ఆడియో రివ్యూ : పూలరంగడు కమర్షియల్ ఆల్బం

ఆడియో రివ్యూ : పూలరంగడు కమర్షియల్ ఆల్బం

Published on Jan 19, 2012 5:11 PM IST

సునీల్-ఇషా చావ్లా కలిసి నటించి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పూలరంగడు. ఈ చిత్ర ఆడియో కత్రియ హోటల్లో పలువురు ప్రముఖల సమక్షంలో ఘనంగా విడుధలచేసారు. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం అందించగా కథ, కథనం దర్శకత్వం వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్ర ఆడియోలో 5 పాటలు మరియు ఒక క్లబ్ మిక్స్ పాట ఉన్నాయి. ఈ ఆడియో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

1. పాట: పూలరంగడు
సింగర్స్: బెన్నీ దయాల్, నకాష్, భార్గవి, లిప్సిక
సాహిత్యం: అనంత్ శ్రీరామ్


మంచి ఎనర్జీతో మొదలయ్యే హీరో ఇంట్రడక్షన్ పాట. సింగర్స్ అందరు బాగా పాడారు. ఈ పాటలో సునీల్ నుండి రాకింగ్ డాన్స్ స్టెప్స్ ఆశించొచ్చు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం కూడా బావుంది. మొత్తంగా చూస్తే మంచి డీసెంట్ సాంగ్ అని చెప్పొచ్చు.

 

2. పాట: నువ్వు నాకు కావాలి
సింగర్స్: అనూప్ రూబెన్స్, రంజిత్, కౌసల్య
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి


మెలోడి మ్యూజిక్ తో ప్రారంభమయ్యే డ్యూయెట్ పాట. సింగర్స్ అనూప్ రూబెన్స్, రంజిత్, కౌసల్య ముగ్గురు బాగా పాడారు. పెర్క్యుషణ్ వాయిద్యం డామినేట్ చేసింది. కౌసల్య మంచి ఫీల్ తో పాడింది.

3. పాట: ఒక్కడే ఒక్కడే
సింగర్స్: రాజ హస్సన్, నోయెల్, లిప్సిక
సాహిత్యం: కందికొండ


ఒక్కడే ఒక్కడే పాట జానపద ఫీల్ తో సాగుతుంది. గ్రామంలో సాగే జాతర బ్యాక్ డ్రాప్లో ఉండే పాట. సింగర్స్ మంచి ఎనర్జీతో పాడారు. కోరియోగ్రఫీ బావుంటే తెర మీద కన్నుల పండగల ఉంటుంది. కందికొండ సాహిత్యం కూడా బావుంది. మంచి మాస్ పాట అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

4. పాట:నువ్వే నువ్వేలే
సింగర్స్: కార్తీక్, గాయత్రి
సాహిత్యం: వనమాలి


నువ్వే నువ్వేలే సాఫ్ట్ గా సాగిపోయే రొమాంటిక్ డ్యూయెట్ పాట. వినడానికి చాలా బావుంది. చిత్రీకరణ కూడా బావుంటే ఇంకా బావుంటుంది. కార్తీక్ చాలా బాగా పాడాడు. వనమాలి సాహిత్యం పర్వాలేదు.

5. పాట:చాకొలేట్
సింగర్స్: ఉదిత్ నారాయణ్, మీనాల్ జైన్
సాహిత్యం: చంద్రబోస్


మరో హుషారైన డ్యూయెట్ పాట. ఉదిత్ నారాయణ్, మీనాల్ జైన్ ఇద్దరు బాగా పాడారు. చంద్రబోసు సాహిత్యం బాగానే ఉంది. బాగా మాస్ ఫీల్ ఉన్న పాట. సునీల్ డాన్సులు బాగా వేస్తే ఇంకా బాగా హిట్ అయ్యే పాట.

 

తీర్పు: పూలరంగడు పూర్తి కమర్షియల్ ఆల్బం. అంత అధ్బుతమైన పాటలేమి కాదు కాని మంచి పట్లు అని మాత్రం చెప్పోచ్చ్చు. సునీల్ డాన్స్ ని బాగా ఎలివేట్ చేసే ఆల్బం అవుతుంది. ‘నువ్వే నువ్వేలే’ , ‘ఒక్కడే ఒక్కడే’ నాకు బాగా నచ్చిన పాటలు. చిత్రీకరణ బావుంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యే ఆల్బం.

అశోక్ రెడ్డి. ఎమ్

Audio Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు