విడుదల తేదీ : 15 ఆగష్టు 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు : జి. కార్తీక్ రెడ్డి |
||
నిర్మాత : చింతలపూడి శ్రీనివాస్, అక్కినేని నాగసులోచన |
||
సంగీతం : అనూప్ రూబెన్స్ |
||
నటీనటులు : సుశాంత్, శాన్వీ… |
సుశాంత్ బాక్స్ ఆఫీసు వద్ద మరోసారి తన అదృష్టాన్ని ‘అడ్డా’ సినిమాతో పరీక్షించుకున్నాడు. జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శాన్వీ హీరోయిన్ గా నటించింది. చింతలపూడి శ్రీనివాస్, అక్కినేని నాగసుశీల కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సుశాంత్ కు చాలా ముఖ్యమైన సినిమా. ఇప్పటివరకు సుశాంత్ కెరీర్ లో భారీ విజయాన్ని సాదించిన సినిమా ఏదిలేదు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
అభి (సుశాంత్) ప్రేమికులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే విదంగా ఒక కొత్త రకమైన సర్వీస్ ని అందిస్తూ వుంటాడు. తను ఎవరైనా లవర్ దూరం చేయమని వస్తే వారికి సహాయం చేయడం అతని పని. ఈ సర్వీస్ పిల్లలు ప్రేమించుకొని విడదీయాలనుకునే తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ తను ప్రేమించుకునే వారికి పెళ్లిలు కూడా చేస్తూ వుంటాడు. ఇలా చేసిన వారి నుండి కొంత ఫీజు వసూలు చేస్తూ ఉంటాడు.
ప్రియ(శన్వీ) అభి సర్వీస్ గురించి వింటుంది. ఆమె తన తండ్రి పటేల్(నాగినీడు)ని దృష్టిలో పెట్టుకొని తన అక్క ప్రేమని చెదగోట్టాలనుకుంటుంది. అందుకు ఆమె అభి సహాయం కోరుతుంది. అభి ఆమెకు సహాయం చేస్తూ వుంటాడు. ఇంతలో అనుకోకుండా తను ప్రియ ప్రేమలో పడతాడు. కానీ ప్రియతో ఈ విషయాన్ని చెప్పడానికి సరైన సమయం దొరకదు. మరోవైపు ప్రియ కూడా అభికి ఎలాంటి ఫీలింగ్స్ మరియు నైతిక విలువలు లేవని అనుకుంటుంది. అలాగే తను ఆమె బావ (దేవ్ గిల్)ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. చివరికి ఏం జరిగింది? అభి ప్రియ ప్రేమను గెలుచుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
సుశాంత్ తనలోని నటనని మరింత మెరుగు పరుచుకున్నాడు. తన గ్రేస్ ఫుల్ డాన్సులతో మంచి డాన్సర్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో అతని కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఈ సినిమాలో శాన్వీ చూడటానికి చాలా గ్లామరస్ గా వుంది. ఈ సినిమాకి శాన్వీ పెద్ద ప్లస్. ఆమె కాస్ట్యూమ్స్, అందాల ఆరబోత బి, సి సెంటర్స్ లో బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
రఘుబాబు కాసేపు ఎంటర్టైన్ చేశాడు. అతిధి పాత్రలో నటించిన జయప్రకాశ్ రెడ్డి తన యాసతో, డైలాగ్స్ తో ప్రేక్షకులను నవ్వించాడు. ధన్ రాజ్, వేణు, తాగుబోతు రమేష్ నటన ఓకే. ఈ సినిమాలో కొన్ని ఎంటర్టైనింగ్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా మొదటి 30 నిముషాలు, అలాగే ఇంటర్వల్ తరువాత కొద్ది సేపు వచ్చే సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలోని కొన్ని వన్ లైనర్ డైలాగ్స్ యువకులకు, కాలేజీ స్టూడెంట్స్ కి నచ్చుతాయి. కొన్ని పాటలు బాగున్నాయి. ఉదాహరణకి. పబ్ లో తీసిన పాటని బాగా షూట్ చేశారు. కొన్ని పాటలను విదేశాలలో చిత్రీకరించారు. ఆ లొకేషన్స్ చూడటానికి చాలా రిచ్ గా ఉన్నాయి. శ్వేత భరద్వాజ్ ఐటమ్ సాంగ్ లో బాగా హాట్ గా కనిపించి ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలోని ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్ సన్నివేశాలు చిరాకు పుట్టిస్తాయి. ఆ సన్నివేశాలు మళ్ళి మళ్ళి వస్తూ వున్నటు అనిపిస్తాయి. ఈ సినిమాలో పెద్దగా కథ అంటూ ఏమిలేదు.
ఈ సినిమా డైరెక్టర్ స్క్రీన్ ప్లే పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమా పడుతూ లేస్తూ ఉండడం వల్ల చాలా ఇంటర్వల్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. హీరో పాత్రని కాస్త ఎక్కువగా చూపించినట్లు అనిపిస్తుంది. సినిమాలో రొమాంటిక్ ట్రాక్ బాగాలేదు. కొంతమంది గొప్ప ఆర్టిస్ట్ లు కోట శ్రీనివాస్ రావు, తనికెళ్ళ భరణి వంటి వారికి తక్కువ సమయం పాత్రలు ఇచ్చారు.
సాంకేతిక విభాగం:
అరుణ్ కుమార్ అందించిన సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఈ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా చూపించారు. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇది ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఎడిటింగ్ ఆశించినంత బాగాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మనకు తెలుస్తుంది.
డైరెక్టర్ గా కార్తీక్ రెడ్డి పరవాలేదు. స్క్రీన్ ప్లే పై కాస్త శ్రద్ద పెట్టిఉంటే బాగుండేది.
తీర్పు:
సుశాంత్ నటించిన మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే ‘అడ్డా’లో చాలా మెరుగుపర్చుకున్నాడు. ఈ సినిమాలో కొన్ని మంచి సన్నివేశాలు వున్నాయి. కానీ క్లైమాక్స్ బాగాలేదు. అలాగే చివర్లో సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుంది. చివరిగా ‘అడ్డా’ సినిమా ఒకే చూడొచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ -3/5
రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల