విడుదల తేది : 21 ఫిబ్రవరి 2014 | ||
123123తెలుగు .కామ్ రేటింగ్ : 2/5 | ||
దర్శకత్వం : సత్య | ||
నిర్మాతలు : వజ్రంగ్ | ||
సంగీతం: అచ్చు | ||
నటినటులు : నవీన్ చంద్ర, రీతు వర్మ.. |
‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా, ‘బాద్షా’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలతో తెలుగువారికి పరిచయమైన రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘నా రాకుమారుడు’. పూరి జగన్నాధ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సత్య దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ పై వజ్రంగ్ నిర్మించాడు. అచ్చు మ్యూజిక్ అందించిన ఈ సినిమా పలుసార్లు విడుదల తేదీ అనుకోని వాయిదా పడింది. ఎట్టకేలకు వాయిదాల పర్వం దాటుకొని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ రాకుమారుడు ప్రేక్షకుల చేత రాకుమారుడు అనిపించుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
హైదరాబాద్ లోనే బాగా రిచ్ అయిన ఒక ఇండస్ట్రియలిస్టు కుమారుడు వైష్ణవ్(నవీన్ చంద్ర). మరో రెండు నెలల్లో అమెరికా వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్న వైష్ణవ్ ఖాళీగా ఉంటూ తనని ప్రేమించే వాళ్ళని కాకుండా తనకి నచ్చిన అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు. అందుకే ఏ అమ్మాయి అయినా అతన్ని రీచ్ అయితే కాస్త టార్చర్ చూపిస్తుంటాడు. అదే టైంలో వైష్ణవ్ కి ఓ సందర్భం ద్వారా బిందు(రీతు వర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. బిందుకి ఏమో చదువు అంటే ఇష్టం ఉండదు. కానీ బిందు మదర్ శోభన(సితార) మాత్రం తనని బాగా చదివించాలని విశ్వా ప్రయత్నాలు చేస్తుంటుంది.
వైష్ణవ్ తో పరచయం అయిన కొద్ది రోజులకి బిందు తన ప్రేమలో పడుతుంది. కానీ వైష్ణవ్ మాత్రం తనని ప్రేమించడం లేదని చెప్పి అమెరికా వెళ్ళిపోతాడు? ఆ బాధతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్న బిందు ఏమైంది? వైష్ణవ్ నిజంగానే బిందుని ప్రేమించలేదా? లేక ప్రేమించినా ఏమన్నా కారణం వల్ల దూరం చేసుకున్నాడా? అలా అయితే ఆ కారణం ఏమిటి? చివరికన్నా వీళ్ళిద్దరూ కలిసారా? లేదా? అనేది మీరు వెండితెరపై చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
‘అందాల రాక్షసి’, ‘దళం’ సినిమాలతో ఫుల్ రఫ్ లుక్ లో కనిపించిన నవీన్ చంద్ర ఈ సినిమాలో తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు. చాలా స్టైలిష్ గా, మోడ్రన్ గా కనిపిస్తాడు. అలాగే పెర్ఫార్మన్స్ కూడా బాగా చేసాడు. నవీన్ మొదటి సరి ఈ సినిమాలో డాన్సులు చేసాడు, డాన్సులు బాగున్నాయి. రీతు వర్మ కూడా కథకి చాలా కీలకమైన పాత్రని పోషించారు. చూడటానికి చాలా బబ్లీగా ఉంది అలాగే పెర్ఫార్మన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది. హీరోయిన్ కి తల్లిగా నటించిన సితార కూడా తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ మూవీ డైరెక్టర్ సత్య హీరో, హీరోయిన్ ని ఎంచుకోవడంలో అలాగే కొంతమంది టెక్నీషియన్స్ ని ఎంచుకోవడంలో సక్సెస్ అయ్యాడు కానీ సినిమాని తీయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపిస్తుంది, కానీ సెకండాఫ్ మాత్రం రొటీన్ అనే పదమే సిగ్గుపడేంత రొటీన్ గా ఉంటుంది. సినిమా మొదలయ్యాక హీరో, హీరోయిన్ పాత్రలు పరిచయం అయ్యాక ఇక సినిమా ఏం జరుగుతుంది, ట్విస్ట్ లు ఏంటి, శుభం కార్డ్ ఏంటి అనేది తెలిసిపోతుంది. దీన్నిబట్టే స్క్రీన్ ప్లే ఎంత ఘోరంగా ఉందనేది తెలుసుకోవచ్చు.
దీక్ష పనత్ ని ఓ పాత్ర కోసం ఎంచుకున్నారు, సినిమాని సాగదీయడం కోసం తప్ప ఎందుకు ఉపయోగం లేని పాత్ర అది. అలాగే కృష్ణ భగవాన్ – కొండవలస కాంబినేషన్స్ సీన్స్ కూడా సినిమాకి అస్సలు అవసరం లేదు. అవి ఎందుకు తీసాడనేది డైరెక్టర్ కన్నా తెలుసో లేదో. ఓవరాల్ గా ఎక్కడో ఒకటి రెండు చోట్ల మీకు నవ్వు వస్తుంది తప్ప మిగతా ఎక్కడా ప్రేక్షకులు నవ్వుకునే కామెడీ లేదు. సినిమాలో పాటలు చాలానే ఉన్నాయి, సినిమా ముందుకు వెళ్ళట్లేదు అని ఆడియన్స్ గగ్గోలు పెడుతుంటే మధ్యలో పాటలు వచ్చి కాస్త చిరాకు పెడతాయి. ఈ మూవీ క్లైమాక్స్ ని బ్లాకు అండ్ వైట్ కాలం నాటి నుంచి చూస్తున్నాం.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో మొదటిది కుమార స్వామి సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేంని చాలా గ్రాండ్ గా, రిచ్ ఫీల్ కలిగేలా షూట్ చేసాడు. అలాగే అచ్చు కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి కానీ వరుసగా రావడం వల్ల బోర్ కొడతాయి. కానీ అచ్చు కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన పనితనంతో ఫస్ట్ హాఫ్ తో పరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం చాలా దారుణంగా ఎడిట్ చేసాడు. దానివల్ల ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతున్నారు.
ఇక మొదటి సినిమా చేసిన సత్య కథ – కథనం – డైలాగ్స్ – డైరెక్షన్ విహాగాలను డీల్ చేసాడు. ఈ నాలుగు డిపార్ట్ మెంట్స్ లో అతను సక్సెస్ అయినది ఏమన్నా ఉంది అంటే అది డైరెక్షన్ అనే చెప్పాలి. అది కూడా హీరో, హీరోయిన్ దగ్గర నుంచి నటనని రాబట్టుకోవడంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు. మిగతా అన్ని చోట్లా ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్.. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
ఒక చిన్న మెసేజ్ తో వచ్చిన ‘నా రాకుమారుడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ‘జీరో రాకుమారుడు’గా మిగిలిపోతుంది. ఎందుకంటే నటీనటుల పెర్ఫార్మన్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవు. రొటీన్ స్టొరీ ప్లాట్ ని తీసుకొని దానికో మెసేజ్ ని తగిలించేసి అదే కొత్తదనం అనుకొని సత్య తనకి వచ్చిన మొదటి అవకాశాన్ని చేజేతులా వృధా చేసుకున్నాడు. థియేటర్ కి వెళ్ళే అనత అయితే ఈ సినిమాలో ఏం లేదు. ఇక వెళ్ళడం వెళ్లకపోవడం మీ చాయిస్..
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం