విడుదల తేది :16 డిశంబర్ 2011 | ||
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3.25/5 | ||
దర్శకుడు : ఎస్ శరవణన్ | ||
నిర్మాత : సురేష్ కొండేటి | ||
సంగిత డైరెక్టర్ : సత్యాన్ | ||
తారాగణం : శర్వానంద్ , అనన్య , జై , అంజలి |
శర్వానంద్, అనన్య, జై మరియు అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ’. తమిళంలో విడుదలైన ‘ఎగేయుం ఎప్పోదుం’ చిత్రాన్ని
తెలుగులో ‘జర్నీ’ పేరుతో సురేష్ కొండేటి విడుదల చేసారు. ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. జర్నీ ఎలా సాగిందో చూద్దాం.
కథ:
రెండు బస్సుల ప్రయాణమే జర్నీ చిత్ర కథ. ఒక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు విజయవాడ నుండి హైదరాబాదుకు బయలుదేరుతుంది. ఇంకో ప్రైవేటు బస్సు హైదరాబాదు నుండి విజయవాడ బయలుదేరుతుంది. ఆ రెండు బస్సులలో గౌతం (శర్వానంద్), అమృత (అనన్య), కృష్ణ (జై) మరియు మధుమతి (అంజలి) ప్రయాణిస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో ఉండే అమృత అనే అమ్మాయికి గౌతం సాయం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ ఒకరికొకరు చెప్పుకోరు. కృష్ణ మొహమాటస్తుడైన యువకుడు. మద్యపాన, సిగరెట్ తాగడం లాంటి ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు. మడుమతిక్ మరియు కృష్ణ ప్రేమించుకుంటారు. అమృత హైదరాబాదు నుండి విజయవాడ బయలుదేరుతుంది. కృష్ణ మరియు మధుమిత విజయవాడ నుండి హైదరాబాదు బయలుదేరుతారు. వారి జీవితాలు అనుకోని భయంకరమైన మలుపు తిరుగుతాయి. ఏంటి ఆ మలుపు అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
శర్వానంద్ గౌతం పాత్రలో ఒదిగిపోయాడు. హైదరాబాదులో ఉండే యువకుడిగా సరిగ్గా సరిపోయాడు. శర్వానంద్ గొంతు అతనికి బాగా ప్లస్ అయింది. జై భయస్తుడిగా, మొహమాటస్తుడిగా చాలా బాగా చేసాడు. అనన్య అందంగా ఉంది. శర్వానంద్ మరియు అనన్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అంజలి ఆత్మ విశ్వాసం గల యువతి మధుమతి పాత్రలో అధ్బుతంగా నటించింది. తను మంచి నటి. చిత్రంలో యాక్సిడెంట్ సన్నివేశాన్ని చాలా బాగా చిత్రీకరించారు. ఈ మధ్య వచ్చిన చిత్రాలలో ఇలాంటి సన్నివేశాలలో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల్లా అనిపిస్తాయి అదే చిత్రానికి బాగా ప్లస్ అయింది. పాత్రల మధ్య ఎమోషన్ బాగా బలంగా చూపించాడు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసారు. క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగా తీసారు. ఈ క్రెడిట్ అంత దర్శకుడు శరవణన్ కి దక్కుతుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాలో కొన్ని సన్నివేశాలు డల్ గా ఉండటం, తమిళంలో తీసిన కావడంతో అక్కడ గుర్తు తెలిపే బోర్డులు తెలుగులోకి మార్చుకోకపోవడం, అక్కడ తమిళ వాతావరణాన్ని తెలుగుకి తగ్గట్లుగా సరిగా చూపించలేకపోయారు. పాటలు అంత బాగా లేవు.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ బావుంది. యాక్సిడెంట్ కి ముందు సన్నివేశాలు చాలా బాగా తీసారు. సత్య అందించిన నేపధ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ ఇంకా బాగా
చేసి ఉండాల్సి ఉంది. నిర్మాణాత్మక విలువలు బావున్నాయి.
తీర్పు:
జర్నీ చిత్రం మొదటి నుండి సాఫీగా సాగుతూ చివర్లో గుండెను తాకుతుంది. సినిమాలో కొన్ని విసుగు కలిగించే సన్నివేశాలు ఉన్నాయి మొదటి భాగంలో
యాక్సిడెంట్ సన్నివేశాలు పాత్రల మధ్య ఎమోషన్ బాగా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
—
Ashok Reddy M
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
Journey Review English Version