విడుదల తేదీ : 11 అక్టోబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5 |
||
దర్శకుడు : హరీష్ శంకర్ |
||
నిర్మాత : దిల్ రాజు |
||
సంగీతం : ఎస్ఎస్ థమన్ |
||
నటీనటులు : ఎన్.టి.ఆర్,సమంత, శృతి హాసన్.. |
క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను మెప్పించగల యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ – అభిరుచిగల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్.టి.ఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటించింది. శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో? లేదో? ఇప్పుడు చూద్దాం…
కథ :
నందు(ఎన్.టి.ఆర్) కాలేజ్ కి తక్కువగా, ఫ్రెండ్స్ తో బయట ఎక్కువగా తిరిగే ఓ కాలేజ్ స్టూడెంట్. మన హీరో నందుకి తను అనుకున్న రీతిలో ఉండే అమ్మాయి ఆకర్ష (సమంత) కనపడుతుంది. దాంతో తనని ప్రేమలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆకర్ష భామ అయినటువంటి బేబీ షామిలి(రోహిణి హత్తాంగది)కి బాగా క్లోజ్ అవుతాడు. ఆకర్షతో ఇంకా క్లోజ్ అవ్వడానికి నందు ఆకర్ష అక్క పెళ్ళికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఎవరో ఆకర్ష వాళ్ళ నాన్న, పెద్ద బిజినెస్ మాన్ అయిన ముసల్లపాడు నాగభూషణం(ముఖేష్ ఋషి)ని చంపేస్తారు. అప్పుడే నాగ భూషణం కేసుని ఇన్వెస్ట్ చేయడానికి ఎసిపి అవినాష్(రావు రమేష్)ని రంగంలోకి దింపుతారు. అప్పుడే నందు అసలు పేరు రాము అని, అతను ఆదిత్య పురానికి చెందిన వాడని తెలుస్తుంది. ఆదిత్య పురంలో అసలు ఏం జరిగింది? ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అమ్ములు(శృతి హాసన్)కి రాముకి సంబంధం ఏమిటి? అసలు రాము ఎందుకు నందులా ఎందుకు మారాడు? అసలు నాగభూషణంని చంపించి ఎవరు? చిబరికి రాము అలియాస్ నందు – ఆకర్ష ఒకటయ్యారా?లేదా? అనే విషయాల్ని మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పుడు తన హీరోలో ఉన్న ప్లస్ పాయింట్స్ ని తెలుసుకొని ఆ హీరో ఇమేజ్ కి తగ్గకుండా తెరపై అతని హీరోయిజం చూపిస్తాడు. ఇందులోనూ అలానే హీరోని చూపించాడు. రామయ్యా వస్తావయ్యా – ఇట్స్ ఓన్లీ ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్ ఎంటర్టైనర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ గా, హాన్డ్సం గా కనిపించాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం తన కామెడీతో నవ్విస్తూనే ఉంటారు. చెప్పాలంటే ఎన్.టి.ఆర్ చేసిన కామెడీ పార్ట్ నాకు తెలిసి ఇప్పటివరకూ ఏ సినిమా లోనూ చెయ్యలేదు. అలాగే సెకండాఫ్ లో సెంటి మెంట్ మరియు యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బరిగీసి విలన్స్ తో చేసే ఫైట్ ఎన్.టి.ఆర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాడు. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా డాన్సులు బాగా వేసాడు. ‘పండగ చేస్కో’సాంగ్ లో స్టెప్స్ సూపర్బ్ గా ఉన్నాయి.
సినిమాలో సమంత చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించిన సమంత ఎప్పటిలానే నటన పరంగా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. శృతి హాసన్ పల్లెటూరులో ఉన్నప్పటికీ చదువుకున్న అమ్మాయి కాబట్టి బాగా మోడ్రన్ గా చూపించారు. ఒక కీలకమైన పాత్ర పోషించిన శృతి తన పాత్రకి న్యాయం చేసింది. రోహిణి హత్తాంగది కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ బాగా నవ్విస్తుంది. కోట శ్రీనివాసరావు, రావు రమేష్ లు తమ పాత్ర పరిధిమేర నటించారు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగడమే కాకుండా, ఫుల్ కామెడీతో అప్పుడే అయిపోయిందా అనే రేంజ్ లో ఉంటుంది. అలాగే సినిమాలో పాటలన్నిటి తెరపై బాగా రిచ్ గా కనిపించేలా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ లో ఎన్.టి.ఆర్ – రోహిణి హత్తాంగది మధ్య వచ్చే ఎపిసోడ్ చాలా బాగుంది. అలాగే సినిమాలో హీరోని ఎలివేట్ చేసేస్ సీన్స్ చాలా బాగా వచ్చాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండాఫ్ సాగదు. సెకండాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పవర్ ప్యాక్ లా ఉన్నప్పటికీ ఆడియన్స్ కి ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. రివెంజ్ అనే కథాంశంతో సినిమాని తెరకెక్కించినప్పుదు స్క్రీన్ ప్లే కాస్త టఫ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. అది సరిగా కుదరకపోవడం వల్ల సెకండాఫ్ మరియు క్లైమాక్స్ ఊహాజనితంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండాఫ్ లో లేకపోవడం మరో మైనస్ పాయింట్.
ఎన్.టి.ఆర్ – సమంతల మధ్య లవ్ ట్రాక్ ని ఇంకాస్త బెటర్ గా చూపించి ఉండాల్సింది. రవి శంకర్ నటన బాగానే ఉన్నప్పటికీ, పాత్ర మాత్రం పెద్ద చెప్పుకునే స్థాయిలో లేదు. సెకండాఫ్ లో గుళ్ళో వచ్చే ఓ ఫైట్ ఎపిసోడ్ ని బాగానే తీసారు కానీ ఆ ఫైట్ ని ఇంకా సూపర్బ్ గా తియ్యొచ్చు.
సాంకేతిక విభాగం :
సినిమాలో చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి లొకేషన్ ని మరియు ప్రతి నటీనటుల హావభావాలని సూపర్బ్ గా కెమెరాలో బందించి మనకు చూపించాడు. ఎడిటర్ గౌతంరాజు సెకండాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. థమన్ అందించిన పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి, అదే స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాడు.
స్క్రీన్ ప్లే పెద్ద చెప్పుకునే స్థాయిలో లేదు. హరీష్ శంకర్ హీరోని, హీరోయిజంని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ అతను డీల్ చేసిన కథ – మాటలు – దర్శకత్వం విభాగాలకి వస్తే, కథ – జస్ట్ ఓకే, మాటలు – అదరగొట్టాడు, ముఖ్యంగా హీరో చేత చెప్పించిన వన్ లైన్ డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఇక డైరెక్షన్ – బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి.
తీర్పు :
‘రామయ్యా వస్తావయ్యా’ – ఎన్.టి.ఆర్ స్టైలిష్ పవర్ ప్యాక్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో మీరు ఎన్నడు చూడని ఓ కొత్త ఎన్.టి.ఆర్ చూసి థ్రిల్ అవుతారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మాములుగా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటారు, కానీ రామయ్యా వస్తావయ్యా అంటే ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్ ఎంటర్టైనర్ ని చెప్పుకోవాలి. ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్, కామెడీ, పవర్ఫుల్ యాక్షన్ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే సినిమా ఫస్ట్ హాఫ్, సమంత, శృతి హాసన్ ల గ్లామర్, ఇతర నటీనటుల నటన థియేటర్స్ కి వెళ్ళిన వారికి లభించే బోనస్ పాయింట్స్. సెకండాఫ్ కాస్త రొటీన్ గా, స్లోగా అనిపించినప్పటికీ పవర్ ప్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నందువల్ల మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశించవచ్చు. చివరిగా ‘రామయ్యా వస్తావయ్యా’ – వచ్చాడయ్యా హిట్ కొట్టాడయ్యా…
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
రాఘవ