లాక్ డౌన్ రివ్యూ : ఎక్స్ పెరీ డేట్ ( జీ5లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ఎక్స్ పెరీ డేట్ ( జీ5లో ప్రసారం)

Published on Oct 10, 2020 6:56 PM IST

తారాగణం : స్నేహ ఉల్లాల్, మధుశాలిని, టోనీ లూకా, అలీ రెజా తదితరులు

దర్శకుడు : శంకర్ మార్తాండ్

నిర్మాత : శరత్ మరార్

సంగీతం :అనూప్ రూబెన్స్

ఎడిటర్ : అరుణ్

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సిరీస్ గా వచ్చిన సిరీస్ ఎక్స్ పెరీ డేట్. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథ :

విశ్వ (టోనీ లూకా) రిచ్ పర్సన్. అతని భార్య దిషా (స్నేహ ఉల్లాల్)ను చచ్చేంతగా ప్రేమిస్తాడు. అయితే దిశా, సన్నీ (అలీ రెజా)తో అక్రమ సంబంధం పెట్టుకుని సన్నిహితంగా గడుపుతున్న సమయంలో విశ్వ వారిద్దరినీ పట్టుకుంటాడు. అది విశ్వ జీవితానికే పెద్ద షాక్ ను ఇస్తోంది. ఇక తన భార్యను చంపడానికి విశ్వ ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. కానీ దాన్ని అతను ప్లాన్ చేసేలోపే దిశా అనుకోకుండా అతని చేతుల్లో చనిపోతుంది. అతను ఆ హత్యను దాచడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం అతను పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేస్తాడు. అలాగే నిషా (మధు షాలిని) అనే మరో మహిళ పోలీసుల వద్దకు వచ్చి సన్నీ అనే తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తోంది. దాంతో విశ్వకు అది మరో షాక్ ను ఇస్తుంది. మొత్తానికి ఈ గమ్మత్తైన కేసును పోలీసులు ఎలా డీల్ చేసారనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

కథ సింపుల్ గా ఉన్నప్పటికీ, దర్శకుడు శంకర్ మార్తాండ్ దానిని వివరించిన విధానం మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చివరి ఎపిసోడ్ వరకు ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా ప్లే ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే నేపథ్యం, ​​నిర్మాణ విలువలు మరియు కథను చక్కగా విప్పే విధానం కూడా చక్కగా ఉన్నాయి. టోనీ లూకా చాలా మంచి పాత్రను పోషించాడు. మరియు తన నటనతో ఆకట్టుకోవడానికి బాగా ప్రయత్నించాడు. చాలా కాలంగా మంచి పాత్ర కోసం చూస్తున్న మధుశాలని సూపర్బ్ గా నటించింది.

నేరానికి పాల్పడిన ఉద్రిక్త మహిళగా ఆమె ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మూడు ఎపిసోడ్లలో ఆమె తన భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం అద్భుతమైనది. ఇక అలీ రెజాకు కూడా మంచి నెగటివ్ రోల్ దక్కింది. అతను కూడా బాగా నటించాడు. తనలో వైవిధ్యభరితమైన పాత్రలు చేయగల సామర్ధ్యం ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక పోలీసుగా నటించిన భరత్ రెడ్డి నటన అద్భుతంగా ఉంది. అతను చాలా మంచి స్క్రీన్ స్పెస్ ను కలిగి ఉన్నాడు. మోసం చేసే భార్య పాత్రకు
స్నేహ ఉల్లాల్ పరిపూర్ణంగా న్యాయం చేసింది. హైదరాబాద్ యొక్క విజువల్స్ ను ఎలివేట్ చేసిన కెమెరావర్క్, బిజిఎం మరియు విజువల్స్ చక్కగా ప్రదర్శించబడ్డాయి.

 

ఏం బాగాలేదు :

చివరి రెండు ఎపిసోడ్ల వరకు సిరీస్ ల్యాగ్ లేకుండా వేగంగా సాగింది. అయితే మేకర్స్ ఎనిమిది ఎపిసోడ్లతోనే ముగించాలి, కాని ఎటువంటి కారణం లేకుండా చాలా విషయాలు అనవసరంగా విస్తరించి ల్యాగ్ చేశారు. చివరి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో మరియు కేసు ఎలా ముగిసింది అనే దానిపై స్పష్టత లేదు. చివరికి ఒక ట్విస్ట్ రివీల్ అయినా అది బలంగా లేదు. పైగా సిరీస్ డబ్బింగ్ చెత్తగా ఉంది. మొదటిది చాలా గ్రిప్పింగ్ ప్లేలో ప్రారంభమైన సిరీస్ తరువాత స్లోగా అవుతుంది. చాలా సమయం తీసుకుని ఎలివేట్ చేసిన కోన్ని సీన్స్ కూడా నచ్చవు.

 

తీర్పు :

మొత్తం మీద, ఎక్స్ పెరీ డేట్ ఒక క్రైమ్ థ్రిల్లర్, ఇది చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగానే సాగింది. కథ మొదట్లో సూటిగా సాగినా, మధ్యలో కొంచెం లాగినప్పటికీ, దర్శకుడు ఈ సిరీస్ ను వివరించిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది. అలాగే నటీనటులు మంచి ప్రదర్శనలు, ఆకర్షణీయమైన సీన్స్ మరియు ప్రతి ఎపిసోడ్ యొక్క సరళమైన ప్లే ఈ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. ఈ సిరీస్‌ను హ్యాపీగా చూడొచ్చు.

Rating: 3.25/5

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు