సమీక్ష : క్రేజీ – అంత క్రేజీగా లేదు

సమీక్ష : క్రేజీ – అంత క్రేజీగా లేదు

Published on Apr 11, 2013 8:36 PM IST
Crazy (2) విడుదల తేదీ : 11 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : కన్నన్
నిర్మాత : సురేష్ కొండేటి
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : ఆర్య, హన్సిక, అంజలి, సంతానం ప్రేంజీ….


‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’, ఇటీవలే వచ్చిన ‘పిజ్జా’ లాంటి మంచి మంచి సినిమాలను డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి ఈ ఉగాది కానుకగా తమిళ్ లో ‘సెట్టై’ గా వచ్చిన సినిమాని ‘క్రేజీ’ పేరుతో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇది బాలీవుడ్లో హిట్ అయిన ‘ఢిల్లీ బెల్లీ’ కి రీమేక్. ఆర్య, హన్సిక, అంజలి, సంతానం, ప్రేంజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కన్నన్ డైరెక్టర్. హిందీ, తమిళ బాషలలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు వారిని ఎంత వరకూ ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక న్యూస్ పేపర్ కోసం పనిచేసే జెకె(ఆర్య), శీను(ప్రేంజి), నాకి(సంతానం) అనే ముగ్గురు స్నేహితుల కథే క్రేజీ. ఒకరోజు జెకె గర్ల్ ఫ్రెండ్ హన్సిక ఒక పార్సల్ ని తన ఫ్రెండ్ కి డెలివరీ చేయమంటుంది. జెకె బిజీగా ఉండడంవల్ల నాకిని డెలివర్ చెయ్యమంటాడు. అతని చేతిలో ఒకేలా ఉండే రెండు పార్సల్స్ ఉండడం వల్ల ఒకరికి ఇవ్వాల్సిన పార్సల్ ఇంకొకరికి మారిపోతుంది. అలా మిస్ అయిన పార్సల్ గ్యాంగ్ స్టర్ నాజర్ కి వెళుతుంది. నాజర్ దాన్ని తెరచి చూసినప్పుడు పార్సల్ మారిపోయిందని ఒరిజినల్ పార్సల్ ఎవరో కొట్టేసారని తెలుసుకొని, నాజర్ అది డెలివర్ చేసిన ముగ్గురి ఫ్రెండ్స్ వెంట పడతాడు. గ్యాంగ్ స్టర్ నాజర్ చేతుల్లోనుంచి విలన్స్ ఎలా తప్పించుకున్నారు? ఇంతకీ ఆ పార్సల్ లో ఏముంది అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్. కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండడం వల్ల చాలా పదాల్ని, కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ని సెన్సార్ వారు మ్యూట్ చేసారు. అవి కాకుండా సినిమాలోని వన్ లైన్ పంచ్ డైలాగ్స్, కొన్ని సందర్భాలలోని కామెడీ చాలా బాగుంది. ఆర్య స్టైలిష్ గా ఉన్నాడు, అలాగే హన్సిక, అంజలిలతో అతని కాంబినేషన్ బాగుంది. అలీ కామెడీ ట్రాక్ ఆసక్తికరంగానూ, నవ్వుకునే విధంగానో ఉంది.

అంజలి ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా, మోడ్రన్ గర్ల్ గా కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. సెకండాఫ్ లో సంతానం కామెడీ బాగుంది. డాన్ పాత్రలో నాజర్ నటన బాగుంది. అలాగే డాన్ గా అతని గెటప్, ఫన్నీ డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి. సెకండాఫ్ వేగంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ చాలా నిదానంగా ఉంటుంది. ఆడియన్స్ కి కథ ఎంటా అనేది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ స్క్రిప్ట్ చాలా స్లోగా ఉండడం, అలాగే మన ఆడియన్స్ కి అంతగా నచ్చదు. ఫస్ట్ హాఫ్ లో సంతానం కామెడీ రొటీన్ గా ఉంది, అది అలాగే కంటిన్యూ అవుతూ ఉండడంతో సంతానం ఎపిసోడ్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. నటిగా హన్సిక పాత్ర పెద్దగా ఏమీ లేదు. ప్రేంజీ లవ్ ట్రాక్, అందులో వచ్చే ఓ పాట అంతగా సెట్ అవ్వకపోగా బోర్ ఫీల్ ని కలుగ జేస్తుంది. పాత్రలని, సీన్స్ ని సరిగా ఎలివేట్ చేయకపోడం వల్ల క్రేజీ’ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా లేదు. ఈ సినిమా హిందీ సినిమాకి రీమేక్, దాన్ని నేటివిటీకి తగ్గట్టు మార్చి లోకల్లో తీసుంటే బాగుండేది కానీ ముంబాయి బ్యాక్ డ్రాప్ లోనే తీయడం వల్ల అంతగా అనిపించలేదు.

హిందీలో ఈ సినిమా హిట్ అవ్వడానికి గల కారణం ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం. కానీ మన డైరెక్టర్స్ దీన్ని రీమేక్ చేయాలనుకున్నప్పుడు మన వారికి తగ్గట్టు కొన్ని కొన్ని మార్చుకొని ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. సినిమాలో వచ్చే జోక్స్ లో డబుల్ మీనింగ్ కాస్త ఎక్కువగా ఉంది. నీతూ చంద్ర ఐటెం సాంగ్ కూడా బాలేదు.

సాంకేతిక విభాగం :

తమన్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ఆర్య – హన్సిక మధ్య వచ్చే ‘అలగోద్దే అలగోద్దే’ సాంగ్ బాగుంది. ఈ సినిమా డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు, ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఒకే అనేలా ఉంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్ గా లేదు. సినిమా ఇప్పుడే వేగంగా ముందుకెలుతోంది అనుకున్న టైంలో ఓ పాట వచ్చి ఉన్న ఫీల్ ని చెడగొడుతుంది. ఎడిటింగ్ కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు. డైరెక్టర్ కన్నన్ స్క్రిప్ట్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోకుండా ఒరిజినల్ స్టొరీ ఎలా ఉందో అలానే తీసేసాడు.

తీర్పు :

మొత్తంగా ముక్కలు ముక్కలుగా చూసుకుంటే క్రేజీ మూవీ బాగుంది. ఆర్య – అంజలి రొమాంటిక్ ట్రాక్, కొన్ని కామెడీ సీన్స్ ఈ మూవీకి ప్లస్. చాలా స్లోగా ఉండే ఫస్ట్ హాఫ్, మేకింగ్ చాలా పూర్ గా ఉండడం బిగ్ మైనస్ పాయింట్స్. మీరు ఖాళీగా ఉంటే ఈ బిలో యావరేజ్ సినిమాని వెళ్లి చూడొచ్చు..


123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు