బాడీ గార్డ్ మొదటి షో వివరాలు

Bodyguard

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:30 AM

క్లైమాక్స్ . కొద్దిసేపట్లో సమీక్ష అందిస్తాం.

Updated 11:18 AM

క్లైమాక్స్ ఫైట్ నడుస్తుంది. స్కార్పియో చేస్ లు అన్ని గాల్లోకి లేస్తున్నాయి

Updated 11:08 AM

సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఊహించిందే.

Updated 10:52 AM

మరో పాట. సెట్ వేసి బాగా తీసారు. మొత్తంగా చూస్తే బావుంది.

Updated 10:47 AM

వెంకీ కొన్ని డ్రామా సన్నివేశాలు పందిస్తున్నాడు. ఈ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతాయి.

Updated 10:34 AM

సినిమా సెంటిమెంట్ ట్విస్ట్ వైపు మళ్ళింది. చూస్తుంటే త్యాగాలు చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది.

Updated 10:27 AM

జియా జలే పాట మొదలైంది.

Updated 10:21 AM

తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ లేడి గెటప్ వేసాడు!

Updated 10:09 AM

ఇంటర్వెల్. మొదటి భాగం కొంచెం కామెడి, రొమాన్స్ మరియు సెంటిమెంట్ తో సాగిపోయింది. రెండవ భాగం ఎలా ఉంటుందో చూద్దాం.

Updated 10:00 AM

మెలోడి పాట 'ఎవ్వరో ఎవ్వరో' మొదలైంది.

Updated 9:54 AM

కోన వెంకట్ డైలాగులు బావున్నాయి. సినిమా కామెడితో సాగుతుంది.

Updated 9:43 AM

వెంకటేష్ భారీ ఫైట్లు చేస్తున్నాడు. వెంకీ వాయిస్ బావుంది.

Updated 9:32 AM

రెండో పాట 'అవతారో బాడీగార్డో' మొదలైంది. కాలేజీలో బాగా తీసారు.

Updated 9:26 AM

కాలేజ్ లో కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. ఎమ్మెస్ నారాయణ లెక్చరర్ గా ఎంట్రీ ఇచ్చాడు

Updated 9:20 AM

ప్రిన్సిపాల్ బావరాజు గా కామెడీ స్టైల్లో జయప్రకాశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. కోట శ్రీనివాస్ రావు మెయిన్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Updated 9:17 AM

వేణుమాధవ్ తనదైన కామెడీ స్టైల్లో క్యాష్ రెడ్డి గా ఎంట్రీ ఇచ్చాడు.

Updated 9:12 AM

స్కార్పియోలు మరియు టాటా సుమోలు గాలిలో ఎగురుతూ భారీ ఫైట్. ప్రకాష్ రాజ్ కూడా ఫైట్ చేస్తున్నారు.

Updated 9:10 AM

వెంకటేష్ బాడీగార్డ్ పని నిమిత్తం జమ్మలమడుగు గ్రామం వెళ్ళాడు. వెంకటేష్ స్టైల్ సెంటిమెంట్ మరియు కామెడీ పండిస్తున్నాడు.

Updated 9:00 AM

అలీ మరియు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఎంట్రీ ఇచ్చారు. త్రిషా మరియు సలోని కూడా ఎంట్రీ ఇచ్చారు.

Updated 8:56 AM

బాడీగార్డ్ హీరో ఇంట్రడక్షన్ పాట. పాట కలర్ఫుల్ గా బాగా తీసారు.

Updated 8:52 AM

వెంకీ హింది సినిమా సింగం స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. థియేటర్ మొత్తం ఈలలతో మోగిపోతుంది.

Updated 8:47 AM

ప్రకాష్ రాజ్ 'వరదరాజుల నాయుడు'గా ఎంట్రీ ఇచ్చాడు.

Updated 8:45 AM

హలో ఫ్రెండ్స్. సినిమా ఇప్పుడే మొదలైంది. టైటిల్స్ పడుతున్నాయి

 
- Ashok
Bookmark and Share