సమీక్ష : “జై సేన” – అక్కడక్కడా పర్వాలేదనిపించే సోషల్ డ్రామా

సమీక్ష : “జై సేన” – అక్కడక్కడా పర్వాలేదనిపించే సోషల్ డ్రామా

Published on Jan 30, 2021 11:00 PM IST
Jai Sena movie review

విడుదల తేదీ : జనవరి 29, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు: శ్రీకాంత్, నందమూరి తారకరత్న, సునీల్, అజయ్‌గోష్, మధుసూధన్ రావు, ప్రీతి శర్మ
దర్శకుడు: వి.సముద్ర
నిర్మాత: వి సాయి అరుణ్ కుమార్
సంగీతం: రవిశంకర్
ఎడిటింగ్ : నందమూరి హరి


ప్రముఖ సీనియర్ దర్శకుడు వి సముద్ర కొన్ని సామాజిక సమస్యలపై మరియు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తో తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం “జై సేన”. ఎప్పటి నుంచో విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం ఈ జనవరి 29న విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకొని ఓ నలుగురు అగ్రికల్చర్ విద్యార్థులు కార్తికేయ, అభిరాం, హరీష్ మరియు ప్రవీణ్ లు వారి గ్రామానికి చెందిన రైతులకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చేసి ఇవ్వాలి అనుకుంటారు. మరి దీనికి సాయంగా వారి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ రెడ్డి(మధుసూదనరావు) ని అడుగుతారు కానీ అందుకు అతడు అసలు ఒప్పుకోడు. మరి ఇక్కడ నుంచి ఆ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? తమ రైతుల కోసం వారు ఆ ప్రాజెక్ట్ ను చేస్తారా? మరి ఈ కథలో పోలీస్ గా సునీల్ కు ఎలాంటి పాత్ర ఉంది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా ఈ సినిమాలో కనిపించిన నలుగురు ప్రధా పాత్రధారులు కార్తికేయ, అభిరాం, హరీష్ మరియు ప్రవీణ్ ల విషయానికి వస్తే ఎవరూ కూడా తమ పాత్రలకు మించకుండా తమ రోల్స్ కు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. సినిమా మొత్తం తమ భుజాలపైనే మోసి రక్తి కట్టించారు.

మరి అలాగే ఈ సినిమాలో మేజర్ హైలైట్ సునీల్ రోల్ అని చెప్పాలి. కాస్త లేట్ గానే ఎంట్రీ ఇచ్చినా సునీల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సూపర్బ్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. ఇంకా అలాగే అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. అలాగే మరో కీలక పాత్రల్లో కనిపించిన తారక రత్న, శ్రీకాంత్ లు కూడా తమ రోల్స్ కు పూర్తిగా న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాను రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకొని చూపించే ప్రయత్నం చేసారు కానీ అందుకు మాత్రం సరైన కథనం మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మెయిన్ పాయింట్ నుంచి కథ అనేక అనవసర కోణాలకు మారుతున్నట్టుగా సినిమా చూస్తున్నంతసేపు అనిపిస్తుంది.

అలాగే ఎమోషన్స్ కూడా ఇంకా బలంగా ఉంటే బాగుణ్ణు, వీటితో పాటుగా కాలేజ్ ఎపిసోడ్స్ లో కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది. ఇక ఈ చిత్రంలో సునీల్ కు మంచి రోల్ ను పెట్టినా అది ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు కొన్ని అనవసర సన్నివేశాలను ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు అవి అప్పటికి అప్రస్తుతం అనిపిస్తాయి. అంతే కాకుండా సరైన కమెర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేకపోవడం ఈ చిత్రానికి మరో మైనస్ గా నిలుస్తుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో ఓవరాల్ గా చూస్తే నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపించే స్థాయిలో మాత్రమే ఉంటాయి. సినిమాటోగ్రఫీ ఒక్కటి మినహా మిగతా అంశాలు అంత ఇంపాక్ట్ కలిగించవు. సంగీతం, ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రం ఆకట్టుకోడానికి అంతగా దోహద పడలేదు. ఈ అంశాల్లో ఎక్కువ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు వి సముద్ర విషయానికి వస్తే చాలా సీనియార్టీ ఉన్న ఈ దర్శకుడు మంచి లైన్ ను ఎంచుకున్నా దాన్ని సరిగ్గా ఆవిష్కరించడంలో తడబడ్డారు. సరైన కథనం లేకపోవడం అలాగే స్క్రీన్ ప్లే ను ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. డైలాగ్స్ పర్వాలేదు అనిపిస్తాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే సందేశాత్మక కాన్సెప్ట్ తో తీసుకున్న ఈ “జై సేన”లో కొన్ని ఎమోషన్స్ అలాగే నటీనటుల బెస్ట్ పెర్ఫామెన్స్ లు బాగానే ఉన్నా సరైన కథనం లేకపోవడం అలాగే ఇతర కొన్ని లోటు పాట్లు సినిమా మెయిన్ ప్లాట్ ను దెబ్బ తీశాయి. వీటి మూలాన ఈ చిత్రం బిలో యావరేజ్ కంటెంట్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు