సమీక్ష : సింగం – పవర్ఫుల్ పోలీస్ డ్రామా

సమీక్ష : సింగం – పవర్ఫుల్ పోలీస్ డ్రామా

Published on Jul 6, 2013 3:30 AM IST
Singam1 విడుదల తేదీ : 05 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : హరి
నిర్మాత : ఎస్. లక్ష్మన్ కుమార్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : సూర్య, అనుష్క, హన్సిక..


తమిళ్ హీరో సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, యోగా బ్యూటీ అనుష్క హీరోయిన్ గా 2010లో హిట్ అయిన సినిమా ‘యముడు’. ఈ చిత్ర దర్శకుడు హరి ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ గా ‘సింగం’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య సరసన అనుష్కతో పాటు హన్సిక కూడా స్క్రీన్ పంచుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని కె జ్ఞానవేల్ రాజ నిర్మించారు. మొదటి పార్ట్ ‘యముడు’ పెద్ద హిట్ అయ్యి ఉండడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న ‘సింగం’ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సీక్వెల్ ‘సింగం’ భారీ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

యముడు సినిమాకి చివరి నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ప్రకర్ష్ రాజ్ ని పట్టుకున్న తర్వాత నరసింహం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత హోం మినిస్టర్ రామచంద్రన్(విజయ్ కుమార్) కాకినాడ ఫోర్ట్ నుండి అక్రమంగా ఆయుధాలు రవాణా జరుగుతుందని, దానికి కారణమైన వారందరినీ పట్టుకోవాలని ఒక సీక్రెట్ మిషన్ మొదలు పెడతాడు. అందులో భాగంగా నరసింహం కాకినాడ వచ్చి ఓ స్కూల్ లో ఎన్.సి.సి ఇన్ చార్జ్ గా పనిచేస్తూ అక్కడ సమాచారాన్ని సేకరిస్తుంటాడు. అదే స్కూల్ లో చదివే హన్సిక(సత్య) అతన్ని ప్రేమిస్తుంది. కానీ నరసింహం అప్పటికే కావ్య(అనుష్క)తో ప్రేమలో ఉండడం వల్ల దివ్య ప్రేమని అంగీకరించాడు.

అదే సమయంలో కాకినాడలో భాయ్(ముఖేష్ రుషి) – త్యాగరాజు(రెహమాన్)కి మధ్య గొడవలుంటాయి. భాయ్ అక్రమంగా సరుకులు రవాణా చేస్తున్నాడని నరసింహం తెలుసుకుంటాడు. కానీ అతను రవాణా చేసేది వెపన్స్ లేక వేరేనా అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. త్యాగరాజు లీగల్ గా బిజినెస్ చేస్తున్నాడని భావిస్తాడు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత చార్జ్ తీసుకుందామనుకున్న నరసింహం కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుగానే చార్జ్ తీసుకుంటాడు. ఆ తర్వాత భాయ్ చేస్తున్న వ్యాపారం గురించి తెలుసుకొని షాక్ తిన్న నరసింహంకి భాయ్ ఒక ఇంటర్నేషనల్ డాన్ అయిన డానీ(ఆఫ్రికన్ యాక్టర్) తో బిజినెస్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ సమయంలోనే నరసింహంకి మరో నమ్మలేని నిజం తెలుస్తుంది. దాంతో కథ తారా స్థాయికి చేరుతుంది. అసలు నరసింహం తెలుసుకున్న నమ్మలేని నిజం ఏమిటి? భాయ్ డానీతో కలిసి చేసే బిజినెస్ ఏమిటి? భాయ్ – త్యాగరాజులు నిజంగానే శత్రువులా?కాదా? చివరికి నరసింహం అసలు ఎలా డానీని పట్టుకున్నాడు? సమాజంలోని చీడ పురుగుల్ని ఏరిపారేయడానికి సింగం వేట ఎలా సాగింది అనేదాన్ని తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి హీరో సూర్యని వన్ మాన్ ఆర్మీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొదటి నుంచి చివరి వరకూ అతనే ముందుకు నడిపించాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో సూర్య నటన సూపర్బ్ గా ఉంది. అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు. సినిమాలో సూర్య విలన్స్ ముందు చెప్పే పంచ్ డైలాగ్స్ బి, సి సెంటర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే సూర్య లుక్ చాలా బాగుంది. అనుష్కకి మొదటి పార్ట్ లో లానే పెద్ద పాత్ర లేకపోయినా ఉన్నంత సేపూ బాగా నటించింది, అలాగే పాటల్లో గ్లామర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హన్సిక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేసింది కానీ చాలా తక్కువ సేపే స్క్రీన్ మీద కనపడుతుంది. మొదటి పాటలో వచ్చిన అంజలి ఒక రెండు నిమిషాలు ముందు బెంచ్ వారిని ఎంటర్టైన్ చేసింది.

వివేక్, సంతానంలు అక్కడక్కడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నవ్వించారు. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన యాక్టర్ నటన పాత్రకి తగ్గట్టు ఉంది. ముఖేష్ రుషి, రెహమాన్ లు తమ పాత్రలను న్యాయం చేసారు. సీనియర్ నటులు విజయ్ కుమార్, నాజర్, విశ్వా నాథ్ లు తమ పరిధిమేర నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో సూర్య చార్జ్ తీసుకున్న తర్వాత వచ్చే సీన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ముఖ్యంగా పెళ్లి ఇంటి దగ్గర వచ్చే ఫైట్, అలాగే చేజ్ లు ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఆ విషయంలో ప్రొడక్షన్ టీం చాలా కేర్ తీసుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో చెప్పాలనుకున్న ప్లాట్ ని మొదటి అర్థభాగం మొదలైన కొద్దిసేపటికే చెప్పేయడం వాళ్ళ చాలా చోట్ల తదుపరి వచ్చే సీన్స్ ఏంటా అనేది మనకి ముందే తెలిసిపోతుంటాయి. ఇలా కథ ముందే చెప్పెసినప్పుడు స్క్రీన్ ప్లే చాలా పగడ్బందీగా, తెగేదాకా సీన్స్ ని సాగదీయకుండా చూసుకోవాలి. ఆ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఉద్దహరణకి హాస్పిటల్ లో ఆక్సిజన్ పెట్టిన వాడికి సడన్ గా ఆక్సిజన్ తీసి తీసి పెడుతుంటే ఊపిరి ఆడక ఎలా ఎగిరి ఎగిరి పడతాడో అదే రేంజ్ లో సినిమా మొదటి నుంచి కాసేపు వేగంగా వెళ్తుంది మధ్యలో సడన్ గా డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది పడిపోతుంది. సినిమా మొత్తం ఇలానే సాగుతుంది ముఖ్యంగా క్లైమాక్స్ ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది. విలన్ పాత్రని ఇంకాస్త స్ట్రాంగ్ గా చూపించి ఉంటే సినిమా ఇంకా పసందుగా ఉండేది. సినిమాలో మాస్ ని ఆకట్టుకునే అంశాలున్నా ఎ సెంటర్ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ అంతగా లేకపోవడం ఓ మైనస్. పాటలు అంతంత మాత్రంగా ఉన్నాయి, అలాగే అవి వచ్చే సందర్భాలు కూడా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా మూడు విభాగాలను హరి డీల్ చేసాడు. సూర్యని పవర్ఫుల్ గా చూపించడంలో, అనుకున్న కాన్సెప్ట్ చిన్నదే అయినప్పటికీ దాన్ని డీల్ చెయ్యడంలో డైరెక్టర్ గా హరి సక్సెస్ అయ్యాడు. కానీ స్క్రీన్ ప్లే, కథలో ట్విస్ట్ ల మీద ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి పెద్ద తేడా ఉండదు. ఎడిటర్ ఈ సినిమాకి చాలా చోట్ల కత్తెర వేసి చాలా సాగదీసిన ఎపిసోడ్స్ ని లేపేసి ఉంటె సినిమా ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాకి ఫైట్స్ ఎలా ఉండాలో అదే రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసారు. దేవీశ్రీ అందినచిన పాటలు జస్ట్ ఓకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అలాగే ‘సూరీడు సూరీడు’ , సింగం సింగం’ పాటల్ని బ్యాక్ గ్రౌండ్ లో బాగా వాడుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘సింగం(యముడు 2)’ సినిమా మాస్ ని మెప్పించే పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య నటన, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, అనుష్క గ్లామర్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే సినిమా వేగం అక్కడక్కడా తగ్గడం, క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం, సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండడం చెప్పదగిన మైనస్. ఎ సెంటర్లలో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేము గానీ బి, సి సెంటర్లలో మాత్రం బాగా రిసీవ్ చేసుకుంటారు. చివరిగా ‘యముడు’కి సీక్వెల్ గా వచ్చిన ‘సింగం’ కూడా పవర్ఫుల్ పోలీస్ డ్రామా విత్ ఫుల్ యాక్షన్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు