​​సమీక్ష : పాండవులు పాండవులు తుమ్మెద – మంచు వారి ఎంటర్టైనర్

​​సమీక్ష : పాండవులు పాండవులు తుమ్మెద – మంచు వారి ఎంటర్టైనర్

Published on Feb 1, 2014 3:10 AM IST
Pandavulu-Pandavulu-Thummed1 విడుదల తేదీ : 31 జనవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : శ్రీవాస్
నిర్మాత : మోహన్ బాబు
సంగీతం : బప్ప లహరి, అచ్చు
నటీనటులు : మోహన్ బాబు, విష్ణు, మనోజ్, రవీన టాండన్, హన్సిక, ప్రణిత

మంచు ఫ్యామిలీ వారి మల్టీ స్టారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. చాలా రోజుల తరువాత బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తిరిగి తెలుగులో ఈ సినిమాలో నటించింది. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి అంచనాలను నమోదు చేసుకుంది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూద్దాం.

కథ :

నాయుడు (మోహన్ బాబు) బ్యాంకాక్ లో టూరిస్ట్ గైడ్ గా నివసిస్తూ వుంటాడు. అక్కడ అతనితో పాటు అతని దత్తపుత్రులు మంచు మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ తో కలిసి ఉంటాడు. నాయుడు గతంలో రవీనా టాండన్ ని ప్రేమిస్తాడు. వారిద్దరూ విడిపోవడంతో అతను ఎక్కువగా ఆమె గురిచే ఆలోచిస్తూ వుంటాడు.

అదృష్టం కొద్ది రవీనా టాండన్ కూడా అతను ఉన్న నగరంలోనే ఉంటుంది. రవీన టాండన్ కూడా ఇద్దరిని విజయ్/ విజ్జు(మంచు విష్ణు) మరియు వెన్నెల కిషోర్ లను దత్తత తీసుకుంటుంది. విజ్జు వారితో ఉండే హనీ (హన్సిక)ని ప్రేమిస్తాడు.

అనుకోకుండా ఒకరోజు నాయుడు, రవీనా టాండన్ ఒకరికొకరు ఎదురు పడతారు. అప్పుడు వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి వద్ద ఉన్న పిల్లలకు ఈ విషయాన్ని చెప్పి వారి అంగీకారంకోరతారు. దానితో నాయుడు, రవీన పెళ్ళి జరిగిపోతుంది.

ఇంతలో అనుకోకుండా హనీ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. ఆమె కోసం సుయోధన (ముకేష్ ఋషి) వెతుకుతూ వుంటాడు. అతను కౌరవపురమ్ డాన్. అతను ఒక బెట్టింగ్ లో హనీని గెలుచుకొని అతని కొడుకు గజాకి ఇచ్చి వివాహం చేయాలని చూస్తూ వుంటాడు. అప్పుడు నాయుడు, అతని ఫ్యామిలీ కలిసి జరిగిన విషయాన్ని తెలుసుకొని సుయోధన ఇంటికి వేరు వేరుగా వెళ్ళి హనీ, గజలా పెళ్లిని చెడగొట్టలనుకుంటారు. వారు ఆ పని ఎలా చేశారు? అనేది తెలుసుకోవాలనుకుంటే ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డా. మోహన్ బాబుకి నటుడిగా, డైలాగ్ డెలివరీ పరంగా మంచి పేరుంది. ఈ సినిమాలో ఆయన ఆ రెండు విషయాలను బాగా ప్రెజెంట్ చేసారు. టూరిస్ట్ గైడ్ నాయుడుగా ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే సెకండాఫ్ లో గ్రహరాజగా మంచి ననతనని కనబరిచాడు.

విష్ణు, మనోజ్ లు వారికి ఇచ్చిన పాత్రలకు తగిన న్యాయం చేశారు. మనోజ్ సమయానికి తగ్గట్టుగా కామెడీ చేశాడు. సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ హైలెట్. హన్సిక, ప్రణిత గ్లామరస్ గా కనిపించారు. రవీనా టాండన్ ఇప్పటికీ చూడటానికి చాలా బాగుంది. ఆమెను ఎంచుకున్న పాత్రకి రవీనా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సెకండాఫ్ లో బ్రహ్మానందం బాపురే పాత్రలో ఎంటర్టైన్ చేశారు. వెన్నెల కిషోర్, రఘు బాబు, ముకేష్ రుషి, తెలంగాణ శకుంతలలు చిన్న పాత్రలలో కనిపించారు, కానీ అందరూ బాగా నటించారు.

ఈ సినిమా సెకండాఫ్ లో మంచి ఎంటర్టైనింగ్ ఉంది. ఇంటర్వల్ సీన్ లో అన్ని ఎమోషన్స్ ని బాగా చూపించి ఆకట్టుకునేలా చేసారు.

మైనస్ పాయింట్స్ :

తనీష్, వరుణ్ సందేశ్ లకు ఈ సినిమాలో పెద్దగా పాత్రలు లేవు. ఎంఎస్ నారాయణ చేసిన కామెడీ సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా అనిపించవు.

కథ ఎప్పటిలాగే రొటీన్ గా ఊహించే విదంగా ఉంది. ‘రెడీ’, ‘డీ’, ‘కందీరిగ’ సినిమాల మాదిరిగా వుంది. ఈ సినిమాలలోలా హీరో అతని ఫ్యామిలీ విలన్ ఉన్న చోటుకు వెళ్ళి అతని ఫ్యామిలీని మంచి వారిగా మార్చేస్తారు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తి ఏమివుండదు. తరువాత జరిగే సన్నివేశాన్ని ఊహించవచ్చు.

ఈ సినిమా క్లైమాక్స్ లో వేగం తగ్గుతుంది. అలాగే అకస్మాత్తుగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా వేగానికి సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పాలి. ఇవి సినిమాకి ఎటువంటి హెల్ప్ చేయలేదు. సెకండాఫ్ లో సినిమాని కాస్త కత్తిరించి ఉంటే బాగుండేది.

సాకేంతిక విభాగం :

సినిమాటోగ్రఫి చాలా డిసెంట్ గా ఉంది. విజువల్స్ చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా వున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఒకే. కానీ సెకండాఫ్ లో అంత ఎఫెక్టివ్ గా లేదు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ముఖ్యంగా మోహన్ బాబు కోసం రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని కొన్ని చోట్ల శ్రీవాస్ దర్శకత్వం ఒకే. సినిమాలో కొన్ని సన్నివేశాలలో ఆయన తన టాలెంట్ చూపించాడు. ఉదాహరణకి ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్.

తీర్పు :

‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా మంచు ఫ్యామిలీ వారి నుంచి వచ్చిన డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. డా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లను ఒకే చోట చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కమర్షియల్ గా అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి ఎంటర్ టైనింగ్ మూవీగా నిలుస్తుంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు