సమీక్ష : ‘పడ్డానండి ప్రేమలో మరి’ – రోమాన్స్ ఓకే.

సమీక్ష : ‘పడ్డానండి ప్రేమలో మరి’ – రోమాన్స్ ఓకే.

Published on Feb 14, 2015 11:10 PM IST
Paddanandi-Premalo-Mari-rev విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : మహేష్‌ ఉప్పుటూరి
నిర్మాత : నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌
సంగీతం : ఎ.ఆర్‌.ఖుద్దూస్‌
నటీనటులు : వరుణ్ సందేశ్, వితికా శేరు, అరవింద్

యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో కొంత డల్ ఫేజ్ లో ఉన్నాడు. తాజాగా నటించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా తనకు పూర్వ వైభవం తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వితికా శేరు హీరోయిన్ గా నటించిన సినిమాకు మహేష్‌ ఉప్పుటూరి దర్శకుడు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌ నిర్మాత. ప్రేమికుల రోజు కానుకగా నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :
రామ్ (వరుణ్ సందేశ్) ఓ కాలేజీ స్టూడెంట్. శ్రావణి (వితికా శేరు)తో ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత శ్రావణి, రామ్ తన ప్రేమ అంగీకరిస్తుంది. సంతోషంగా సమయం గడిచిపోతున్న సమయంలో వీరి జీవితంలో ఓ మలుపు. మనస్పర్ధల కారణంగా ఈ జంట విడిపోతారు.

రామ్, శ్రావణి విడిపోయిన సమయంలో.. లంకపతి (అరవింద్) అనే భయంకరమైన గూండా కళ్ళు శ్రావణిపై పడతాయి. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. శ్రావణిని అనునిత్యం ఫాలో అవుతూ.. సక్సెస్ ఫుల్ గా కిడ్నాప్ చేస్తాడు.

కిడ్నాప్ నుండి శ్రావణిని రామ్ ఎలా రక్షించాడు..? వీరిద్దరి మధ్య మనస్పర్ధలను ఎలా తొలగించుకున్నారు..? అనేది మిగతా సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మలుపులు (ట్విస్టులు) ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని సరైన సమయంలో దర్శకుడు ఉపయోగించుకున్న తీరు బాగుంది. ఆ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా అంతటిని తన భుజాలపై నడిపించాడు. నటనలో పరిపక్వత చూపాడు. యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. క్లైమాక్స్ లో మెయిన్ విలన్, హీరో మధ్య ట్విస్ట్ ను బాగా ఎగ్జిక్యూట్ చేశారు.

బబ్లీ క్యారెక్టర్లో హీరోయిన్ వితికా శేరు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. వరుణ్ సందేశ్, వితికా శేరుల మధ్య కెమిస్ట్రీ బాగుంది. తెరపై అందంగా కనిపించింది. విలన్ క్యారెక్టర్లో అరవింద్ బాగా సూటయ్యాడు, అలాగే మంచి నటన కనబరిచాడు. తాగుబోతు రమేష్, వేణులు కాసేపు నవ్వించారు. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా డీసెంట్ మూమెంట్స్ ఉన్నాయి. సపోర్టింగ్ క్యారెక్టర్లో పోసాని కృష్ణ మురళి సెట్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో సాంగ్స్ సాఫీగా ముందుకు వెళ్తున్న సినిమా ఫ్లోను దెబ్బ తీశాయి. సమయం సందర్భం లేకుండా వచ్చే ఐటెం సాంగును తీసేయొచ్చు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాలో ఎం జరుగుతుందో ఈజీ ఊహించవచ్చు. 30 ఇయర్స్ పృథ్వీ నటించిన ఎపిసోడ్ కొంచం అతిగా అనిపించింది.

ఈ సినిమాలో వినోదం లేకపోవడం మరో మేజర్ మైనస్ పాయింట్. దర్శక రచయితలకు స్క్రిప్ట్ లో కామెడీ యాడ్ చేయడానికి తగినంత స్కోప్ ఉన్నా.. అలానే వదిలేశారు. సినిమాలో మరింత కామెడీ ఉండుంటే.. అవుట్ పుట్ ఇంకా బాగుండేది. కామెడీ మిస్ కావడం మైనస్ అని చెప్పాలి.

సాంకేతిక విభాగం :

సినిమాలో పాటలు పర్వాలేదు, కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలు సినిమాకు అవరోధంగా మారాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్నాడు ప్రాంత పరిసరాలను అందాలను చూపించారు. స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమాలో చాలా వరకు ట్విస్టులు సరైన సమయంలో వచ్చాయి. వాటిని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మహేష్ ఉప్పుటూరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఒక సాధారణమైన కథను డీసెంట్ మూమెంట్స్ తో ప్రేక్షకులను మెప్పించే విధంగా చెప్పాడు. ఎడిటింగ్ బాగోలేదు. సెకండ్ హాఫ్ లో ఓ పాట మరియు కొన్ని సన్నివేశాలను సులభంగా కత్తిరించేయ వచ్చు.

తీర్పు :

వరుణ్ సందేశ్ గత సినిమాల కంటే.. ‘పడ్డానండి ప్రేమలో మరి’ కొంచం బెటర్. ప్రేక్షకులకు ఈసారి కాస్త మంచి సినిమాను అందించాడు. ఆసక్తికరమైన మలుపులు (ఇంట్రెస్టింగ్ ట్విస్టులు) మరియు వరుణ్, వితికా శేరుల డీసెంట్ పెర్ఫార్మన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. సినిమాలో వినోదం లేకపోవడం మరియు సెకండ్ హాఫ్ లో బలవంతంగా ఇరికించిన కొన్ని సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మీకు ఈ వారంతంలో తప్పకుండా పూర్తి చేయవలసిన పనులు లేకపోతే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు