సమీక్ష : మగ మహారాజు – ప్రేక్షకులను మెప్పించలేకపోయిన రాజు.!

సమీక్ష : మగ మహారాజు – ప్రేక్షకులను మెప్పించలేకపోయిన రాజు.!

Published on Feb 28, 2015 9:25 AM IST
Maga Maharaju

విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : సుందర్ సి

నిర్మాత : విశాల్

సంగీతం : హిప్ హాప్ తమీజ

నటీనటులు : విశాల్, హన్సిక, వైభవ్ రెడ్డి, సంతానం, రమ్యకృష్ణ…

విశాల్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమిళ సినిమా ‘ఆంబల’. విశాల్ నిర్మాత. తెలుగులో ‘మగ మహారాజు’గా అనువదించారు. ఇటివల హారర్ కామెడీ ‘చంద్రకళ’తో సుందర్.సి తెలుగులో మంచి విజయం అందుకున్నారు. హీరోగా విశాల్ నటించిన చివరి సినిమా ‘పూజ’ కూడా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ‘మగ మహారాజు’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రమ్యకృష్ణ, వైభవ్ రెడ్డి, సంతానం, మధురిమ, మధులత.. తదితర భారీ తారాగణం నటించిన ‘మగ మహారాజు’ అంచనాలను అందుకుందో..? లేదో..? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :

తన తల్లితో ఉంటూ సొంతంగా బిజినెస్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తో హ్యాపీగా లైఫ్ ని గడిపే కుర్రాడు కృష్ణ (విశాల్). విశాల్ ఓ రోజు మాయ(హన్సిక)ని చూసి ప్రేమలో పడతాడు. కృష్ణ తనకు తెలియకుండానే ఆర్డిఎక్స్ రాజశేఖర్(సంతానం)ని వాడుకొని మాయ ప్రేమని దక్కించుకుంటాడు. కానీ ఓ సంఘటన వల్ల మాయ కృష్ణని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడే తన తల్లి ద్వారా కృష్ణకి తన తండ్రి గతం తెలుస్తుంది. దాంతో కృష్ణ తన తండ్రి కేశవరాజు(ప్రభు)ని వెతుక్కుంటూ వెళ్తాడు. కేశవ రాజుని కలుసుకున్న తర్వాత కృష్ణకి సొంత తమ్ముల్లైన కుమార్(వైభవ్), కిషన్(సతీష్) ఉన్నారని తెలుస్తుంది. అప్పుడే కేశవరాజు ఈ ముగ్గురి కొడుకుల్ని ఒక కోరిక కోరతాడు.

అదేమిటంటే నేను ఎంతో ఇష్టపడే నా చెల్లెళ్ళు పెద్ద బంగారం(రమ్యకృష్ణ), చిన్న బంగారం(కిరణ్ రాథోడ్), బుజ్జి బంగారం(ఐశ్వర్య)లు నా మీద కోపంతో ఉన్నారు. వాళ్ళకి నా మీద కోపాన్ని పోగొట్టి వాళ్ళ కూతుళ్ళని మీ ముగ్గురు పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి అత్తలని ఒప్పించడానికి తెనాలి వెళ్తారు. అలా వెళ్ళిన కృష్ణ, కుమార్, కిషన్ లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.? ఎలా తమ అత్తయ్యలను, వాళ్ళ కూతుళ్ళను బుట్టలో వేసారు.? ముగ్గురు చెల్లెళ్ళు చివరికి కేశవరాజుని క్షమించారా.? అసలు మాయ కృష్ణని వదిలేయడానికి గల కారణం ఏమిటి.? అలాగే విడిపోయిన కృష్ణ – మాయలు కలిసారా? అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి చాలా ఆపేద్ద ప్లస్ పాయింట్ ఇది తమిళ డబ్బింగ్ సినిమా అయిన తెలుగు వారికి పరిచయం ఉన్న నటీనటులు ఎక్కువగా ఇందులో ఉండడం. విశాల్ ఇందులో ఇప్పటివరకూ చేయని పాత్ర ఏమీ ట్రై చెయ్యలేదు. కానీ ఇచ్చిన పాత్రకి తన వంతు న్యాయం చేసాడు. వైభవ్, సతీష్ లు కూడా బాగా చేసారు. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. హన్సిక ఈ సినిమాలో మోస్ట్ గ్లామరస్ పాత్రలో కనిపించి మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పాటల్లో ఎక్కువగా అందాలు ఆరబోసింది. తెలుగు ప్రేక్షకులకు హన్సిక ఇంత హాట్ గా కనిపించడం ఇదే తొలిసారి ఏమో..

ఇక సంతానం ఫస్ట్ హాఫ్ మొదట్లో, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చి తన స్టైల్ పంచ్ డైలాగ్స్ తో కాసేపు నవ్విస్తాడు. ఇకపోతే రమ్య కృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇది కాకుండా హన్సిక తర్వాత హీరోయిన్స్ గా కనిపించిన మధురిమ, మాధవీలతా వారికి స్క్రీన్ టైం దొరికినప్పుడల్లా గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సెకండాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. పూనం బజ్వా స్పెషల్ సాంగ్ లో బాగా హాట్ హాట్ గా కనిపించి ముందు బెంచ్ వారి చేత డాన్సులు వేయిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఒక సినిమాకి ఆయువు పట్టుగా నిలిచేవి కథ – కథనం – దర్శకత్వం. ఈ మూడే ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్స్. ఎలా అనేది చెబుతా.. ఒకే కుటుంబం నుంచి విడిపోయిన అన్న చెల్లెళ్ళను తమ వారసులు వచ్చి కలపడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికి ఎంతో మంది దర్శకులు తీసారు. కొంతమంది ఈ స్టొరీ లైన్ తో హిట్ కొడితే, కొందరు ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయిన లిస్టులో ఈ సినిమా కథ కూడా చేరింది. కథనంలో ఒక్క ట్విస్ట్ కూడా లేదు చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. అంతే కాకుండా జరుగుతున్న సీన్ తర్వాత ఏం సీన్ వస్తుందనేది ఈజీగా చెప్పేయచ్చు. ఇక కథ, కథనంలో దమ్ము లేకపోయినా పర్లేదు, దర్శకుడు కూడా చాలా కామెడీగా ఈ సినిమాని తీయడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది.

కామెడీ అని ఎందుకు అన్నాను అంటే.. ఈ కథలో పలు ఎమోషన్స్ ఉంటాయి ఉదాహరణకి ఫ్యామిలీ కాపాడుకోవడం కోసం హీరో చేసే ఫైట్, లేదా సెంటిమెంట్ సీన్.. ఇలాంటి సీన్స్ లో అస్సలు ఆ ఎమోషన్స్ ని పడించకుండా, చాలా సిల్లీగా చేయడం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. ఇకపోతే మన హీరో ప్రతి ఫైట్ లో ఓ 50 మందిని గాల్లోకి లేపి కొట్టేస్తుంటాడు. ఒక ఫైట్ అనుకుంటే ఓకే, కానీ ప్రతి ఫైట్ అలానే ఉండడం అందులో ఇంటెన్స్ లేకపోవడం వలన ఫైట్స్ ఆడియన్స్ కి నచ్చవు. పాటలు కూడా సందర్భానికి సంబంధం లేకుండా వచ్చేస్తుంటాయి. ఇక లాజిక్స్ అనేవి అస్సలు ఉండవు. ఈ సినిమాలో విలన్ పాత్రకి పర్ఫెక్ట్ క్యారెక్టర్ లేదు. విలన్ ఉండాలి అంటే ఉన్నాడు అన్నట్టు పెట్టారు. విలన్ పవర్ఫుల్ గా ఉంటేనే కదా హీరో – విలన్ మధ్య యుద్ధం రక్తి కట్టేది. ఈ బేసిక్ లాజిక్ ని కూడా ఫాలో అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో బెస్ట్ ఇచ్చిన వారు ఒక ఇద్దరే ఉన్నారు.. వారి గురించి ముందు చెప్పేసుకుందాం.. గోపి అమర్నాథ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటల్లో అబ్రాడ్ లోకేషన్స్ మరియు పొల్లాచ్చిలో షూట్ చేసిన విజువల్స్ సింప్లీ సూపర్బ్. గోపి విజువల్స్ లేకపోతే థియేటర్లో ఆడియన్స్ కి చూడటానికి ఏమీ మిగిలేది కాదేమో. ఇకపోతే విశాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. సినిమా కథ రేంజ్ కి మించి ఎక్కువ ఖర్చు పెట్టారు. అందుకే విజువల్స్ మరీ గ్రాండ్ గా ఉన్నాయి. దీని తర్వాత బెటర్ అంటే తెలుగులో శశాంక్ వెన్నెలకంటి రాసిన డైలాగ్స్. ఇందులో కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ లో ఒక్క పాట కూడా మళ్ళీ వినాలనిపించేలా లేదు. ఇంకా చెప్పాలంటే పాటలో లిరిక్స్ కంటే సౌండ్స్ ఎక్కువ వినపడుతుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరీ లౌడ్ గా ఉంటుంది. ప్రతి చోటా సందర్భానికి మించి శృతి మించి మ్యూజిక్ ఇచ్చాడు. చెప్పాలంటే చాలా వరకూ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టేది తమీజా మ్యూజిక్.

ఇక శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా అంత గొప్పగా లేదు. సినిమా మొదలైనప్పుడు మనకు 10 ఏళ్ళు సినిమా అయ్యేలోపు 15 ఏళ్ళు గడిచిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది, అంతే లెంగ్తీగా సినిమాని ఎడిట్ చేసారు. ఇక కథ – కథనం – దర్శకత్వం డీల్ చేసింది సుందర్ సి. పైనే చెప్పానుగా ఏదీ సరిగా వర్క్ అవుట్ చెయ్యలేదు. దాని వల్ల ఒక ఫ్లాప్ సినిమాని అందించి, డైరెక్టర్ గా తనకున్న పేరుని తానే పాడు చేసుకున్నాడు.

తీర్పు :

‘పూజ’ లాంటి కమర్షియల్ సినిమాతో ఎంటర్టైన్ చేసిన విశాల్ ఈ సారి ‘మగ మహారాజు’తో తెలుగు ప్రేక్షకులను సరిగా ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు. వెరీ రొటీన్ అండ్ ఓల్డ్ స్టొరీతో చేసిన ఈ సినిమాలో విశాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు కూడా సరిగా లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు, సంతానం కామెడీ, హన్సిక గ్లామర్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే ఓల్డ్ స్టొరీ, వెరీ బోరింగ్ స్క్రీన్ ప్లే, వీక్ డైరెక్షన్, మినిమమ్ ఎంటర్ టైన్మెంట్ కూడా లేకపోవడం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా విశాల్ నుంచి వచ్చిన మరో బిలో యావరేజ్ సినిమా ‘మగ మహారాజు’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు