సమీక్ష : ఏమో గుర్రం ఎగరవచ్చు- సాదా సీదా సినిమా

సమీక్ష : ఏమో గుర్రం ఎగరవచ్చు- సాదా సీదా సినిమా

Published on Jan 25, 2014 11:50 PM IST
Emo-gurram-egaravachu-telugu-review విడుదల తేదీ : 25 జనవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : చంద్రసిద్ధార్ధ్
నిర్మాత : పూదోట సుధీర్ కుమార్
సంగీతం : ఎం.ఎం కీరవాణి
నటీనటులు : సుమంత్, పింకీ సావిక..

అవార్డుల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రసిద్ధార్ధ్ మరియు సుమంత్ కలిసి పనిచేసిన సినిమా ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’. థాయ్ నటి పింకీ సావిక హీరోయిన్. ఎం.ఎం కీరవాణి సంగీతదర్శకుడు. పూదోట సుధీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కధ:
తూర్పుగోదావరిలోని ఒక పల్లెటూరిలో వుండే మంచి మనసున్న వాడు బుల్లబ్బాయి(సుమంత్). అతనికి ఒకటే కోరిక 15వ సారి రాస్తున్న 10వ తరగతి పరీక్ష ఎలాగైనా పాస్ అవ్వలి. ఇంతలో అమెరికా నుండి తిరిగొచ్చిన ఎన్.ఆర్.ఐ పాత్రలో బుల్లబ్బాయ్ మరదలిగా నీలవేణి(పింకీ సావిక) కనిపిస్తుంది. తమ కులంలోనే బాగా ఉన్నత స్థితిలో వున్న యువకుడిని ఇచ్చి పెళ్లి చేసుకోవాలని నీలవేణి అమ్మానాన్నలు అనుకుంటారు. కానీ హీరోయిన్ పెట్టె కండిషన్లు విని ముక్కున వేలేసుకుంటారు

వారిబాధనుండి తప్పించుకోవడానికి నీలవేణి మన బుల్లబ్బాయ్ ని ఎంచుకుంటుంది. తను కూడా సరే అంటారు. కానీ తాను అవసరంకోసం వాడుకోబడ్డాడని ఆ తరవాత సుమంత్ కి తెలుస్తుంది. అమెరికా వెళ్ళిన వీరికి నీలవేణి ఆలోచనలు స్పష్టంగా తెలుపుతుంది. తనకు పర్ఫెక్ట్ భర్త కావాలని ఆఖరికి ఒక అందమైన భారత డాక్టర్ ను నిశ్చితార్ధం చేసుకుంటుంది. ఏమి చేయలేక బుల్లబ్బాయ్ నిస్సహాయంగా వుండిపోతాడు. కానీ చివరికి నీలవేణికి బుల్లబ్బాయ్ చాలా అమాయకుడు అని తనని నిజంగా ప్రేమిస్తాడని తెలుసుకుంటుంది

అప్పుడు నీలవేణి ఏం చేస్తుంది? నిశ్చితార్ధం ఆపేస్తుందా? బుల్లబ్బాయ్ ఏం చేస్తాడు అన్నదే సినిమా కధ

ప్లస్ పాయింట్స్:

సుమంత్ ఈ సినిమాలో అందంగా కనబడ్డాడు. పింకీ సావిక పర్వాలేధు అనిపించింది. సినిమా అందంగా మొదలై మొదటి 20 నిముషాలు చాలా డిసెంట్ గా సాగుతుంది.

తాగుబోతు రమేష్, కాంచీలు కామెడీ పడించడంలో కాస్త మేరకు సఫలీకృతం అయ్యారు. అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్ కు చిన్న పాత్రలు ఇచ్చినా పరిధిమేరకు కాగానే నటించారు. సినిమా ఫీల్ ని మొత్తం కీరవాణి తన సంగీతం, నేపధ్య సంగీతంతో ఒంటి చేత్తో నడిపించాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కధ తెలుగుసినిమా మొదలైన నాటిది. సినిమా మొదలైన 20 నిమిషాల తరువాత నుండి సినిమా చాలా బోర్ గా సాగుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వం సరిగా లేకపోవడం ఒక మైనస్

సుమంత్ హుందాగా కనిపించే పాత్రలను బాగా చేయగలిగాడు. దాన్ని వదిలేసి అక్కర్లేని ఎనర్జి లెవెల్స్ కొనితెచ్చుకుని గోదావరి యాసతో ఎందుకునటించాడో మనకు అర్ధంకాదు. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఒక పాటలో సుమంత్ ఆడపిల్ల వేషధారణ పోషించాడు. అందులో చాలా ఎబ్బెట్టుగా కనిపించాడు

తెలుగు అమ్మాయిగా నటించిన పింకి సావిక ఆ పాత్ర నటిస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ సినిమాకు థాయ్ నటి ఎందుకో సినిమాలో భూతద్ధం పెట్టి సినిమా అంతా వెతికినా జవాబు దొరకదు

సినిమాను ఆద్యంతం కూర్చుని చూసేవిధంగా తెరకెక్కించలేదు. అందరికీ తెలిసిన కధ కనుక ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువ వుంటేనే సినిమా ఆడతుంది. ఈ సినిమాలో అవి మచ్చుకకు కూడా లేవు

చంద్రసిద్ధార్ధ్ సినిమా అంటే ప్రేక్షకులు మనసులో నిలిచిపోయే సన్నివేశాలు, హృదాయానికి హత్తుకునే సంబాషణాలు ఉంటాయని ఆశిస్తారు. కానీ ఇవేవీ ఈ సినిమాలో కనిపించవు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రాఫి చాలా బాగుంది. ఎడిటింగ్ ఆశించన స్థాయిలో లేదు. సినిమా ఒక్క సన్నివేశం కూడా స్మూత్ గా వెళ్ళదు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను ఆయన ఒంటి చేత్తో హండిల్ చేశాడు. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వం నిరాశపరిచే విదంగా ఉంది. అవార్డ్ పొందిన ఒక దర్శకుడు స్థాయికి తగ్గట్టుగా ఈ సినిమా ఎంతమాత్రమూ లేకపోవడం భాధాకరం

తీర్పు:

‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ చాలా సాదా సీదా సినిమా. చాలా నిమ్మదిగా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కనబడకుండా నటీనటులకు నటనపై తాపత్రయం లేకుండా చాలా డల్ గా సాగింది. మీరుగనుక చంధ్రసిద్ధార్ధ్ అభిమాని అయితే చాలా నిరాశ చెందుతారు.

123Telugu.com Rating – 2.25/5
రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : వంశీకృష్ణ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు