విడుదల తేది : 13 జూలై 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5 |
దర్శకుడు : చక్రి తోలేటి |
నిర్మాత : శోభా రాణి |
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజ |
తారాగణం : అజిత్ కుమార్, పార్వతి ఓమనకుట్టాన్, ప్రభు |
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ” డేవిడ్ బిల్లా”. గతంలో విడుదలై విజయం సాదించిన ‘బిల్లా’ చిత్రానికి ఇది ఫ్రీక్వెల్. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి ఓమనకుట్టన్ మరియు బ్రూనా అబ్దుల్లాలు కథానాయికలుగా నటించారు. ఐ ఎన్ ఎంటర్టైన్మెంట్ మరియు వైడ్ ఏంజెల్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఎస్.వి.ఆర్ మీడియా ప్రై. లిమిటెడ్ వారు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ(బిల్లా 2) భాషలలో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
‘బిల్లా 2’ కథకి హాలీవుడ్ డైరెక్టర్ ఎ.ఐ పాసినో తీసిన ‘స్కార్ పేస్’ చిత్రానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఈ చిత్రాన్ని మనం హాలీవుడ్ ఫ్రీమేక్ చిత్రంగా చెప్పుకోవచ్చు. శ్రీలంకలో బాధించబడిన డేవిడ్ బిల్లా (అజిత్) ఇండియాలో ఉన్న శరణాలయాలలో ఆతిద్యం కోసం వస్తాడు. ఆ క్యాంపు లో వారిపై కిరాతకంగా ప్రవర్తించే అధికారులపై తిరుగుబాటు చేస్తాడు. దీని వల్ల అతనికి కొంత మంది అనుచరులు తయారవుతారు, ఇలా క్రమక్రమంగా ఒక్కొక్కరినీ ఎదిరించుకుంటూ క్రైమ్ బాట పడతాడు, మరియు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతాడు.
అలా ఎదుగుతున్న అతనికి అబ్బాసి (సుధాన్షు పాండే) పరిచయమవుతాడు. అబ్బాస్ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బిల్లా తన ధైర్య సాహసాలు మరియు తెలివితేటలూ ఉపయోగించి గెలుస్తాడు. ఇదిలా ఉండగా ఒక పక్క గవర్నమెంట్ అధికారులను, పోలీసులను మరియు లాయర్లను ఉపయోగించుకొని మరో గ్యాంగ్ అక్రమాలు చేస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈస్ట్ యూరప్ ఆయుధాల డీలర్ దిమిత్రి కథలోకి ప్రవేశాస్తాడో అప్పటినుంచి అబ్బాస్ మరియు బిల్లాల బిజినెస్ దెబ్బతింటుంది. ఆ ఇరువురి గ్యాంగ్ ల మధ్య జరిగే పోరాటమే చిత్రంలో మిగిలిన కథాంశం . బిల్లా మరియు సమీర (బ్రూన అబ్దుల్లా) ల మధ్య ఒక రొమాంటిక్ ట్రాక్ నడుస్తూ ఉన్న సమయంలో బిల్లా మేన కోడలుగా పార్వతి ఓమనకుట్టన్ కథలోకి అలా వచ్చి వెళ్ళిపోతుంది.
ప్లస్ పాయింట్స్:
ఎప్పటిలాగే అజిత్ నటన చాలా అద్భుతంగా ఉంది. అజిత్ సినిమా మొదట్లో లుంగీతో, ఆతర్వాత స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఆ రెండు గెటప్పుల్లోను చాలా బాగున్నాడు. రెండు గెటప్స్ లో విభిన్నత చూపడంలో అజిత్ సక్సెస్ అయ్యాడు. అతని అలవాట్లు మరియు బాడీ లాంగ్వేజ్ డేవిడ్ బిల్లా పాత్రకి చాలా బాగా సరిపోయాయి. ఫైట్స్ కూడా చాలా బాగా చేశాడు.
ఎంతో హుందాతనమైన అబ్బాస్ పాత్రకి సుభాన్షు పాండు చాలా చక్కగా సరిపోయారు. ఎంతో క్లిష్టమైన పాత్రలో చాలా బాగా నటించారు. దిమిత్రి పాత్రలో విద్యుత్ జమాల్ చక్కగా చేశాడు. ఇండియన్ ప్రేక్షకుడు ఒక ఈస్ట్ యురోపియన్ పాత్రని ఎలా ఊహించుకుంటాడో అంత ఖచ్చితం డైరెక్టర్ ఎలా తీయగాలిగాడా అనేది మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తనకి ఇచ్చిన చిన్న పాత్రలో ఇలవరసు బాగా ఒదిగిపోయాడు. అజిత్ వచ్చే ప్రతి సన్నివేషాన్ని చాలా స్టైలిష్ గా చిత్రీకరించారు. రెండవ అర్ధభాగంలో వచ్చే ఒక సీక్వెన్స్ మాత్రం జేమ్స్ బాండ్ సినిమా టైటిల్ సాంగ్ ని తలపించేలా ఉంటుంది కానీ దానిని చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో విజువల్స్ చాలా బాగున్నాయి మరియు మొత్తం చిత్రాన్ని ఆసక్తికరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు ఐటెం సాంగ్స్ అయినప్పటికీ వాటిని చాలా అందంగా చిత్రీకరించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సినిమాలో ఎంచుకున్న పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారు, వాటి మీద ఇంకొంచెం శ్రద్ద తీసుకొని ఉంటే బాగుండేది. చాలా సన్నివేశాలలో మరీ లాజిక్ లేకుండా పోవడం వల్ల ప్రేక్షకులు కొంత ఇబ్బందికి గురవుతారు. అజిత్ కి ఒక చిన్న తుపాకి ఇచ్చి ఒక పెద్ద పోలీసు సైనిక దళాన్ని మట్టుపెట్టే సన్నివేశానికి అందరూ థ్రిల్ అవుతారని చక్రి తోలేటి ఎలా అనుకున్నారో ఆయనకే తెలియాలి.
స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. సినిమా చాలా సన్నివేశాలలో నిదానంగా సాగుతుంది. సినిమాలో ఎమోషనల్ కు గురిచేసే సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి మరియు మొదట్లో డేవిడ్ బిల్లా పాత్ర మీద ప్రేక్షకుల నుండి సానుభూతిని సంపాదించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. రహమాన్ ప్రాముఖ్యతలేని ఒక చిన్న పాత్ర పోషించారు.
పార్వతి ఓమనకుట్టన్ మరియు బ్రూన అబ్దుల్లాలకు అసలు ప్రాముఖ్యత ఉండదు మరియు కనీసం వారి హాట్ లుక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. రొమాంటిక్ ట్రాక్ చాలా వీక్ గా ఉంది. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాలను కూడా చాలా పేలవంగా చిత్రీకరించడంవల్ల ఆ సన్నివేశాలు చిత్ర కథకు ఎలాంటి సహాయం అందించలేకపోయాయి.
తెలుగు నేటివిటీ కి దగ్గరగా తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడక్కడా వచ్చే బోర్డ్స్ ని మరియు సిటీ పేర్లని మాత్రమే తెలుగుకి సరిపోయేలా మార్చారు. తమిళంలో మంచి ప్రమోషన్స్ చేసి భారీగా విడుదల చేశారు కానీ తెలుగు సరైన ప్రమోషన్స్ లేక ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా సరిగా రావడంలేదు.
సాంకేతిక విభాగం :
చక్రితోలేటి దర్శకుడిగా పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్కార్పేస్’ లాంటి అద్భుతమైన కథని స్ఫూర్తిగా తీసుకొని కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా తీయలేకపోయాడు. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ఈ చిత్ర సినిమాటోగ్రఫీ సూపర్బ్ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రాన్ని `చాలా అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు మరియు బిల్లా డాన్ గా మారిన తర్వాత వచ్చే రిచ్ నెస్ చిత్రీకరణ మాత్రం మిస్సవలేదు. ఎడిటింగ్ ఇంకొంచెం బాగుంటే చాలా బాగుండేది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పరవాలేదనిపించినా, అతను అందించిన నేపధ్య సంగీతం మాత్రం చాలా బాగుంది.
తెలుగులో డైలాగ్స్ అంత ఆసక్తికరంగా రాయలేదు మరియు డబ్బింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు. ప్రొడక్షన్ విలువలు మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
బిల్లా 2 చిత్రంలో చెప్పుకోదగ్గ కథ లేకపోయినా చాలా స్టైలిష్ గా చిత్రీకరించారు. ఈ చిత్రంలో అజిత్ స్టైలిష్ లుక్ మరియు ఫైట్స్ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. సినిమాలో పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం మరియు వీక్ స్క్రీన్ ప్లే వల్ల మామూలు సినీ అభిమానులకు మాత్రం అంతగా నచ్చదు. మీరు అజిత్ స్టైలిష్ లుక్స్ మరియు అద్భుతమైన విజువల్స్ చూడాలనుకుంటే ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని చూడవచ్చు. అలా కాకుండా మీరు ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ కావాలి అనుకుంటే `ఈ చిత్రానికి దూరంగా ఉండండి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
Click Here For ‘David Billa’ English Review
మహేష్ ఎస్ కోనేరు
(అనువాదం – రాఘవ)