ప్రయోగాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ ఇప్పుడు కొత్త చిత్రం మిస్టర్ నోకియా తో మరో ప్రయోగం చెయ్యబోతున్నారు సనా ఖాన్ మరియు కృతి కర్భంధ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అని కన్నెగంటి దర్శకత్వం వహించారు డి.ఎస్.రావు నిర్మించారు యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు ఈ మధ్యనే విడుదల అయ్యాయి ఇప్పుడు ఈ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.
1.పాట : నో.కియా
గాయకులు : రంజిత్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
ఈ పాటలో రంజిత్ గాత్రానికి అద్బుతమయిన మ్యూజిక్ తోడవ్వడంతో వినటానికి చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు వినగా ఇది వ్యసనంగా మారే అవకాశం ఉంది. అంత బాగుంది పాట. శాస్త్రి గారు అందించిన సాహిత్యం పాటకు సరిపోయేలా ఉంది. రంజిత్ తన గాత్రం తో పాటకు ప్రాణం పోశారు యువన్ అద్బుతమయిన మ్యూజిక్ అందించారు.
2.పాట : ఒకే ఒక జీవితం
గాయకులు : రంజిత్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
చాలా సున్నితమయిన భావాలు ఉన్న పాట ఇది ఇందులో సాహిత్యం కూడా జోగయ్య శాస్త్రి గారు మనసుని హత్తుకునేల రాశారు ప్రతి శ్రోత మనసుని చేరుకునేల హరిహరన్ తన గాత్రం తో మాయ జాలం చేసారు యువన్ తన మ్యూజిక్ తో అందరిని కట్టిపడేశారు.
3 .పాట : పిస్తా పిస్తా
గాయకులు : కార్తిక్,యువన్
సాహిత్యం : మంచు మనోజ్
తమిళ వేదం “వానం” చిత్రం లో ఉన్న ఈ పాట ని అలాగే తెలుగు లో పెట్టారు ఈ పాటకి సాహిత్యం మనోజ్ అందించటం విశేషం.కార్తిక్ మరియు యువన్ సాహిత్యానికి వారి గాత్రం తో న్యాయం చేశారు ఈ తరానికి చేరువయ్యేలా యువన్ మ్యూజిక్ ఉంది ఈ పాట ఇంకొన్ని రోజుల్లో యువతను ఉర్రుతలూగించబోతుంది.
4 .పాట : ప్రాణం పోయే బాధ
గాయకులు : యువన్
సాహిత్యం : మంచు మనోజ్
బాధాకరమయిన ఈ పాటలో యువన్ తన గాత్రం తో న్యాయం చేశారు మనోజ్ అందించిన సాహిత్యం కూడా అద్బుతంగా ఉంది. కథానాయకుడి బాధ ను బాగా చూపించే పాట ఇది.
5 .పాట : నో మనీ నో హనీ
గాయకులు : కార్తిక్,ప్రేమ్ జి
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
కల్లు పాక లో పాడుకునే పాటల ఉంది ఇది ఇందులో వచ్చే సాహిత్యం చాలా బాగున్నాయి మొత్తం డబ్బు మనుషులని ఎం చేస్తుంది అనే దాని మీద నడిచే సాహిత్యం శాస్త్రి గారు చాల బాగా రాశారు. కార్తిక్ మరియు ప్రేమ్ జి వారి గాత్రం తో పాటకు న్యాయం చేశారు. ఈ పాట కూడా తమిళ “వేదం” ” వానం” చిత్రం లో ఉన్నదే.
6 .పాట : ఏ జన్మ బంధమో
గాయకులు : రంజిత్ ప్రియా హిమేష్
సాహిత్యం : లక్ష్మి భూపాల్
ఆల్బం లో ఈ పాట ఒకే ఒక డ్యూయెట్ ఈ పాట తమిళ చిత్రం “కాదల్ కొండేన్” చిత్రం లో “నేన్జియోడ కలన్దిడు” అన్న పాట ఈ పాట లో ప్రియా హిమేష్ గాత్రం తేనె ల ఉంటుంది చివర్లో వచ్చే రంజిత్ గాత్రం కూడా తోడవడంతో పాట అద్బుతంగా అనిపిస్తుంది ఈ పాటతో యువన్ తన తండ్రి ఇళయరాజా ని తలపిస్తారు.
7 .పాట : థీం మ్యూజిక్ నో.కియా
గాయకులు : బ్లేజీ
సాహిత్యం : లక్ష్మి భూపాల్
ఈ థీం సాంగ్ కొత్త అనుభవాన్ని ఇస్తుంది బ్లాజీ లక్ష్మి భూపాల్ రచించిన సాహిత్యాన్ని బాగా పలికించారు ఈ పాట పేర్లు పడేప్పుడు రావచ్చు .
తీర్పు: ఈ తరం యువతకి బాగా నచ్చే ఆల్బం మిస్టర్ నోకియా. ఈ మధ్యలో వచ్చిన వాటిలో మంచి ఆల్బం అని చెప్పుకోవచ్చు పంజా చిత్రం తరువాత యువన్ మళ్ళి తనని నిరూపించుకున్నారు ఈ ఆల్బం ఏ మరియు బి సెంటర్ ప్రజలకి నచ్చుతుంది. ఈ ఆల్బం లో నా ఎంపిక గా “నో.కియా”,”ఒకే ఒక జీవితం”,”పిస్తా పిస్తా”మరియు “ఏ జన్మ బంధమో” . మంచి ఆల్బం గా మిగిలిపోతుంది నేను మళ్ళి వినటానికి వెళ్తున్నా
అనువాదం : రv
Clicke Here For Mr. Nokia Audio Review