విడుదల తేదీ : 02 నవంబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5 | ||
దర్శకుడు : సుశీంధ్రన్ | ||
నిర్మాత : విశాల్ | ||
సంగీతం : డి. ఇమాన్ | ||
నటీనటులు :విశాల్, లక్ష్మీ మీనన్.. |
కెరీర్ మొదట్లో తెలుగులో వరుసగా హిట్స్ అందుకున్న విశాల్ ఈ మధ్య కాలంలో హిట్స్ అందుకోవడంలో బాగా వెనుకబడ్డాడు. ఈ సారి ఎలాగన్నా హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో సుశీంధ్రన్ దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థలో రియాలిటీకి దగ్గరగా ‘పల్నాడు’ అనే సినిమా చేసాడు. దీపావళి కానుకగా ఆ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమాతో విశాల్ హీర్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం…
కథ :
ఓపెన్ చేస్తే పౌరుషాల నాడు పల్నాడు.. ఆ ఊర్లో ఏ వ్యాపారం చెయ్యాలన్నా శంకరన్న కనుసన్నల్లోనే జరగాలి. శంకరన్న చనిపోగానే అతనికి రైట్ హ్యాండ్ గా ఉన్న కాటం రవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాడు. పల్నాడులో అతనే దందాలు చేస్తుంటాడు. ఇక విలన్ గురించి పక్కన పెడితే అదే ఊర్లో రెండు కథలు జరుగుతుంటాయి.
మొదటిది – అదే ఊర్లో శివ కుమార్(విశాల్) ఒక మొబైల్ షాప్ రన్ చేస్తుంటాడు. శివ కుమార్ చాలా భయస్తుడు, ఎవరి జోలికీ వెళ్ళడు. శివ ఫ్రెండ్ శేషు(విక్రాంత్) కాస్త ధైర్యవంతుడు. ఎలాంటి గొడవల్లో అయినా శివకి శేషు సాయం చేస్తుంటాడు. అలాంటి శేషు ఒక కారణం వల్ల కాటమ రవిని చంపాలనుకుంటాడు.
రెండవది ఇది జరిగిన కొద్ది రోజులకి నాగరాజు అనే ఓ క్వారీ ఇంజనీర్ చనిపోతాడు. దాంతో అమాయకుడైన విశాల్ కూడా కాటమ రవిని చంపాలనుకుంటాడు. అలా చేస్తున్న సమయంలో విశాల్ కి మరో విషయం తెలుస్తుంది. దాంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది.
అసలు శేషు ఎందువల్ల కాటమ రవిని చంపాలనుకున్నాడు? అలాగే నగరాజుకి – విశాల్ కి ఉన్న సంబంధం ఏమిటి? భయస్తుడైన విశాల్ కాటమ రవి లాంటి వ్యక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? విశాల్ కి తెలిసిన మరో నిజం ఏమిటనేది? తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్ :
సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఎమోషనల్ సీన్స్ లో చాలా మంచి నటనని కనబరిచాడు. ఈ సినిమాలో మీరు ఓ కొత్త విశాల్ ని చూడొచ్చు. ఎప్పుడూ విలన్స్ ని చితకబాదే విశాల్ కాకుండా నలుగురు చేత కొట్టించుకునే పాత్ర చేసాడు. ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. లక్ష్మీ మీనన్ ది సినిమా కథకి అవసరంలేని పాత్ర. కానీ చూడటానికి మాత్రం బాగుంది. విక్రాంత్ నటన బాగుంది.
విలన్సి పాత్ర చేసినతని నటన బాగుంది. సినిమా మొదటి అర్ధ భాగంలో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా మొదటి అర్ధ భాగం కాస్త కామెడీగా సాగిపోతున్నప్పటికీ కథ మాత్రం ముందుకు కదలదు. క్లైమాక్స్ 20 నిమిషాలు తప్ప సెకండాఫ్ మొత్తం బోర్ కొడుతుంది. ఎంత బోర్ కొడుతుందో అంత రొటీన్ గా కూడా అనిపిస్తుంది. సినిమాలో రెండు డిఫరెంట్ ట్రాక్స్ వేసుకొని కథని రాసుకున్నప్పటికీ దానికి సరైన స్క్రీన్ ప్లే తోడవ్వకపోవడంతో సినిమాలో వచ్చే ట్విస్ట్ లని ఊహించేయవచ్చు.
సినిమాలో పాటల వాల్ల అసలు ఉపయోగమే లేదు, ఒక్క పాట కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోవడంతో వాళ్ళు పాటోస్తే లేచి బయటకి వెళ్ళిపోతున్నారు. సినిమా రియాలిటీకి దగ్గరగా ఉండడం వల్ల తెలుగు ప్రేక్షకులకి పెద్దగా నచ్చదు. విశాల్ – లక్ష్మీ మీనన్ మధ్య లవ్ ట్రాక్ చెప్పుకునే స్థాయిలో లేదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పు కోవాల్సింది డి. ఇమాన్ మ్యూజిక్ గురించి.. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కెవ్వు కేక. ఎక్కడన్నా సీన్ కాస్త డల్ గా ఉంది అనిపిస్తున్న టైంలో కూడా ఆ ఫీల్ మిస్ అవ్వకుండా తన మ్యూజిక్ తో కవర్ చేసాడు. మది సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. సెకండాఫ్ విషయంలో ఎడిటర్ కాస్త కేర్ తీసుకొని ఉంటా బాగుండేది. డైలాగ్స్ ఓకే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ డైలాగ్స్ ప్రేక్షకుల్ని నవ్వించాయి.
ఇక డైరెక్టర్ సుశీంధ్రన్ గురించి చెప్పాలంటే ఈయన ఎప్పుడూ ఒక చిన్న పాయింట్ ని లేదా క్లైమాక్స్ సీన్ ఒకటి అనుకోని దానికి తగ్గట్టుగా సినిమాని అల్లుకుంటాడు. ఈ సినిమా విషయంలో కూడా క్లైమాక్స్ రాసుకొని సినిమాని తీసాడు. అందుకే క్లైమాక్స్ ని అందరికీ కనెక్ట్ చెయ్యగలిగాడు. కానీ మిగతా పార్ట్ ని ఆ రేంజ్ లో కనెక్ట్ చెయ్యలేకపోయాడు. డైరెక్టర్ గా సుశీంధ్రన్ కి యావరేజ్ మార్కులు వేయచ్చు.
తీర్పు :
విశాల్ అన్ని యాక్షన్ సినిమాల్లానే ఈ సినిమా కూడా ఉంటుందని ‘పల్నాడు’ కి వెళితే మీరు కాస్త నిరుత్సాహానికి గురవుతారు. కొత్త విశాల్ సినిమా చూడాలనుకొని వెళితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశం ఉంది. విశాల్ నటన, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్ అయితే సెకండాఫ్, ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. చివరిగా ‘పల్నాడు’ – టైటిల్ అంత పవర్ఫుల్ గా లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
రాఘవ