శ్వేత మీనన్ మరియు శ్రీజిత్ విజయ్ కలిసి నటించిన చిత్రం ‘రతినిర్వేదం’. ఈ చిత్రం నేడు రాష్ట్రమంతటా విడుదల అయ్యింది. ఇది మలయాళం లో విడుదలైన అదే పేరు గల చిత్రానికి డబ్బింగ్ చిత్రం. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :
ఇది బుజ్జి(శ్రీజిత్ విజయ్) అనే ఒక యువకుడి కథ. అతడికి తన కంటే వయసులో పెద్దదైన రతి( శ్వేత మీనన్) మీద మోజు పుడుతుంది. రతి మరియు బుజ్జి చిన్ననాటి స్నేహితులు. ఇరుగు పొరుగు న ఉండటం వలన వారి కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఇదే చనువుతో రతి బుజ్జి తో చాల క్లోజ్ గా ఉంటుంది. దీనిని అపార్ధం చేసుకున్న బుజ్జి , ఆమె పై కామ వాంఛ పెంచుకుంటాడు. ఇది తెలిసిన రతి అతడిని దూరం గా ఉంచాలని చూస్తుంది. కాని బుజ్జి అవేమి పట్టించుకోడు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ బుజ్జి లో ఏమీ మార్పు ఉండదు. చివరికి బుజ్జి కి రతి లొంగుతుందా? వీరిద్దరూ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అదే కథ
ఎం బాగున్నాయి :
ఈ చిత్రం లో శ్వేత మీనన్ తప్ప ఇంకేమి లేదు. ఆమె ఎంతో మంచి నటి. అవసరం అయినప్పుడు అందాలను ఆరబోయటం లో కూడా వెనుకాడదు. రతి నిర్వేదం లో కెమేరా ఆమె వొంపు అయిన శరీరం లోని ప్రతి అంగుళం తదేకంగా చూపిస్తుంది
ఎం బాగోలేదు :
ఈ చిత్రం చాలా బోర్ కొడుతుంది. కథ లో కానీ, కథ చెప్పే విధానం లో కానీ ఎటువంటి పసా లేదు. పోస్టర్ల లో చూపిన విధం గా కానీ, శ్వేత మీనన్ దుస్తుల వలన కలిగీ ఊహలకు కానీ ఈ చిత్రం ఎటువంటి న్యాయం చేయదు.
శ్రీజిత్ విజయ్ నటన అంత గా బాగోలేదు.అతడికి శ్వేత మీనన్ తో పోటీ పడి నటించే సత్తా కానీ, ఈ పాత్రకు కావాల్సిన అమాయకత్వం కానీ లేవు. ఈ చిత్రం ఒక చౌకబారు మలయాళం సినిమా వలె ఉంటుంది. కథ ను కానీ, చిత్రం లో ని సీన్లని కానీ మన తెలుగు వారు అంత తేలికగా ఒప్పుకోరు.
క్లైమాక్స్ కూడా చాలా పాత చింతకాయ పచ్చడి లాగా చప్పగా ఉంది.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫి ఫర్వాలేదు. ముఖ్యం గా శ్వేతా మీనన్ అందాలను చూపటం లో మంచి నైపుణ్యం ప్రదర్శించారు. సంగీతం ఫర్వాలేదు. డైలాగ్ లు బాగోలేదు. సంభాషణల లో అసలు పస లేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు అనిపించుకుంటుంది.
విశ్లేషణ :
సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధం గా అటు ఆశక్తి కర అంశాలు కానీ , ఇటు రక్తి కట్టించే సన్నివేశాలు కానీ ఈ చిత్రం లో లేవు. కేవలం శ్వేత మీనన్ కోసమే ఈ చిత్రం మీరు చూడాలి అనుకుంటే, డి.వి.డి. తెచ్చుకుని, ఇంటి లో హాయి గా చూస్కోవటం మేలు.
—
Mahesh K.S
123తెలుగు.కాం రేటింగ్: 1.75/5
Rathinirvedam Review English Version