సమీక్ష : హౌరా బ్రిడ్జ్ – కనెక్ట్ అవ్వడంలో విఫలం అయ్యింది

సమీక్ష : హౌరా బ్రిడ్జ్ – కనెక్ట్ అవ్వడంలో విఫలం అయ్యింది

Published on Feb 4, 2018 12:20 AM IST
Howrah Bridge movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రాహుల్ రవీంద్రన్ చాందిని చౌదరి, రావ్ రమేష్, అజయ్

దర్శకత్వం : రేవన్ యాదు

నిర్మాతలు : మహాదేవ నాగేశ్వర్ రావ్, వడ్డేపల్లి శ్రీనివాస్ రావ్

సంగీతం : శేఖర్ చంద్ర

కెమెరామెన్ : విజయ్ మిశ్రా

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్

రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన హౌరా బ్రిడ్జ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రేవన్ యాదు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:

రాహుల్ రవీంద్రన్ తన చిన్ననాటి స్నేహుతురాలు స్వీటీ (చాందిని చౌదరి) ని ఇష్టపడుతాడు. కానీ కొంతా కాలం తరువాత ఇద్దరికి దూరం పెరిగుతుంది. ఎలాగైనా తన స్వీటీ తన దగ్గరికి వచ్చి చేరుతుందనే నమ్మకంతో రాహుల్ ఉంటాడు. కానీ స్వీటీ రాహుల్ ను మరిచిపోతుంది. అలా దూరమైన రాహుల్ స్వీటీ కలుసుకున్నారా ? ఎలా కలుసుకున్నారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇంజనీర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ బాగా చేసాడు. చాందిని చౌదరి, రాహుల్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. చాందిని చౌదరి నటన బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె మెప్పించింది.

మనాలి రాథోడ్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. విలన్ పాత్రలో రావు రమేష్ నటన బాగుంది. అజయ్ తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. సినిమాలో అజయ్ చేసిన పాత్ర కీలకం. ఆయన ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

మైనస్ పాయింట్స్ :

హౌరా బ్రిడ్జ్ సినిమా కథ వినడానికి బాగున్నా తెరమీద చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే ఉండడంతో సినిమా రక్తి కట్టించలేకపోయింది. ఈ కథను ఇంకా అందంగా మంచి సన్నివేశాలతో చిత్రీకరించి ఉండాల్సింది.

రావు రమేష్, అజయ్ వంటి నటీనటులు ఉన్నా వారిని పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. బలమైన సీన్స్, ఆసక్తి కలిగించే సంభాషణలు లేవు. వినదగిన పాటలు లేకపోవడం వల్ల సినిమా ఆడియన్స్ ను సీట్ లో కూర్చుపెట్టక పోవచ్చు.

సినిమా ఇంటర్వెల్ వరుకు పరువాలేదనిపించినా రెండో సగం మొదలయ్యాక వచ్చే అనవసర సన్నివేశాలు విసిగించాయి. పోసాని, మధు చేసే సీన్స్ లో పెద్దగా కామెడీ పండలేదు. వాటిని కావాలని ఇరికించినట్లు ఉంది. సినిమాకు ఆ సీన్స్ మైనస్ గా మారాయి.

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు పరువాలేదు. కెమెరా వర్క్ యావరేజ్ గా ఉంది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం పెద్దగా అలరించలేదు. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. డైరెక్టర్ రేవన్ యాదు కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా కొంతలో కొంతైనా ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉండేది.

చివరిగా :

హౌరా బ్రిడ్జ్ మంచి కథను కలిగి ఉన్నా అనవసరమైన సన్నివేశాలు, పస లేని స్క్రీన్ ప్లేతో సినిమా పక్కదారి పట్టింది. కామెడీ కూడా సరిగ్గా పండలేకపోవడం, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాల్లో కొత్తదనం లేకపోకడంతో సినిమా నీరుగారిపోయింది. అక్కడక్కడా వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. మొత్తంగా లవ్ స్టొరీ చూద్దామనుకొని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు హౌరా బ్రిడ్జ్ నిరాశ పరుస్తుంది. కాబట్టి కొన్ని రోజులు ఆగితే బుల్లితెరపై ఈ సినిమాను చూడొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు