విడుదల తేదీ : 09 ఆగష్టు 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5 |
||
దర్శకుడు : ఎ.ఎల్. విజయ్ |
||
నిర్మాత : బీ కాశీ విశ్వనాథం |
||
సంగీతం : జీ.వి. ప్రకాష్ కుమార్ |
||
నటీనటులు : విజయ్, అమలా పాల్ |
తమిళ స్టార్ విజయ్ హీరోగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అన్న’. ఈ సినిమా గతంలో కమల హసన్ నటించిన ‘నాయకుడు’ సినిమాని స్టోరీ లైన్ ని పోలి వుంది. మరి ఈ సినిమా ఆ సినిమా స్థాయిలో వుందా? అమలా పాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని బీ కాశీ విశ్వనాథం నిర్మించాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
విశ్వ(విజయ్) ఆస్ట్రేలియాలో డాన్స్ నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. తను ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ని రన్ చేస్తూ వుంటాడు. కానీ అతని ఆశ మాత్రం డాన్సు నేర్చుకోవాలని వుంటుంది. తను ఉంటున్న ఏరియాలో సక్సెస్ సాదించాలని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు మీర(అమలా పాల్)ను చూసి ఆమె అందానికి ముగ్దుడై ప్రేమలో పడతాడు. అప్పటి నుండి మీరా తండ్రి(సురేష్)ను ఇప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సురేష్ విశ్వ తండ్రిని కలవడానికి ముంబై కి వస్తాడు. విజయ్ తన తండ్రి ఒక మాములు వ్యాపారి అని అనుకుంటాడు. కానీ తన తండ్రి అక్కడ బ్రతికే వేలమంది ప్రజలకు దేవుడితో సమానం అని తెలిసుకుంటాడు. అప్పుడు అతనికి అక్కడి ప్రజలు ‘అన్న’ పిలిచేది తన తండ్రి(సత్యరాజ్)నని తెలిస్తుంది. అప్పటి వరకు వున్న విజయ్ ప్రపంచం మరిపోతుంది. ఇంతలో విధి అతనికి విరుద్దంగా మారుతుంది. దానితో అతనికి కావలసిన వారినందరిని కోల్పోతాడు. ఆ పరిస్థితుల్లో తన ఫ్యామిలీని నమ్ముకున్న ప్రజల కోసం తను పోరాడటానికి నిలబడతడా? లేదా? అన్న అనే ఆదరణని పొందుతాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
విశ్వ పాత్రలో విజయ్ చాలా చక్కగా నటించాడు. అమలాప్ పాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. చూడటానికి చాలా అందంగా వుంది. సత్యరాజ్ చాలా బాగా నటించాడు. తను నటించిన ‘అన్న’ పాత్రకి సరైన న్యాయం చేశాడు. నిజం చెప్పాలంటే సత్యరాజ్ నటించిన సన్నివేశాలు ఈ సినిమాలోనే బెస్ట్ సీన్స్ గా చెప్పవచ్చు. విలక్షణ నటుడు సురేష్ నటన బాగుంది. ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. ఈ సినిమాకి ఇది చాలా లాభాన్ని చేకూర్చుతుంది. సంతానం నటించిన కామెడీ బాగుంది. తను చేసిన వన్ లైన్ కామెడీ సన్నివేశాలలో చక్కగా నటించాడు. ఈ వన్ లైన్ కామెడీ చాలా బాగుంది. ఉదాహరణకి ‘ఒరేయ్ వేరే వాడి ఆటోకి నువ్వు ఆయుధ పూజ చేయాలి అనుకోవడం తప్పురా’.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా బేసిక్ స్టొరీ లైన్ మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ సినిమాలనే ఉంది. ఒక్క ఇంటర్వల్ ట్విస్ట్ తప్ప మిగతా స్టొరీ అంతా మనం ఊహించినట్టుగానే ఉంటుంది. హీరో పాత్రని తీర్చి దిద్దిన విధానం ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమాలో విజయ్ విశ్వ పాత్ర నుంచి అన్నగా మారడం అనేది అంత ఎఫెక్టివ్ గా లేదు. హీరోయిజం అనే అంశం పూర్తిగా మిస్ అయ్యింది. చాలా సన్నివేశాల్లో హీరోయిజంని పీక్స్ లో చూపించాల్సిన వాటిని డైరెక్టర్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇలాంటి స్టొరీలకు ఆడియన్స్ ఎమోషన్ పరంగా బాగా కనెక్ట్ అవుతారు. కానీ ఎ.ఎల్ విజయ్ స్టొరీ చెప్పిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. సంతానం చెప్పిన వన్ లైన్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్స్ తప్పితే సినిమాలో ఎక్కడా కామెడీ లేదు. సినిమా నివి 3 గంటలకు పైగా ఉండడటం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్. సినిమాలో చాలా సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్. డైరెక్టర్ ఎంచుకున్న ప్లాట్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే అనుకున్న ఈ పాయింట్ ని ఇంతకన్నా విడమర్చి చెప్పడం కుదరదు. సినిమాలోని పాటలు సినిమాకి మరో పెద్ద మైనస్. ఒక్క పాట కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు.
సాంకేతిక విభాగం :
నిరవ్ షా సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ బాలేదు. సెకండాఫ్ లోని చాలా సీన్స్ ని కత్తిరించి పారేయవచ్చు. జివి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదు. డైలాగ్స్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎఎల్ విజయ్ అస్సలు సూట్ కాలేదు. ఎవరన్నా మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఈ సినిమాని డీల్ చేసి ఉంటె కథకి పూర్తి న్యాయం చేసి ఉండేవాడు.
తీర్పు :
‘అన్న’ ఆడియన్స్ ని నిరాశపరిచే సినిమా. చెప్పాలంటే అవకాశం వృధా అయిపొయింది. ఇలాంటి స్టొరీ లైన్ తో సినిమాని పక్కా కమర్షియల్ డ్రామా గా తీసి ఉండవచ్చు. కానీ సినిమాని సాగదీసి సాగదీసి బోర్ కొట్టించాడు. బాక్స్ ఆఫీసు పరంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
అనువాదం నగేష్ మేకల