సమీక్ష : రామాచారి – ఈ గూడచారి పాతవాడే

సమీక్ష : రామాచారి – ఈ గూడచారి పాతవాడే

Published on May 18, 2013 1:45 AM IST
Ramachari1 విడుదల తేదీ : 17 మే 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : జి. ఈశ్వర్ రెడ్డి
నిర్మాత : పి.వి. శాంప్రసాద్, మల్ల విజయ ప్రసాద్
సంగీతం : ‘మణిశర్మ
నటీనటులు : తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ , బ్రహ్మానందం, అలీ…


‘చిరునవ్వుతో’, ‘స్వయంవరం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తొట్టెంపూడి వేణు చాలా రోజుల తరువాత ‘రామాచారి’ సినిమాతో మళ్ళీ కనిపించాడు. ఈ సినిమాకి జి. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. పి.వి. శాంప్రసాద్, మల్ల విజయ ప్రసాద్ లు నిర్మించారు. చాలా రోజులు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :
రామాచారి(వేణు) అనే ఒక యువకుడికి పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక ఉంటుంది. పోలీసు ఆఫీసర్ కావడానికి ప్రయత్నిస్తాడు కానీ కాలేకపోతాడు. అప్పటి నుండి రామాచారి పోలీసులకు ఒక గూడచారిగా సహాయపడుతూ ఉంటాడు. ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన హరిశ్చంద్రప్రసాద్ (బాలయ్య) చంపడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం రామాచారికి తెలుస్తుంది. ఈ కుట్రలో పోలీసు కమీషనర్ చడ్డ (మురళి శర్మ) కూడా బాగస్వామిగా ఉంటాడు. దీనితో రామాచారి ఎలాగైనా ముఖ్యమంత్రిని కాపాడాలనుకుంటాడు. రామాచారి ఈ విషయాన్ని చేదించడానికి ఒక ప్రైవేట్ గూడచారిలాగా పనిచేస్తాడు. దీనిలో అతని ఫ్రెండ్స్ గంగూలీ(అలీ), చింత (బ్రహ్మానందం) కూడా సహాయం చేస్తారు. ఈ విషయంలో రామాచారి విజయం సాదించడా? ముఖ్యమంత్రిని కాపాడుతాడా? లేదా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

రామాచారి పాత్రలో వేణు చక్కగా నటించాడు. తను హై లెవెల్ ఎనర్జీతో సూపర్బ్ టైమింగ్ తో కామెడీని బాగా పండించాడు. బ్రహ్మానందం, అలీ కొన్ని సన్నివేశాలలో పరవాలేదనిపించారు. ఎల్.బి. శ్రీరామ్ ఒకే. విలక్షణ నటుడు బాలయ్య సిఎంగా చాలా హుందాగా నటించాడు. మురళి శర్మ అవినీతి పరుడైన పోలీసు ఆఫీసర్ గా బాగానే నటించాడు. ఈ సినిమాలో అక్కడక్కాడా కొన్ని హాస్య సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా స్క్రీప్ట్ లో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ అర్ధవంతంగా వున్నాయి. ముఖ్యమంత్రి గారి రక్షణ విషయాలు తెలుసుకునే సీన్స్ చూడడానికి సిల్లీగా అనిపిస్తాయి. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ చుట్టూ తిరిగే ఈ కథ మామూలుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి పెద్ద మైనస్. కొన్ని పాటలు బాగున్నా సరైన సమయంలో రాకుండా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. కమలిని ముఖర్జీ ఈ సినిమాకి పెద్ద మైనస్. ఈ సినిమాలో తను చూడడానికి డల్ గా, అలసి పోయినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాదాన్యం లేదు. వేణు, కమలిని ముఖర్జీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అస్సలు బాగోలేవు. ఈ సినిమాలోని కామెడీ చాలా పాతది, అలాగే చాలా చీప్ గా అనిపిస్తుంది. సినిమాని చూస్తుంటే చాలా సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. రఘుబాబు పాత్ర చాలా చిరాకు తెప్పిస్తుంది. చంద్రమోహన్, గిరిబాబులు తమ పాత్రలకు సరైన న్యాయం చేయలేకపోయారు.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ మాములుగా ఉంది. ఎడిటింగ్ అంత బాగోలేకపోవడమే కాకుండా ముందుకు వెనక్కి ఊగి ఊగి వేలుతున్నట్టుగా ఉంది. డైలాగులు బాగోలేవు. ఈ సినిమాకి రచన ఒక పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా వినిపిస్తుంది. ఈశ్వర్ రెడ్డి డైరెక్టర్ గా ఈ సినిమాకి న్యాయం చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ మాములుగా వున్నాయి.

తీర్పు:

ఒకటి రెండు కామెడీ సన్నివేశాలకు మించి ‘రామాచారి’ సినిమాలో చూడానికి ఏమి లేదు. విషయం లేని స్క్రీప్ట్ తో, బాగాలేని స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని నిర్మించారు. కమలిని ముఖర్జీ ఈ సినిమాకు ఉపయోగపడలేకపోయింది. ఈ సినిమాని చూస్తుంటే ఇంతకు ముందు చూసినట్టుగా అనిపిస్తుంది. వేణు మంచి టాలెంట్ ఉన్న నటుడు. తను కాస్త మంచి కథలు ఎంచుకొని నటిస్తే బాగుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ – 2.25/5

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు