విడుదల తేదీ : డిసెంబర్ 18, 2020
123telugu.com రేటింగ్ : 3/5
నటీనటులు: శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రాత్ కౌర్, సురేఖా వాణి, జబర్దస్ట్ మహేష్
దర్శకుడు : ఎం.ఎస్.రాజు
నిర్మాతలు : గుడూరు సతీష్ బాబు, గుదురు సాయి పునీత్
సంగీత దర్శకుడు : మార్క్ కె రాబిన్
పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో ఫ్రైడే మూవీస్ అనే సరికొత్త ఏటిటి యాప్ లో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా చిత్రం “డర్టీ హరి”.ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ పక్కా బోల్డ్ అటెంట్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వెళ్తే హరి(శ్రవణ్ రెడ్డి) ఎన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకోవాలని హైదరాబాద్ కు వస్తాడు. అలా అక్కడ వసుధ(రుహాని శర్మ) అనే గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఇదే క్రమంలో తన లవర్ సోదరుడి గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జాస్మిన్(సిమ్రాత్ కౌర్) ను చూసి ఆకర్షితుడు అవుతాడు. మరి దీనితో మొదలైన ఈ సరికొత్త కోణం ఎటు వైపుకు తీసుకెళ్తుంది?ఈ సంబంధాలతో హరి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?వాటిని ఎలా మైంటైన్ చేసాడో అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొట్ట మొదటిగా మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఎం ఎస్ రాజు గారి కోసమే అని చెప్పాలి. ఎన్నో ఏళ్లగా నిర్మాతగా తెలుగులో మంచి సినిమాలు అందజేసిన ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ బోల్డ్ అటెంప్ట్ మెచ్చుకోదగిందే అని చెప్పాలి. నేటి తరం ప్రేక్షకులకు కూడా ఎక్కేలా చాలా స్మూత్ గా మంచి కంటెంట్ తో స్టైలిష్ గా ఎస్టాబ్లిష్ చేసారు. అంతే కాకుండా మంచి రొమాంటిక్ యాంగిల్ కొన్ని బోల్డ్ సీన్స్ ను చాలా బాగా చూపించారు. అంతే కాకుండా మంచి ఎమోషన్స్ ను వల్గారిటీని కూడా ఎట్టి పరిస్థితుల్లో హద్దులు దాటకుండా చూపిన విధానం బాగుంది.
ఇక మరో మేజర్ ఎసెట్ ఏదన్నా ఉంది అంటే అది నటీనటుల పెర్ఫామెన్స్ లు అని చెప్పాలి. మెయిన్ క్యాస్ట్ లో కనిపించిన ముగ్గురూ కూడా తమ బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. యువ హీరో శ్రవణ్ రెడ్డి ఈ సినిమాలో తన రోల్ ను ఆకట్టుకునే విధంగా చాలా సెటిల్డ్ గా చేసాడు. అతడి లుక్స్ మరియు డైలాగ్ డెలివరీ వీటితో పాటుగా అతడి నటన ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇక అలాగే మరో హీరోయిన్ రుహాణి శర్మ తనకు ఉన్న రోల్ ను ఉన్నంత మేర బాగా చేసింది అలాగే కథకు తగ్గట్టుగా డిజైన్ చేసిన పాత్రకు చివర్లో మంచి స్కోప్ ను తెచ్చుకుంది.
ఇక ఈ చిత్రంలో మరో మేజర్ హైలైట్ పెర్ఫామెన్స్ ను అందించింది యంగ్ హీరోయిన్ సిమ్రత్ కౌర్. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి సినిమాను ఎందుకు ఒప్పుకుందో ప్రూవ్ చేసుకుంది అని చెప్పొచ్చు. చాలా బోల్డ్ రోల్ లో ఈ చిత్రంలో తాను కనిపిస్తుంది. దర్శకుడు డిజైన్ చేసిన రోల్ కు తన వంద శాతం ముందు ఉంచింది. ఒక్క బోల్డ్ సీన్స్ లోనే కాకుండా తన పెర్ఫామెన్స్ తో కూడా సిమ్రాత్ ఆకట్టుకుంటుంది. వీరితో పాటుగా సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ ను డిజైన్ చేసిన విధానం అక్కడ వచ్చే ట్విస్ట్ మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అలాగే నటి సురేఖ వాణి తన రోల్ లో మంచి నటన కనబరిచారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం నేటి తరం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది అలాంటి అంశాలు చాలానే ఉన్నాయి కానీ అక్కడక్కడా మాత్రం సినిమా కాస్త స్లో గా సాగినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కూడా ఇది కనిపిస్తుంది. ఇంకా అలాగే జస్ట్ కొంత మేర స్క్రిప్ట్ లైన్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. దాని వల్ల అంత కొత్తదనం ఇందులో ఉన్నట్టు అనిపించదు.
అలాగే ఈ సినిమాలో చూపే అఫైర్ ఎపిసోడ్స్ కూడా చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. అలాగే సినిమా ముగింపును ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా మరో కీ రోల్ లో కనిపించిన రుహాణి శర్మ పాత్రకు స్కోప్ ఉన్నా ఇంకా తగ్గించేసినట్టు అనిపిస్తుంది. ఈమెకు ఇంకా సీన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో కనిపించే ప్రతీ విజువల్ మరియు వినే వాటిలో ఉన్నత విలువలు కనిపిస్తాయి. ఈ విషయంలో మేకర్స్ రాజీ పడకపోవడం విశేషం. అలాగే కెమెరా వర్క్ కానీ ఆర్ట్ వర్క్ కానీ చాలా బాగున్నాయి. అలాగే వీటితో పాటుగా డైలాగ్స్ మరియు పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది కానీ కొన్ని చోట్ల స్లో నరేషన్ ను కవర్ చేసి ఉంటే బాగుండేది.
ఇక దర్శకుడు ఎం ఎస్ రాజు విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టుగానే ఆయన ఎక్స్ పీరియన్స్ ను ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తడబడకుండా చెప్పే ప్రయత్నం చేసారు. కానీ తాను లైన్ పాతదే అయినప్పటికీ దానిని ఆవిష్కరించిన విధానం మాత్రం స్పెషల్ అనే చెప్పాలి స్టైలిష్ మేకింగ్ తో థ్రిల్ చేస్తుంది. నటీ నటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లను రాబట్టారు. అలాగే సినిమాలోని బోల్డ్ నెస్ ను కూడా బాగా మైంటైన్ చేసి మంచి అవుట్ ఫుట్ ను అందించారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ బోల్డ్ అటెంప్ట్ “డర్టీ హరి” మంచి థ్రిల్లింగ్ బోల్డ్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పాలి. నటీనటుల అమోఘమైన పెర్ఫామెన్స్ లు అలాగే ఆకట్టుకునే డ్రామా, బోల్డ్ సీన్స్ నిర్మాణ విలువలు, క్లైమాక్స్ వంటివి ఆకట్టుకోగా అక్కడక్కడా నెమ్మదించే కథనం, రొటీన్ లైన్ లను పక్కన పెడితే ఎం ఎస్ రాజు అందించిన ఈ బోల్డ్ అటెంప్ట్ ఆడియెన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team