సమీక్ష : దృశ్యం – థ్రిల్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్..

సమీక్ష : దృశ్యం – థ్రిల్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్..

Published on Jul 13, 2014 8:00 AM IST
drishyam-review విడుదల తేదీ : 11 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : శ్రీ ప్రియ
నిర్మాత డి. సురేష్ బాబు – రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం : ఎస్. శరత్
నటీనటులు : వెంకటేష్, మీనా, కృతిక..

ఎప్పటికప్పుడు కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా చేసిన మరో ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మీనా, కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డి. సురేష్ బాబు – రాజ్ కుమార్ సేతుపతి కలిసి నిర్మించారు. దృశ్యం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ మేము ఈ సినిమాని ఈ రోజు ప్రత్యేకంగా చూడటం వలన రెండు రోజుల ముందుగానే ఈ చిత్ర సమీక్షని మీకందిస్తున్నాం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్ర ‘దృశ్యం’ తెలుగులో కూడా హిట్ అవుతుందో లేదో ఇప్పుడు చూడండి..

కథ :

కథ పచ్చని పొలాల మధ్య ఉన్న రాజవరం అనే ఊరిలో మొదలవుతుంది. ఆ ఊరిలో జ్యోతి కేబుల్ నెట్వర్క్స్ పెట్టుకున్న రాంబాబు(వెంకటేష్) తన కుటుంబ సభ్యులైన మీనా(జ్యోతి),అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్) హ్యాపీగా జీవిస్తుంటాడు. రాంబాబు చాలా నిజాయితీ పరుడు. అదే ఊరిలో బాగా లంచాలకు మరిగిన వీరభద్రం(రవి కాలే)కి రాంబాబుకి అస్సలు పడదు.

ఇదిలా ఉండగా.. ఒకరోజు ఐజి గీత ప్రభాకర్(నదియా) కుమారుడు వరుణ్ కనపడకుండా పోతాడు. వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? లేక వీరభద్రం కావాలనే ఇరికించాడా? చివరికి రాంబాబు ఫ్యామిలీ ఆ కేసు నుంచి బయటపడ్డారా? లేదా అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మరియు సినిమాలో ఉన్న ది బెస్ట్ అంటే అది సినిమా సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్. ఆ థ్రిల్లింగ్ మోమెంట్స్ థియేటర్స్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరి చేత వావ్ సూపర్బ్ అనిపిస్తాయి. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించి చూపించడం ఇదే తొలిసారి కావడం వలన ఆడియన్స్ థ్రిల్ కి ఫీలవుతారు. సెకండాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా అందరూ సీట్లో నుంచి కదలకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూసేలా ఉంటుంది.

ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన నడిపించిన వెంకటేష్ గురించి.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం కొత్తేమీ కాదు, కానీ ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. రాంబాబు పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రకీ వెంకీనే బెస్ట్ అనేలా అతని నటన ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించిన మీనా వెంకటేష్ కి భార్య పాత్రలో చక్కగా సరిపోయింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఎప్పటిలానే వెంకీ – మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించేలా నటనని కనబరిచారు.

అలాగే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నదియా చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఒక తల్లి తన కనపడని సమయంలో ఉండే ఆవేదనని, మరో పక్క తన కొడుకు గురించి తెలుసుకోవాలనే సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా తను పలికించిన హావ భావాలు సింప్లీ సూపర్బ్. నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి కాలే మంచి నటనని కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ లో వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నరేష్, చైతన్య కృష్ణ, సమీర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సింది అంటే.. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్.. థ్రిల్లర్ సినిమాలకి రన్ టైం ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి రన్ టైం కాస్త ఎక్కువ కావడం వల్ల కొన్ని చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదటి 15 నిమిషాలు చాలా స్లోగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా అనిపిస్తాయి. మన నేటివిటీకి తగ్గట్టు ఇంకాస్త కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది.

అలాగే మలయాళం సినిమా చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదు. దానికి ప్రధాన కారణం డైలాగ్స్ తో సహా సీన్ టు సీన్ అలానే ఉండడం, ఆ సినిమాలోని లోకేషన్స్ నే ఇందులో ఉపయోగించడం వలన మాలయాళ వెర్షన్ చూసిన వారికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతిక నిపుణులు :

సాంకేతిక నిపుణుల్లో ముందుగా ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన శ్రీ ప్రియ గురించి చెప్పుకుందాం. శ్రీ ప్రియ మళయాళ వెర్షన్ లోని సీన్స్ ని పిన్ టు పిన్ దించినా థ్రిల్లింగ్ మోమెంట్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యింది. అలాగే నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఇక సినిమాకి శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ మోమెంట్స్ కి అతను ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ లో ఉత్కంఠని మరింత పెంచేస్తుంది. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. సినిమా అంతా పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఆయన ఇంకాస్త ట్రై చేసి ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త రన్ టైం తగ్గించి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అలాగే జీటు జోసెఫ్ అందించిన కథ – కథనం, పరుచూరి బ్రదర్స్ రచన, డార్లింగ్ స్వామి డైలాగ్స్ కూడా బాగున్నాయి. సురేష్ బాబు – రాజ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా వెంకటేష్ కి మరో విక్టరీని అందజేసింది. ఇది మళయాళ సినిమాకి రీమేక్ అయినా సినిమా ఉన్న కంటెంట్ యూనివర్సల్ కాన్సెప్ట్ కావున తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఉండే కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్, ఎమోషనల్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ అయితే సినిమా మొదటి 15 నిమిషాలు చాలా స్లోగా ఉండడం, అక్కడక్కడా కొన్ని బోరింగ్ సీన్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అంశాలు, అలాగే రొటీన్ కి విభిన్నంగా కోరుకునే వారికి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే ఆసక్తికరంగా సాగే సినిమా చూడాలనుకునే వారిలో ఉత్కంఠని కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉండడం వలన మల్టీ ప్లెక్స్ నుండి సి సెంటర్ ప్రేక్షకుల వరకూ అందరూ ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీల్ అవ్వవచ్చు. అవుతారు కూడా…

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు