సమీక్ష : విశ్వరూపం – ఉగ్రవాదం పై ఉక్కుపాదం

సమీక్ష : విశ్వరూపం – ఉగ్రవాదం పై ఉక్కుపాదం

Published on Jan 25, 2013 1:30 PM IST
viswaroopam విడుదల తేదీ : 25 జనవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : కమల్ హాసన్
నిర్మాత : కమల్ హాసన్, చంద్ర హాసన్
సంగీతం : శంకర్ – ఎహాసన్ – లాయ్
నటీనటులు : కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్

లోక నాయకుడు కమల్ హాసన్ నటించి ఆయన స్వీయ దర్శకత్వంలో తీసిన ‘విశ్వరూపం’ ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ రోజు విడుదలైంది. కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నిర్మితమైంది. కమల్ హాసన్ డైరెక్షన్ తో పాటు సినిమా నిర్మాణంలో కూడా ఆయన పాలుపంచుకున్నారు. మరి ఈ విశ్వరూపం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

విశ్వనాధ్ (కమల్ హాసన్) న్యూయార్క్ లో ఉండే క్లాసికల్ డాన్స్ టీచర్. ఆయన భార్య డాక్టర్ నిరుపమ (పూజ కుమార్) విశ్వనాధ్ మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఏజెంట్ సహాయం కోరుతుంది. ఆ డిటెక్టివ్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం విశ్వనాధ్ హిందూ కాదని ముస్లిం అని తెలుస్తుంది. విశ్వనాధ్ పట్టుకునే క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం టెర్రరిస్ట్ ఒమర్ (రాహుల్ బోస్) కి దొరికిపోతాడు. ఆ క్రమంలో విశ్వనాధ్ ఎవరు అని కనుక్కునే ప్రయత్నంలో విశ్వనాధ్ గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు విశ్వనాధ్ ఎవరు? అతనికి టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? ఇంతకు విశ్వనాధ్ మంచి వాడా? చెడ్డవాడా?

ప్లస్ పాయింట్స్ :

కమల్ హాసన్ చేసిన ఈ ప్రయత్నానికి ఆయనకీ హాట్సాఫ్ చెప్పి తీరాలి. నటుడిగా ఆయన ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించారు.డాన్స్ టీచర్ పాత్రలో నవ్వులు పూయించాడు. ముస్లిం పాత్రలో ఒదిగిపోయాడు. విశ్వనాధ్ భార్యగా పూజ కుమార్ నవ్విస్తూ బాగా చేసింది. కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం చేయకుండా చివరి వరకు ఆమె పాత్రని వాడుకున్నారు. ఆమె పాత్రకి డబ్బింగ్ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. హిందీ నటుడు రాహుల్ బోస్ ప్రతి నాయకుడి పాత్రలో భయపెట్టాడు. ఆయన పాత్రకి డబ్బింగ్ ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బావుండేది. జైదీప్ అహ్లావత్ ఒమర్ అనుచరుడు సల్మాన్ గా కీలక పాత్ర చాలాబాగా చేసాడు. శేఖర్ కపూర్, నాజర్ పరిమితి గల పాత్రల్లో కనిపించి పర్వాలేదనిపించారు. మొదటి 20 నిముషాలు పాత్రలను పరిచయం చేస్తూ ఆ తరువాత కామెడీ పండిస్తూ ఆసక్తికరంగా కథనం సాగింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆర్మీ ఎటాక్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వాడుకుంటూ కథనం వేగంగా పరిగెత్తించాడు. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో చూపించే టెర్రరిస్ట్ సన్నివేశాలు చూస్తే కమల్ వారి మీద అధ్యయనం చేసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంగ్లీష్ సినిమాల మాదిరిగా ఉన్నప్పటికీ పర్వాలేదు.

మైనస్ పాయింట్స్ :

కమల్ కథనంలో ఇంకాస్త వేగం పెంచి ఉంటే బావుండేది. ఇలాంటి సినిమాలు కేవలం మల్టిప్లెక్స్ ఆడియెన్స్, ఏ సెంటర్స్ వారికి వారికి మాత్రమే నచ్చుతాయి. సెకండ్ హాఫ్ నత్త నడకన సాగడం, క్లైమాక్స్ ఉన్నపళంగా ఊడిపడటం రుచించవు. వీటికి తోడు పాటలు కూడా ఈ సినిమాలో ఇమడ లేవు.

చిత్రం స్పై థ్రిల్లర్ కావడంతో నేరేషన్ చాలా పగడ్భందిగా ఉంటె ఈ చిత్రం మరింత బాగుండేది. ఎ చిత్రం అములు సినిమా అభిమానులకు, ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికి కాస్త నిరాశ కలిగిస్తుంది అని చెప్పచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా విశ్వరూపం అత్యున్నత విలువలతో తెరకెక్కించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సను జాన్ సినిమాటోగ్రఫీ గురించి. ఈ సినిమాకి కమల్ తరువాత సినిమాటోగ్రఫీ హైలెట్. ఇండియన్ సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గవు అని చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అధ్బుతం. మహేష్ నారాయణ్ ఎడిటింగ్ బావుంది. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ యుద్ధ ప్రాంతాల సెట్స్ వేసిన ఆర్ట్ విభాగాన్ని అయితే మెచ్చుకొని తీరాల్సిందే. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతంలో అణు వినాశ, తుపాకి పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. విశ్వరూపం అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందింది.

తీర్పు :

సాంకేతికంగా అద్భుతమయిన చిత్రం అయినప్పటికీ మల్టీప్లెక్స్ మరియు ఏ సెంటర్ లకు మాత్రమే ఈ చిత్ర ప్రభావం పరిమితం అవుతుంది. సినిమాటోగ్రఫీ మరియు యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్. కాస్త నెమ్మదించిన నేరేషన్, అనవసరంగా వచ్చే పాటలు ఇబ్బంది పెడుతుంది. ఈ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలి ఆ విషయంలో కమల్ హాసన్ కి హాట్సాఫ్

రేటింగ్ 3.25/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు