సమీక్ష : పవిత్ర – గ్లామర్ బాగుంది కానీ సినిమానే..

సమీక్ష : పవిత్ర – గ్లామర్ బాగుంది కానీ సినిమానే..

Published on Jun 8, 2013 2:08 PM IST
Pavithra-Posters1 విడుదల తేదీ : 07 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : జనార్ధన్ మహర్షి
నిర్మాత : కె. సాదాక్ కుమార్, జి. మహేశ్వర్ రెడ్డి
సంగీతం : ఎం.ఎం శ్రీ లేఖ
నటీనటులు : శ్రియ సరన్, రోజా, సాయి కుమార్.


సౌత్ ఇండియా మొత్తాన్ని తన గ్లామర్ తో ఆకట్టుకున్న అందాల భామ శ్రియ సరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘పవిత్ర’. ఈ సినిమాలో శ్రియ వేశ్య పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సొసైటీలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమాకి జనార్ధన్ మహర్షి డైరెక్టర్. రోజా, సాయి కుమార్, రవిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని కె. సాదక్ కుమార్, జి. మహేశ్వర్ రెడ్డిలు నిర్మించారు. ఎం.ఎం శ్రీ లేఖ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా పలు వారాలుగా సరైన రిలీజ్ డేట్ లేక వాయిదా పది ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ అసలు ఈ పవుత్ర ఎవరు? ఈ పవిత్ర కథేంటో ఇప్పుడు చూద్దాం..

కథ :

తండ్రి చనిపోవడంతో తన తల్లితో కలిసి బతుకుతూ ఉంటుంది పవిత్ర(శ్రియ). సడన్ గా ఓ రోజు తన తల్లికి కాన్సర్ ఉందని తెలుస్తుంది. తనని బతికించుకోవాలంటే డబ్బు బాగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో పవిత్రకి మరో దారి లేక వేశ్యగా మారుతుంది. అలా వేశ్యగా మారిన పవిత్ర కొన్నేళ్ళకి తన తల్లిని కోల్పోతుంది కానీ చేస్తున్న వృత్తిని మాత్రం వదలకుండా సిటీ లోని బడా బాబులకు మాత్రమే అందుబాటులో ఉండే వేశ్యగా చలామణీ అవుతూ ఉంటుంది.

సిటీలో ఉన్న అమ్మాయిలని మోడల్స్ గా మారుస్తానని చెప్పి వారిని మోసం చేసి వారినుంచి డబ్బు వసూలు చేస్తున్న శివ(శివాజీ) గురించి తెలుసుకున్న పవిత్ర అతనికి ఎలాగన్నా బుద్ది చెప్పాలని భావించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని జైలుకి పంపిస్తుంది. శివ జైలు నుంచి ఎలాగైనా తప్పించుకుని పవిత్రని చంపాలని ప్రయత్నిస్తుంటాడు.

కట్ చేస్తే రానున్న ఎన్నికల్లో అధికారంలో ఉండే ఎమ్మెల్యే సుదర్శన్(సాయి కుమార్) కి ప్రతిపక్ష పార్టీ అధినేత సర్వ రోగా నిరోధానంద స్వామి(రవిబాబు)తో పోల్చుకుంటే ప్రజల్లో పెద్ద ఆదరణ ఉండదు. ఎలాగైనా పవర్ లోకి రావాలనుకున్న సుదర్శన్ రెండు ఐడియాలు వేస్తాడు. అందులో ఒకటి తన కొడుకుని రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేయడం లేదంటే, తన కొడుకును హోం మినిస్టర్ కూతురికి ఇచ్చి పెళ్లి చేసి తన రాజకీయ భవిష్యత్తుకి బాట వేసుకోవాలని అనుకుంటాడు. కానీ వీటన్నిటికీ విరుద్దంగా సుదర్శన్ కొడుకు పవిత్రని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. వేశ్యనే తన కోడలిగా చేసుకున్నాడు అనే సింపతీతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని ప్లాన్ వేసిన సుదర్శన్ కొడుక్కి పవిత్రని ఇచ్చి పెళ్లి చేస్తాడు.

అప్పుడు కథలో మెయిన్ ట్విస్ట్, అప్పుడే పవిత్ర రాజకీయాల్లోకి వచ్చి ఉమెన్ ప్రొటెక్షన్ మినిస్ట్రీని ఏర్పాటు చేయాలనుకుంటుంది. వీటన్నిటి కోసం పవిత్ర ఏమేమి చేసింది? అసలు కథలోని మెయిన్ ట్విస్ట్ ఏంటి? పవిత్రని చంపాలి అనుకున్న శివ కోరిక నెరవేరిందా? లేదా అనేదే ఈ చిత్ర కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

వేశ్య పాత్ర పోషించిన శ్రియ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా సినిమా మొత్తం వీలైనంతవరకూ అందాలు ఆరబోసింది. ముఖ్యంగా ‘మన్మధ మోడల్’, ‘సుకుమార రా రా’ సాంగ్స్ లో గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉంది. గ్లామర్ ని పక్కన పెడితే డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి శ్రియ తన వంతు న్యాయం చేసింది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో రాజకీయ నేతలతో చర్చించే సీన్ లో శ్రియ నటన బాగుంది. అమ్మాయిల పిచ్చి, అలాగే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివాజీ నటన చాలా చక్కగా ఉంది. సర్వ రోగా నిరోధానంద స్వామి పాత్రలో రవిబాబు నటన బాగుంది. స్వార్దపూరిత రాజకీయయ నేత పాత్రలో సాయి కుమార్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. యండమూరి వీరేంద్ర నాథ్, జయప్రకాశ్ రెడ్డి లకు ఉన్నవి మూడు నాలుగు సీన్స్ అయినప్పటికీ వాళ్ళు కాస్త నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సినిమా మొదటి సీన్ లో క్లైమాక్స్ సీన్ చూపించి ఫ్లాష్ బ్యాక్ లాగా కథని స్టార్ట్ చెయ్యడంతో చూస్తున్న ప్రేక్షకుడికి నెక్స్ట్ ఎం జరుగుతుందా అనేది ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. కావున ఆడియన్స్ పెద్ద సస్పెన్స్ ఫీలవ్వరు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా నిధానంగా సాగుతుంది దానికి తోడూ సినిమాలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పిచ్చ బోర్ ఫీలవుతారు. సినిమా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ చాలా నిదానంగా ఉంటుంది. సినిమా మొత్తం మీద నాలుగు పాటలున్నాయి. ఒక్క పాటని మినహాయిస్తే మిగతా అన్ని పాటలు ఓ టైమింగు పాడు లేకుండా వచ్చి అప్పటికే విసుగెత్తిపోయి ఉన్న ప్రేక్షకులని ఇంకా చిరాకు పెడతాయి.

రాజకీయ బ్యాక్ డ్రాప్ లోకి కథని తీసుకెళ్ళినపుడు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన ఎత్తులు పై ఎత్తులు చాలా ఊహాజనితంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటి రాజ కీయ పరిస్థితులు ఏ చిన్న పిల్లాన్ని అడిగినా దీనికన్నా బెటర్ సీన్స్ ఇచ్చుండేవాడు. అలాగే అతిధి పాత్రలోనే వచ్చిన బ్రహ్మానందం పాత్రని సరిగా ఉపయోగించుకోలేదు, అలాగే సినిమాలో రోజా, తనికెళ్ళ భరణి, తెలంగాణ శకుంతల, ఎవిఎస్ లాంటి వారిని సినిమాలో అస్సలు ఉపయోగించుకోలేదు. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పార్టీ సభ్యల మీటింగ్ ని బాగానే తీసిన డైరెక్టర్ క్లైమాక్స్ సీన్ తో అంతకు ముందు వరకూ ఆడియన్ కి వచ్చిన ఫీల్ ని పూర్తిగా చెడగొట్టారు.

ప్రతి సినిమాలోనూ ఎలక్షన్స్ అప్పుడు కాంపైన్ అంటే ఓ బ్యాక్ గ్రౌండ్ లో ఓ పవర్ఫుల్ సాంగ్ పెడతారు. డైరెక్టర్ అలా పెడితే కామన్ అనుకున్నాడో ఏమో కొత్తగా ఉండాలని ఓ మాస్ సాంగ్ పెట్టి డాన్సర్లతో కొన్ని మాస్ స్టెప్పులు వేయించాడు. ఇలా చేయడం వల్ల సినిమాలో కీలకమైన ఈ సీన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సినిమాలో కాసింత కూడా ఎంటర్టైనింగ్ లేకపోవడం మరో పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం :

వి.ఎన్ సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ ని రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా హెల్ప్ అయ్యాడు. రమేష్ ఎడిటింగ్ చెప్పుకునేంత లేదు. సినిమాలో చాలా సీన్స్, రెండు పాటల్ని లేపేసి ఉంటే కాస్త సినిమా వేగంగా అన్నా ముందుకు వెళ్లి ఉండేది. ఎంఎం శ్రీ లేఖ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది.

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను తన భుజాలపై వేసుకున్న జనార్ధన్ మహర్షి, తను రాసిన ఒక్క డైలాగ్స్ మాత్రమే బాగున్నాయి దర్శకుడిగా నటీనటుల నుండి నటనను రాబట్టుకున్నా కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నాకు తెలిసి డైరెక్టర్ మొదట అనుకున్న కథకి పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు ఎందుకంటే ఏదో చెప్పాలనుకున్న విషయాన్ని సినిమాలో చెప్పలేకపోయాడు. ఓ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఈ మధ్య హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేని శ్రియ రూటు మార్చి ‘పవిత్ర’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినా సక్సెస్ ని అందుకోలేకపోయింది. శ్రియ హై డోస్ గ్లామర్, సాయి కుమార్, శివాజీల నటన, డైలాగ్స్ ఈ సినిమాకి చెప్పదగిన ప్లస్ పాయింట్స్ అయితే వీక్ స్క్రీన్ ప్లే, మొదటి నుంచి చివరి వరకు నత్తనడకలా సినిమా సాగడం, ఎంటర్టైనింగ్ అస్సలు లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా పవిత్ర గ్లామర్ బాగుంది కానీ సినిమానే చెప్పుకోదగ్గ విధంగా లేదు. కావున శ్రియ ఫ్యాన్స్ తన గ్లామర్ కోసం తప్పకుండా ఈ సినిమాని చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
రాఘవ

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు