మన టాలీవుడ్ సినిమా దగ్గర ప్రతీ సంక్రాంతి పండుగ కూడా మంచి రసవత్తరంగానే సాగుతుంది అని చెప్పాలి. అలా గత ఏడాది వచ్చిన పలు సినిమాలు క్రేజీ రెస్పాన్స్ ని కూడా అందుకున్నాయి. ఇక ఈ 2025 సంక్రాంతి కూడా సాలిడ్ సినిమాలు మన తెనుగు నుంచి ఉన్నాయి. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ముందు ఖాతా తెరవనుండగా తర్వాత బాలయ్య డాకు మహారాజ్ అలాగే ఈ సినిమా తర్వాత వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి.
అయితే మొదటి నుంచీ ఈ మూడు సినిమాలకి మంచి బజ్ ఉంది కాని ఈ సినిమాల తాలూకా ట్రైలర్ లు వచ్చాక ఇంట్రెస్టింగ్ గా మూడింటికి ఆడియెన్స్ నుంచి ప్రామిసింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సంక్రాంతి పండుగ మరింత రసవత్తరంగా మారింది అని చెప్పాలి. అన్ని సినిమాలు క్లిక్ అయితే గతేడాది దీపావళి లానే రన్ దక్కుతుంది అని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సినిమాలు ఎలాంటి స్పందన అందుకుంటాయి అనేది.