Release Date : డిసెంబర్ 10,2020
123telugu.com రేటింగ్: 2/5
తారాగణం : పృద్వి దండమూడి, మైరా దోషి, ఆనంద్, వినయ్ వర్మ, బెనార్జీ, సత్య అక్కల
దర్శకత్వం : శ్రీవర్ధన్
నిర్మాత : ప్రసాద్ నెకురి
సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్
పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా చిత్రం “ఐఐటి కృష్ణమూర్తి”.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.
కథ :
తన అంకుల్ ను వెతుక్కుంటూ కృష్ణముర్తి(పృద్వి) హైదరాబాద్ కు వస్తాడు. అలా వచ్చాక అతని మిస్సింగ్ పై ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాడు కానీ ఊహించని విధంగా కృష్ణమూర్తి తన అంకుల్ చచ్చిపోయాడని పైగా అతని దహన సంస్కారాలు కూడా వారే చేసారని తెలుసుకుంటాడు. కానీ ఇదంతా ఏదో అనుమానకరంగా ఉందని నమ్మకం తెచ్చుకోడు. అసలు నిజం ఏమిటి అన్నది కనుక్కొనే ప్రయత్నంలో అతడికి ఓ పెద్ద కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందని తెలుసుకుంటాడు. మరి ఈ అన్నిటికి ఉన్న సంబంధం ఏమిటి? తన అంకుల్ ఎలా చనిపోయారు? లాస్ట్ కి ఈ మిస్టరీ ఏమయ్యింది అన్నదే అసలు కథ.
ప్లస్ పాయింట్స్ :
ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో దానిని ఓ మోస్తరుగా బాగానే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అది బాగా అనిపిస్తుంది. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో కూడా అది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక అలాగే ఓ కీలక పాత్రలో కనిపించిన వినయ్ వర్మ మంచి అవుట్ ఫుట్ ని ఇచ్చాడు.
కమెడియన్ సత్య కూడా తన రోల్ పరిమితి మేర మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ మైరా దోషి తనకు తక్కువ స్పేస్ ఉన్నా తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. ఇంకా మరో సీనియర్ నటుడు బెనర్జీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కూడా మంచి రోల్ తో ఇంప్రెస్ చేసారని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్ :
మొదటగా ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ పాయింట్ ఏమన్నా చెప్పాలి అంటే అది విసుగు తెప్పించే నరేషన్ అని చెప్పాలి. మాములుగా ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో ఏదైతే ముఖ్యమో దాన్నే పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది. దీనితో అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపించకుండానే సినిమా సాగిపోయినట్టు అనిపిస్తుంది.
అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించవు. ఇక మరో మైనస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది ఈ సినిమా మెయిన్ లీడ్ పృద్వి రోల్ అని చెప్పక తప్పదు. అతడు తన రోల్ లో లుక్స్ మరియు పెర్ఫామెన్స్ పరంగా ఓకే అనిపించినా అసలు ఈ కథలో ఇలాంటి పాత్రే మైనస్ లా అనిపిస్తుంది.
దాన్ని డిజైన్ చేసిన విధానం అసలేం బాగాలేదు. అలాగే సినిమా స్లోగా సాగడమే కాకుండా దానికొక రొమాంటిక్ యాంగిల్ అది కూడా ఏం ఆకట్టుకోదు. అలాగే లాజిక్స్ అయితే వాటి కోసం చెప్పనవసరమే లేదు. ఇవన్నీ బాగా చికాకు తెప్పించే అంశాలు అని చెప్పాలి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అని చెప్పొచ్చు కొన్ని సీన్స్ లో కనిపించే సెట్ వర్క్ బాగుంది. అలాగే సినిమాటోగ్రాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ పెద్దగా బాగోదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని చెప్పొచ్చు. అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా మెరుగ్గా ఉండాల్సిందే. చాలా మేర సినిమాను కట్ చేసి ఉంటే మంచి అవుట్ ఫుట్ వచ్చి ఉండొచ్చు.
ఇక దర్శకుని విషయానికి వస్తే..శ్రీవర్ధన్ ఎంచుకున్న ఆలోచన బాగుంది కానీ దాన్ని ఆన్ స్క్రీన్ పై తెరకెక్కించడంలో చాలా మేర విఫలం అయ్యారనే చెప్పాలి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొన్నపుడు కథనం ఆసక్తికరంగా మలచాలి కానీ అలాంటి మెయిన్ ఎలిమెంట్ నే మిస్ చేసాడు. అలాగే స్క్రీన్ ప్లే కానీ లాజిక్కులు కానీ వేటిపైనా శ్రద్ధ పెట్టినట్టు అనిపించదు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఐఐటీ కృష్ణ మూర్తి పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడని చెప్పాలి. ఏమాత్రం ఆసక్తికరంగా ఉందని కథనం, పైగా స్లోగా సాగే నరేషన్ మెయిన్ సోల్ మిస్సవ్వడం వంటివి బాగా నిరాశపరుస్తాయి. అలాగే సెకండాఫ్ లో ఓకే అనిపించే కొన్ని ఆసక్తికర సన్నివేశాలు క్లైమాక్స్ పార్ట్ తప్ప ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పెద్దగా ఏమి ఉండదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team