ఓటీటీ రివ్యూ : ‘మేక సూరి 2’ – స్లోగా సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

ఓటీటీ రివ్యూ : ‘మేక సూరి 2’ – స్లోగా సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Published on Nov 27, 2020 7:24 PM IST
Anaganaga O Athidhi Telugu Movie Review

విడుదల తేదీ : నవంబర్ 27th,2020

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : అభినయ్, సమయ తదితరులు

దర్శకత్వం : త్రినాధ్ వెలిశిల

రచన : త్రినాధ్ వెలిశిల

నిర్మాత : కార్తీక్ కంచెర్ల

 

దర్శకుడు త్రినాధ్ వెలిశిల దర్శకత్వంలో ‘‘క్రైమ్‌ జానర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘మేక సూరి 2′. థియేటర్‌ ఆర్టిస్టులు సుమయ, అభినయ్‌ను నటీనటులుగా పరిచయం చేస్తూ.. కార్తీక్ కంచెర్ల సింబా ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ :

మేక సూరి(అభినయ్‌) వెనుక ఉన్న దళం ఏమిటి ? ఆ దళానికి అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? దళంతో కలిసి మేక సూరి గోపాలరావును ఎందుకు చంపాడు ? అనే కోణంలో మొదలైన ఈ సీక్వెల్.. మేక సూరి, దివాకర్ లను పోలీసుల నుండి తప్పించడానికి అన్నలు ఏం ప్లాన్ చేసారు ? ఇంతకీ పోలీసుల నుండి మేక సూరి, దివాకర్ లను తప్పించారా లేదా ? అసలు అన్నలు సూరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ? సూర్య భార్యను ఎవరు చంపారు ? వారి పై సూరి ఎలా పగ తీర్చుకున్నాడు ? ఈ క్రమంలో పోలీస్ వీరభద్రంకు సూరి పై ఉన్న పగ ఏమిటి ? అతనెందుకు సూరిని చంపాలనుకుంటున్నాడు ? చివరకి వీరభద్రం సూరికి చేసిన సాయం ఏమిటి ? మొత్తంగా మేక సూరి కథ ఎలా ముగిసింది ? అనేదే మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర సూరి పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘మేక సూరి 2′ సినిమా వైవిధ్యంగానే సాగింది. ముఖ్యంగా సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన అభినయ్ తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.
.
పోలీస్ వీరభద్రం పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు. ఆయన పలికిన మాటలు కొన్ని బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. ఇక అన్నలుగా నటించిన నటులు వైల్డ్ యాక్టింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు త్రినాధ్ వెలిశిల బాగానే ప్రయత్నించాడు. ముఖ్యంగా నేటివిటికి తగిన సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు.

 

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు సూరి క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్ బాగాలేదు. అయితే దర్శకుడు దరకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరియ క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగటం కూడా బాగాలేదు.
ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యూలర్ రివేంజ్ స్టోరీలో లవ్ అండ్ రివేంజ్ యాక్షన్ డ్రామా పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు త్రినాధ్ చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చున పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తోంది. అయితే లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత కార్తీక్ పాటించిన నిర్మాణ విలువులు పర్వాలేదు.

 

తీర్పు:

‘మేక సూరి’ సీక్వెల్ అంటూ వచ్చిన ఈ క్రైమ్ రివేంజ్ యాక్షన్ డ్రామా కొన్ని చోట్ల ఆకట్టుకున్నా… సినిమా పరంగా మాత్రం మెప్పించలేకపోయింది. కానీ కథలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో దర్శకుడు పర్వాలేదనిపించాడు. అయితే కథకథనాలు స్లోగా సాగడం, దీనికితోడు డీసెంట్ అండ్ ఫ్యామిలీ సినిమాల ప్రేక్షకులను నిరుత్సాహ పరిచే విధంగా సినిమా ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చదు. అయితే యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు