాత్రం అవసరానికి మించి చేస్తోంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక పాటల్లో ట్రెడిషనల్ లుక్ లోనే బాగా గ్లామరస్ గా కనిపించడానికి ట్రై చేసింది. ఇక కామ్న జఠ్మలాని చిన్న పాత్రలో బాగానే చేసింది. అలాగే సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచింది. సీనియర్ యాక్టర్ గిరీష్ ఖర్నాడ్ పెయింటర్ రవివర్మ పాత్రలో బాగా చేసాడు.

మైనస్ పాయింట్స్ :

మొదటగా ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఓ హీరో కావాలని 6 అడుగుల పొడవు, గుడ్ లుకింగ్ పర్సన్ అయిన కార్తీక్ జయరాం ని సెలక్ట్ చేసుకున్నారు. కానీ ఆ పాత్రకంటూ ఒక క్యారెక్టరైజేషణ్ ని రాసుకోలేదు. దానికి తోడు అతనిది సింగిల్ ఎక్స్ ప్రెషన్ పేస్ కావడం వలన అన్నిటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్. హర్రర్, రొమాన్స్, కామెడీ, ట్రాజిడీ ఇలా అన్నిటికీ ఒకటే ఎక్స్ ప్రెషన్. డైరెక్టర్ కూడా దానిని ఓకే చేసెయ్యడం వలన హీరో పాత్ర సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచింది. ఇకపోతే సినిమాలో సత్యం రాజేస్ష్, తాగుబోతు రమేష్, ఎల్.బి శ్రీరాం లాంటి పాత్రలు సినిమా నిడివి పెంచడానికే తప్ప కథకి ఏ మాత్రం ఉపయోగం లేని కథలు. ఇక చంద్రిక అనేది హర్రర్ సినిమాగా ప్రమోట్ చేసుకున్నారు బాగానే ఉంది కానీ సినిమాలో కూడా హర్రర్ అనేది ఉండాలి కదా.. ఇది హర్రర్ అనే అంశమే లేని ఓ హారిబుల్ సినిమా ఇది.

సాజిద్ ఖురేషి రాసుకున్న కథ – కథనాలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. మనం గతంలో చూసిన చంద్రముఖి, ప్రేమకథా చిత్రమ్, గీతాంజలితో పాటు ఇటీవల వచ్చిన చంద్రకళ అనే సినిమాల కథలన్నీ ఇలానే ఉన్నాయి. ఈ కథలనే అటుతిప్పి, ఇటు తిప్పి హీరో పాత్రని మార్చి ఈ సినిమా కథని సిద్దం చేసారు. ఆ సినిమాలకి రాసుకున్న కథలో కామెడీ ఉంది, భయం ఉంది.. కానీ ఇందులో కామెడీ అనే ఊసులేదు, పోనీ భయపెట్టే హర్రర్ అన్నా ఉందా అంటే అదీ శూన్యమాయే.. ఇక కథనం అనేది హర్రర్ సినిమా ఫార్మాట్ అనగానే – ఒక ఫ్లాష్ బ్యాక్, అక్కడ ఓ మోసం/హత్య, ఆ హత్యలో చనిపోయిన వారు ఆత్మ రూపంలో వచ్చి తమ పగ తీర్చుకోవడం. ఈ ఫార్మాట్ తెలిసిన ప్రతి ప్రేక్షకుడు మొదటి 10 నిమిషాల్లోనే సినిమా భవిష్యత్ మొత్తాన్ని ఊహించి పాఠంలా చెప్పేయగలడు. ఇక అంతలా చెప్పేస్తున్నప్పుడు కథనం అనేది అట్టర్ ఫ్లాప్ అయినట్టేగా.. దానికి తోడు నేరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అలాగే సినిమా మొత్తం 30 సెకన్లలో అయిపోవాల్సిన సీన్స్ ని 3 నిమిషాలు సాగదీసి తీయడం వలన 110 నిమిషాల సినిమా కాస్తా ఓ నాలుగైదు గంటలు చూసాం అనే ఫీలింగ్ ని తెప్పించారు.

సినిమాలో హీరో ఉన్నాడు, హీరోకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి ఓ మూడు నాలుగు డ్యూయెట్ సాంగ్స్ ఉండాలి, అందులో వారి రొమాన్స్ ఉండాలి అనే ఓ బ్లైండ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారే తప్ప సినిమాకి పాటలు అవసరమా లేదా అన్న విషయాన్ని కూడా మరిచారు. ఒక్క పాట కూడా సినిమాకి అవసరం లేదు. వీటన్నిటికి మించి ఎడిటింగ్ చాలా పెద్ద మైనస్.. ఎడిటర్ ఎంతసేపూ సినిమా నిడివి పెంచడానికే త్రి చేసాడు తప్ప నిడివిని తగ్గిస్తూ ఎంగేజింగ్ గా సినిమాని చెప్పలేకపోయాడు. వీటన్నిటితో పాటు డైరెక్టర్ యోగేష్ కూడా సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ ని కూడా ప్రాపర్ గా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలేదు.

సాంకేతిక విభాగం :

మొదటగా సినిమాని హిట్ చేయడంలో లేదా ఫ్లాప్ చేయడంలో కీలక పాత్ర పోషించే మెయిన్ డిపార్ట్ మెంట్స్ అయిన కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ విషయాలను గురించి మాట్లాడుకుంటే.. సాజిద్ ఖురేషి రాసిన అన్ని హర్రర్ సినిమాల కథలని మిక్స్ చేసి ది వరస్ట్ పాజిబుల్ కథని రాసాడు. ఒక హర్రర్ సినిమాలో హర్రర్ అనేదే లేకుండా కథ రాసాడు అంటే ఏ రేంజ్ కథో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎప్పటి నుంచో వస్తున్న బేసిక్ హర్రర్ మూవీ ఫార్మాట్ తెలిసిన ఎవరన్నా కథలోని మలుపులని ఇట్టే చెప్పేస్తారు. ఈ కథ – కథనాలకి పర్ఫెక్ట్ గా న్యాయం చేస్తూ డైరెక్టర్ యోగేష్ ఎక్కడా భయపెట్టకుండా సినిమా తీసాడు. ఈ మూడు డిపార్ట్ మెంట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఫ్లాప్స్. వీటితో పాటు ఎడిటర్ సురేష్ కుమార్ సినిమాని ఎంతసేపు సాగాదీద్దాం అనే ధోరణిలోనే సినిమాని తీసాడే తప్ప ఆడియన్స్ కి కనెక్ట్ చేసే ఫాస్ట్ పేస్ ఎడిట్ చెయ్యలేదు.

ఇక కె. రాజేంద్ర బాబు సినిమాటోగ్రఫీ డీసెంట్ గానే ఉంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా చూపించాల్సింది. గుణ్వంత్ అందించిన పాటలు పెద్దగా కనెక్ట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా సార్లు భయపెట్టాలని ఏవేవో సౌండ్స్ క్రియేట్ చేసాడు, కానీ సీన్ లో ఆ ఫీల్ లేకపోవడం వల్ల నేపధ్య సంగీతం వర్క్ అవుట్ అవ్వలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. నాగేశ్వరరావు అందించిన డైలాగ్స్ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ కాలేదు. వి.ఆశ నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు :

హర్రర్ మూవీగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చంద్రిక’ సినిమా ఆడియన్స్ ని భయపెట్టడంలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. హర్రర్ సినిమాలో కామెడీ చూపకపోయినా పర్లేదు కానీ హర్రర్ తో ఆడియన్స్ ని భయపెట్టాలి. ఈ చిన్న లాజిక్ ని కూడా రైటర్ సాజిద్ ఖురేషి అండ్ డైరెక్టర్ యోగేష్ మిస్ అవ్వడం వలన సినిమా ప్రేక్షకులను భయపెట్టి మెప్పించలేకపోయింది. హిట్ సినిమాల హార్రర్ కథని సరిగా మిక్స్ చేయలేకపోవడం, బోరింగ్ కథనం, నో హర్రర్, నో ఎంటర్టైన్మెంట్, వీక్ డైరెక్షన్ మైనస్ పాయింట్స్ అయితే సినిమా స్టార్టప్ కాస్త బెటర్ గా ఉండడం సినిమాకి ప్లస్. ఓవరాల్ గా భయపెట్టాలని వచ్చి భయపెట్టలేకపోవడమే కాకుండా, హర్రర్ ఎలిమెంట్స్ లేని హర్రర్ సినిమానే ‘చంద్రిక’.

123తెలుగు రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు