క్షేత్రం మొదటి షో వివరాలు

Kshethram

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

 

Updated 01:38PM

సినిమా పూర్తయింది. కొద్దిసేపట్లో సమీక్ష పెడతాం.

Updated 01:35PM

సినిమా క్లైమక్స్ కి చేరుకుంది.

Updated 01:25PM

ఇన్స్పెక్టర్ మురళీ గా బ్రహ్మాజీ ఎంట్రీ ఇచ్చాడు.

Updated 01:15PM

ఫ్లాష్ బ్యాక్ అయిపోయి ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చింది. ప్రస్తుతం క్షుద్ర పూజ జరుగుతుంది.

Updated 01:05PM

సినిమా మరో అనుకోని బాధాకరమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం అన్నీ సెంటిమెంట్ సన్నివేశాలు వస్తున్నాయి.

Updated 12:55PM

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రియమణి-జగపతి బాబు మధ్య పాట.

Updated 12:35PM

పంచ్ డైలాగులు కొడుతూ, మీసం తిప్పుతూ, తోడ కొడుతున్న జగపతి బాబు.

Updated 12:25PM

విశ్రాంతి. సినిమా ఫస్టాఫ్ లో పాత్రలను పలు భిన్న రకాలుగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం.

Updated 12:10 PM

సినిమా ఫ్ఫ్లాష్ బ్యాక్ కి మారింది. 1980 ల లోని పెద్దమనిషి పాత్రలో జగపతి బాబు ఎంట్రీ ఇచ్చాడు. కోట శ్రీనివాస రావు కూడా ఎంట్రీ ఇచ్చారు.

Updated 11:57 AM

ప్రస్తుతం సినిమా దెయ్యం కథలోకి మారింది. ప్రియమణి చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన లాంటి పాత్రనే చేసింది.

Updated 11:45 AM

సినిమా అనుకోని విషాదకరమైన మలుపు తిరిగింది. దర్శకుడు చంద్రముఖి సినిమా కూడా చాలా సార్లు చూసాడనుకుంట

Updated 11:38 AM

అప్పుడే రెండో పాట మొదలైంది. అది పెళ్లి పాట అయినందుకు సంతోషం. రొటీన్ గా కుటుంబ సభ్యులంతా పాటలో డాన్సు చేస్తున్నారు. రాజీవ్ కనకాల శేఖర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.

Updated 11:25 AM

తనికెళ్ళ భరణి పవర్ఫుల్ 'ఆచారి' పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర దర్శకుడు 'హమ్ ఆప్కే హైన్ కౌన్' మరియు 'మైనే ప్యార్ కియా' చాలా సార్లు చూసాడనుకుంట. హట్రిక్ అప్పారావు గా బ్రాహ్మి ఎంట్రీ ఇచ్చాడు.

Updated 11:15 AM

ప్రియమణి డైలాగులతో అలరిస్త్తుంది. ముఖ్యంగా ఆమె డైలాగులు ఎక్కువగా హిందీలో ఉన్నాయి. ఆమెది తెలుగమ్మాయి కాని పాత్ర. ఇప్పుడే 'చుక్క చుక్క' అనే మొదటి పాట మొదలైంది.

Updated 11:10 AM

ప్రియమణి మరియు కిక్ సినిమా ఫేం శ్యాం మలేషియాలోని కౌలాలంపూర్ లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు.

Updated 11:03 AM

చద్రముఖి సినిమా స్టైల్ టైటిల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇప్పుడే సినిమా మొదలైంది.

Updated 11:00 AM

హలో ఫ్రెండ్స్ 'క్షేత్రం' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం.

చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates

 
- Ashok
Bookmark and Share