సమీక్ష : ఢీ అంటే ఢీ – బాగా నిరాశపరిచే ఢీ.!

సమీక్ష : ఢీ అంటే ఢీ – బాగా నిరాశపరిచే ఢీ.!

Published on May 15, 2015 6:00 PM IST
Dhee-ante-Dhee-Review

విడుదల తేదీ : 15 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : జొన్నలగడ్డ శ్రీనివాసరావు

నిర్మాత : జొన్నలగడ్డ శ్రీనివాసరావు

సంగీతం : స్వర్గీయ చక్రి

నటీనటులు : శ్రీకాంత్, సోనియా మన్

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్. ఈ ఫ్యామిలీ స్టార్ నటించిన మరో లేటెస్ట్ మూవీ ‘ఢీ అంటే ఢీ’. జొన్నలగడ్డ శ్రీనివాసరావు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా ద్వారా సోనియా మాన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. స్వర్గీయ చక్రి ఈ సినిమాకి సంగీతం అందించాడు. శ్రీకాంత్ మరో సారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎసిపి రాధాకృష్ణ (శ్రీకాంత్) ఓ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. రాధాకృష్ణ ఓ ఆపరేషన్ లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో గంధపు చక్కలు స్మగ్లింగ్ చేస్తూ, ఎంతో మంది ప్రభుత్వాది అధికారుల మరణానికి కారణమైన వీరప్ప(సత్యరాజ్) ని పట్టుకొని జైల్లో వేస్తాడు. దాంతో వీరప్ప రాధాకృష్ణని చంపాలి అనుకుంటాడు. ఇది కాసేపు పక్కన పెడితే రాధాకృష్ణ పెళ్లి చేసుకోవాలని చాలా ట్రై చేస్తుంటాడు. కానీ అన్నీ నిశ్చితార్దం కంటే ముందే ఆగిపోతుంటాయి. అదే తరుణంలోనే రాధాకృష్ణ లక్ష్మీ ప్రసన్న(సోనియా మాన్)ని చూసి ప్రేమలో పడతాడు. హైదరాబాద్ సిటీలోనే నెంబర్ వన్ అనిపించుకుంటున్న మెరీడియన్ స్కూల్ కి అధినేత అయిన లక్ష్మీ ప్రసన్నకి పోలీసులు అంటే అసలు పడదు.

ఓ రోజు పెళ్లి పంతులు రాధాకృష్ణకి ఓ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ అమ్మాయే లక్ష్మీ ప్రసన్న. అక్కడ నిజాలు తెలుసుకున్న లక్ష్మీ ప్రసన్న పెళ్ళికి నో అంటుంది. దాంతో ఇద్దరి మధ్య మా ప్రొఫెషన్ గొప్ప అంటే మా ప్రొఫెషన్ గొప్ప అని ఆర్గ్యుమెంట్.. కట్ చేస్తే ఓ చాలెంజ్. అదే ఒకనెల రోజులు రాధాకృష్ణ స్కూల్ హెడ్ గా సమర్ధవంతంగా లీడ్ చెయ్యాలి, అలాగే లక్ష్మీ ప్రసన్న నెల రోజుల పాటు ఎసిపిగా డ్యూటీ చెయ్యాలి. ఈ పందెం ప్రకారం ఇద్దరూ ఏమేమి చేసారు.? ఈ పందెం వల్ల వీరిలో ఎవరికి ఉపయోగం.? పోలీస్ గా మారిన లక్ష్మీ ప్రసన్న ఏమేమి ఇబ్బందులు పడింది.? అలాగే రాధాకృష్ణ ఓ స్కూల్ హెడ్ గా పిల్లలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.? చివరికి ఈ పందెంలో ఎవరు గెలిచారు.? అలాగే జైల్లో ఉన్న వీరప్ప రాధాకృష్ణపై పగ తీర్చుకోవడానికి ఏం చేసాడు? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘ఢీ అంటే ఢీ’ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ హీరో శ్రీకాంత్ ఈ సినిమా చేయడం. శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా తన పార్ట్ కి పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా స్ట్రిక్ట్ పోలీస్ గా బాగా చేసాడు. ఈ సినిమాలో హీరోకి సమానమైన రోల్ చేసింది హీరోయిన్ సోనియా మన్.. కానీ నటనలో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ భామ అందాల ఆరబోతలో మాత్రం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ లో ఈ భామ గ్లామర్ ముందు బెంచ్ వారిని బాగా ఆకట్టుకుంటుంది. విలన్ గా చేసిన సత్యరాజ్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో బాగా చేసాడు. ఫస్ట్ హాఫ్ లో జయ ప్రకాష్ రెడ్డి బాగానే నవ్వించాడు. సెకండాఫ్ లో అదుర్స్ రఘు – పోసాని కృష్ణమురళి కలిసి చేసిన ఓ చిన్న ఎపిసోడ్ బాగుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పరవాలేదు అనిపిస్తుంది. ఇకపోతే ఓ రెండు పాటలను సినిమాటోగ్రాఫర్ చాలా గ్రాండ్ గా షూట్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్.. పైన చెప్పినట్టు రఘు – పోసాని కామెడీ బిట్ తప్ప మిగతా ఏమీ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఇంటర్వల్ తర్వాత హీరో – హీరోయిన్ ప్రోఫెషన్స్ ని మార్చారు కానీ ఏ ఒక్క ఎపిసోడ్ ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించలేదు. ముఖ్యంగా హీరోయిన్ పోలీస్ గా చేసిన ఎపిసోడ్ లో సీన్ కి సీన్ కి అస్సలు సంబంధం ఉండదు. పోసాని ట్రాక్ ని కూడా సడన్ గా కథలోకి తీసుకొస్తారు. ఎందుకు సడన్ గా కథలోకి వచ్చింది అనేది ఎవ్వరికీ తెలియదు. సెకండాఫ్ మొత్తం సాగుతూనే సాగుతూనే ఉంటుంది. ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ కూడా సెకండాఫ్ లో లేకపోవడంతో సినిమాలో పెద్ద మైనస్. సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. సినిమాలో లాజిక్స్ అనేది ఎతకడం మన పొరపాటే అవుతుంది. ఎందుకు అంటే లాజికల్ గా అన్ని మిస్టేక్స్ ఉన్నాయి.

ఇకపోతే బ్రహ్మానందం కొడుకు అని ఓ చిన్న పిల్లాడికి గ్రాఫిక్స్ లో బ్రహ్మానందం ఫేస్ ని పెట్టి తీసిన సీన్స్ నవ్వించకపోగా చాలా నాశిరకంగా అనిపిస్తాయి. బ్రహ్మానందం ట్రాక్ వల్ల ఈ సినిమాకి పైసా ఉపయోగం కూడా లేదు. సెకండాఫ్ లో పెద్దలకి – పిల్లలకి డిజైన్ చేసిన బాస్కెట్ బాల సీన్ మొత్తం చాలా సిల్లీ గా ఉంటుంది. డైరెక్టర్ ఆ సీన్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నాడు, కానీ ఆన్ స్క్రీన్ వచ్చే సరికి ఆయన అంచనా పూర్తి రివర్స్ అయ్యి, ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే రేంజ్ కి తీసుకెళ్ళింది. కథ పరంగా కొత్తదనం ఏమీ లేదు.. కథలో చేసిన తప్పు సెకండాఫ్ లో సీన్ కి సీన్ కి ఎక్కువ అటాచ్ మెంట్ లేకుండా రాసుకోవడం. రాసుకోవడంలోనే ఈ తప్పు ఉండడం వలన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో ఆ గాప్స్ ఇంకా ఎక్కువై సెకండాఫ్ అర్థరహితంగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి మనం అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటుంది. ఇక ఆడియన్స్ కి ఎక్కడ ఆసక్తి వస్తుంది చెప్పండి. శ్రీ కాంత్ అంటే అస్సలుపడని పిల్లలు సడన్ గా ఎందుకు మారిపోతారు అన్న దానిలో అస్సలు పాయింట్ లేదు. కథ – స్క్రీన్ ప్లే తో పాటు ఎడిటింగ్ కూడా బాలేదు. ఇకపోతే పాటలు రావాలి కాబట్టి వస్తాయి, అంతే తప్ప ఒక్కదానికి సరైన సందర్భం లేదు. చెప్పాలంటే సినిమా ఫ్లోని సాంగ్స్ బాగా దెబ్బ తీసాయి.

సాంకేతిక విభాగం :

ఢీ అంటే ఢీ కి సినిమాటోగ్రాఫర్ గోపీనాథ్ అందించిన విజువల్స్ బాగానే హెల్ప్ అయ్యాయి. ఇచ్చిన లొకేషన్స్ బాగానే చూపించాడు. ముఖ్యంగా రెండు సాంగ్స్ లో తను చూపిన లైట్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇకపోతే స్వర్గీయ చక్రి అందించిన పాటలు ఓకే.. కానీ ఒక్క పాటకి సరైన సందర్భం కుదరలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పరవాలేదనేలానే ఉంది. గౌతం రాజు ఎడిటింగ్ బాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా గజిబిజిగా, అర్థరహితంగా ఉంది. రాజేంద్ర కుమార్ డైలాగ్ డీసెంట్.. కానీ ఆయన ఆడించిన కథా విస్తరణా సహకారం సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. జొన్నలగడ్డ శ్రీనివాస్ అనుకున్న పాయింట్ పరవాలేదనిపించినా ఆయన రాసుకున్న పూర్తి కథా విస్తరణ సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. దర్శకత్వం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో ఆయన సక్సెస్ కాలేకపోయాడు, గ్రాఫిక్స్ ని పక్కన పెడితే నిర్మాతగా స్టాండర్డ్స్ ఉన్న సినిమానే అందించాడు.

తీర్పు :

విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రీకాంత్ నుంచి వచ్చిన ‘ఢీ అంటే ఢీ’ సినిమా కూడా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. శ్రీకాంత్ ఈ కథను ఓకే చేసి, తన వంతు కృషి చేసాడు కానీ చెప్పిన విధంగా సినిమాని తెరకెక్కించలేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. శ్రీకాంత్ నటన, సోనియా మాన్ గ్లామర్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే జయప్రకాశ్ రెడ్డి కామెడీ బిట్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే పరమ బోర్ ఫీలయ్యేలా చేసే సెకండాఫ్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నో ఎంటర్ టైన్మెంట్ చెప్పుకోవాల్సిన మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఆద్యంతం రెండు గంటల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అంశాలు ఈ సినిమాలో లేవు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు