లాక్ డౌన్ రివ్యూ : గుంజన్ సక్సేనా – హిందీ ఫిల్మ్ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ : గుంజన్ సక్సేనా – హిందీ ఫిల్మ్ (నెట్ ఫ్లిక్స్)

Published on Aug 12, 2020 8:10 PM IST
Gunjan Saxena: The Kargil Girl Review

Release date : Aug 12th, 2020

123telugu.com Rating : 3/5

నటీనటులు : జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగడ్ బేడీ, వినీత్ కుమార్ సింగ్

దర్శకుడు : శరణ్ శర్మ

నిర్మాత : కరణ్ జోహార్

సంగీతం : జాన్ స్టీవర్ట్ ఏడురి

ఛాయాగ్రహణం: : ఆర్. ఢీ

 

 

భారతదేశం కోసం కార్గిల్ యుద్దం లో పోరాడిన భారత వైమానిక దళ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాము. ఈ బయోపిక్ ఇపుడు నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమ్ అవుతుంది. అది ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ:

గుంజన్ సక్సేనా (జాన్వీ కపూర్) చాలా తెలివిగల అమ్మాయి. తన టీనేజ్ వయసు నుండే చాలా తెలివిగా నడుచుకొనేది. తన పైలట్ గా ఎదగాలని టీనేజ్ నుండే అనుకున్నది. అయితే తన ఇంట్లోనే అన్నయ్య, అమ్మ ఇద్దరూ కూడా తన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే గుంజన్ సక్సేనా తండ్రి (అనూప్ సక్సేనా) మాత్రం పైలట్ గా ఎదిగేందుకు ప్రోత్సహించే వాడు. తన తండ్రి ప్రోత్సాహం తో పైలట్ అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ అందుకు ఖర్చు మాత్రం తన భరించలేని పరిస్తితి లో ఉంది. అయితే తన తండ్రి వైమానిక దళం లో చేరమని సలహా ఇస్తారు. గుంజన్ అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, భారతీయ పైలట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఆమె శిక్షణ కాలం లో అందరూ తక్కువగా చూస్తారు, అంత సీరియస్ గా ఎవరూ పరిగణించరు. అయితే గుంజన్ ప్రతి ఒక్కరినీ కూడా తప్పుగా ఎలా చూపిస్తోంది, దేశం కోసం కార్గిల్ యుద్దం లో ఎలా పోరాడింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

గుంజన్ సక్సేనా భారత్ పైలట్ అయ్యేందుకు ఎంతో సాహసోపేతంగా పోరాడింది, ఎంతగా పోరాటం చేసింది అనే వాటిని చిత్రం లో చక్కగా చూపించారు.అంతేకాక యువ పైలట్ గుంజన్ జీవితంలో అనుభవించిన అవమానాలను, పోరాటాలను సైతం చక్కగా చూపించారు. గుంజన్ సోదరుడు అంగద్ బేడీ పాత్ర చాలా ఉద్రిక్తత తో నిండిన సోదరుడి పాత్ర.

ఈ చిత్రానికి పంకజ్ త్రిపాఠి హార్ట్ లాంటి వాడు అని చెప్పాలి. గుంజన్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు అని చెప్పాలి. అతను ఈ చిత్రానికి కీలకం. కూతురు గుంజన్ తో అతనికి ఉన్న అపారమైన భావోద్వేగ బంధాన్ని చూపించడం లో బాగా నటించారు. ఈ పాత్ర చాలా ప్రశాంతత ను తీసుకు వస్తుంది. ఈ చిత్రం లో అతని పాత్ర ఏదో డ్రామా లాగా కాకుండా, చాలా అద్భుతంగా నాచురల్ గా అనిపిస్తుంది.

జాన్వీ కపూర్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా కష్టమైనది మరియు ఉత్తమ మైనది అని చెప్పాలి. ఆమె తన తండ్రి తో చేసిన అన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు. నిజ జీవిత పైలట్ పాత్రను చాలా చక్కగా పోషించారు. ఈ చిత్రం లో తన నటన విషయం లో ప్రారంభంలో మందగించినట్లు అనిపించినా, చిత్రం క్లైమాక్స్ లో అద్భుతంగా నటించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం కేవలం గంట 54 నిమిషాలు మాత్రమే ఉన్నా, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కొంచెం లాగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. గుంజన్ సక్సేనా బాల్యం సన్నివేశాల కోసం ఎక్కువ సమయం కేటాయించారు. గుంజన్ సక్సేనా కార్గిల్వైయుడ్డం లో ఎలా పోరాడారు అనే దాని గురించి ఈ చిత్రం ఎక్కువగా ఉందని భావించే వారు అంతా కూడా,ఒక్క క్లైమాక్స్ మాత్రమే ఉంది అని తెలియడం తో నిరాశ కి గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే మహిళా పైలట్ లను ఎపుడూ ప్రోత్సహించనీ వారీగా భారత్ వైమానిక దళ పైలట్ లను చూపిస్తారు. ఈ చిత్రం స్త్రీ వాద సన్నివేశాలతో నిండి ఉంది, కొన్ని సన్నివేశాలతో ఈ చిత్రం అంతగా సాగకపోవచ్చు అని చెప్పాలి.

 

సాంకేతిక అంశాలు:

ఛాపర్ సన్నివేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపించడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. వి ఎఫ్ ఎక్స్ ఎక్కువగా వాడటం చేత సన్నివేశాలు అన్ని కూడా చాలా నేచురల్ గా కనిపిస్తాయి. ఈ చిత్రం లో కెమెరా మరియు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, పంకజ్ త్రిపాఠి కోసం రాసినటువంటి డైలాగ్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా చిత్ర సన్నివేశాలకి తగ్గట్టు గా అద్భుతంగా ఉన్నాయి.

ఈ చిత్ర దర్శకుడు శరణ్ శర్మ బయోపిక్ తో చక్కటి చిత్రాన్ని తెరకెక్కించారు అని చెప్పాలి. బయోపిక్ కావడం చేత ఫిక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు, చూపించలేదు. అయితే గుంజన్ సక్సేనా పైలట్ అయ్యేందుకు మాత్రమే వైమానిక దళానికి వచ్చింది అని, దేశం కోసం కాదు అని తెలిపే దృశ్యాలు చక్కగా చూపించారు. అటువంటి డైలాగ్స్ తో పాత్రను చాలా చక్కగా హైలెట్ చేశారు అని చెప్పాలి. ఎమోషనల్ గా చాలా సింపుల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని చెప్పాలి.

 

తీర్పు:

మొత్తం మీద గుంజన్ సక్సేనా భారతదేశం యొక్క దైర్యమైన వైమానిక దళ పైలట్ యొక్క భావోద్వేగ బయోపిక్. ఈ చిత్రం గుంజన్ సక్సేనా పోరాటాల ఆధారం గా రూపొందించబడినది. మరియు జీవితం లో తాను అనుకున్నది సాధించడానికి ఏమి చేసిందో తెలుసుకోవడానికి ఈ చిత్రం ను చూడవచ్చు. కథనం ముందుగానే ఊహించదగినది అయినా, చాలా స్లో గా సాగినా,ఎమోషనల్ మరియు చక్కటి సన్నివేశాలు కలిగి ఉండటం తో ఈ చిత్రాన్ని చూసేలా చేస్తాయి.

 

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు