విడుదల తేదీ: 14 డిసెంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు :గౌతమ్ వాసుదేవ్ మీనన్ |
||
నిర్మాత : సి .కళ్యాణ్ | ||
సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా |
||
నటీనటులు : నాని, సమంత |
‘ఈగ’ సినిమా తర్వాత యంగ్ హీరో నాని, చెన్నై ముద్దుగుమ్మ సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. వెరైటీ పాయింట్స్ తో లవ్ స్టోరీలు తీసే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకి డైరెక్టర్. మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ రోజు విడుదలైంది. ఆడియో రిలీజ్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ సినిమాని తెలుగులో సి. కళ్యాణ్ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ :
వరుణ్ (నాని) – నిత్య (సమంత) అనే ఇద్దరి ప్రేమాయణాన్ని వారి స్కూల్ వయసు నుండి దశల వారిగా చూపించారు. ఈ సినిమాలో వీరిద్దరూ చాలా సార్లు ప్రేమలో పడుతుంటారు మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యల వల్ల విడిపోతుంటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వారిద్దరూ డీప్ లవ్ లో ఉంటారు అందుకే మళ్ళీ మళ్ళీ కలవాలని చాన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎటో వెళ్ళిపోయింది మనసు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారు మళ్ళీ ఎలా కలుస్తున్నారు అనే స్టొరీ లైన్ మీద సాగుతుంది.
కెరీర్, ఫ్యామిలీ ఇబ్బందులు, స్వార్ధం అలాగే కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ తో ఈ సినిమాలో వీరిద్దరి జర్నీ సాగుతుంది. సినిమా చివరికొచ్చేసరికి వరుణ్, నిత్యా ఎవరి దారిన వాళ్ళు వెల్లిపోదాం అని నిర్ణయించుకుంటారు వాళ్ళు అలా ఎందుకు డిసైడ్ అయ్యారు? ఆ తర్వాత ఏంజరిగింది అనేదే ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి రియల్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా సమంత మాత్రమే, సమంత లేకపోతే సినిమా పెద్దగా అనిపించేది కాదు. ఈ సినిమాలో తను చేసిన మూడు దశలకు తగ్గట్టు తన బాడీని, పాత్రని మలుచుకోవడం చాలా బాగుంది. స్కూల్ స్టూడెంట్ గా చాలా క్యూట్ గా ఉంది, కాలేజ్ అమ్మాయిలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చివరిగా సమాజ సేవ చేసే పాత్రకి తగ్గట్టు చేసింది. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్. నాని ఈ సినిమాలో రియాలిటీకి దగ్గరగా మరియు అందరూ నచ్చేలా పెర్ఫార్మన్స్ చేసాడు. కానీ కొన్ని సందర్బాలలో సమంత నానిని డామినేట్ చేసేలా ఉంటుంది. గ్లామరస్ యాక్టర్ కంటే నాని చాలా మంచి నటుడు, ఆ విషయాన్ని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు.
కృష్ణుడు నటన మరియు పాత్ర బాగుంది. తను ఉన్నంత సేపు కొంత కామెడీ ఉంటుంది. సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి, అవికూడా మొదటి 30 నిమషాల్లోనే ఉన్నాయి. మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు ఈ సినిమాకి మరింత రొమాంటిక్ మూడ్ తీసుకొస్తాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా చాలా నిధానంగా సాగదీయడం చెప్పుకోవాల్సిన పెద్ద మైనస్ పాయింట్. ‘ఏ మాయ చేసావే’ సినిమా కూడా స్లోగానే ఉంటుంది కానీ ఈ సినిమా దానికంటే స్లోగా ఉంటుంది. బ్రేక్ అప్ సీన్స్ చాలా ఎక్కువగా ఉండటం, ఆ సీన్స్ లో డైలాగ్స్ కూడా బాగా లేకపోవడంతో సినిమాలో వస్తున్న ఫ్లో పూర్తిగా దెబ్బతింటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక 30 నిమిషాలు తప్ప మిగతా అంతా రబ్బరు సాగదీసినట్టు సాగదీసి వదిలాడు. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ స్టొరీ మాత్రం అతికీ అతకనట్టు, కలిసి కలవనట్టు ఉంటుంది.
సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నప్పుడు హీరో హీరోయిన్ హావ భావాలు చాలా అవసరం అవి కరెక్ట్ గా ఉంటేనే ప్రేక్షకులు సినిమాలో లీనమవుతారు. కానీ గౌతమ్ మీనన్ అలాంటి సన్నివేశాలన్నింటిని లాంగ్ షాట్స్ తీసారు. అలాగే సినిమా చివర్లో ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకునేటప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ మేము మిస్ అయ్యాము. సినిమాలో పాటల ప్లేస్ మెంట్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. సినిమాలో వచ్చే ఫీల్ కి మధ్యలో వచ్చే ఆ పాటల ఫీల్ కి పెద్ద తేడా ఏమీ ఉండదు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చూస్తే గౌతమ్ మీనన్ సినిమానా ఇది అనే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా కెమెరా ప్లేస్ మెంట్స్ అస్సలు బాలేవు. ఎడిటింగ్ కూడా అంత బాగోలేదు, చాలా సన్నివేశాలను కత్తిరించి పారేయచ్చు. సమంత ని బ్యూటిఫుల్ గా చూపించడంలో గౌతమ్ మీనన్ సక్సెస్ అయ్యాడు కానీ డైరెక్టర్ గా మాత్రం జస్ట్ పాస్ మార్కులు సంపాదించుకున్నాడు.ఈ సినిమా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.
తీర్పు :
ఈ సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాకి కొనసాగింపు కాదు, ఈ సినిమా దానికి సెకండ్ పార్ట్ అనుకొని సినిమాకి వెళ్లొద్దు. మీరు ఇప్పటికే ఎవరితోనైనా గాడమైన ప్రేమలో ఉంటే ఈ సినిమా మీకు చాలా బాగుందనిపిస్తుంది. మిగతా రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా అంతగా లేకపోవడంతో బాగా స్లో గా అనిపిస్తుంది. సమంత బ్యూటిఫుల్ లుక్ మరియు పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్. ఇదొక్కటే సినిమాని బాక్స్ ఆఫీసు వద్ద గట్టెక్కించడానికి ఉపయోగపడుతుందా? లేదా అనేది చూడాలి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
Translated by – Rag’s
Click Here For ‘Yeto Vellipoyindhi Manasu’ English Review