కథ :
ప్రేమకు మరణం లేదు, ఎన్నియుగాలు అయిన ప్రేమ తన శక్తిని కోల్పొదు. రాజకుమారి(కాజల్), కాలభైరవుడు(చరణ్) ని ప్రేమిస్తుంది. అనుకోని సంఘటనల ఎదురై ప్రేమికులు దూరం అవుతారు. ఈ జన్మలో హీరో(చరణ్)కి అకస్మాతుగా కొన్ని భావాలు మొదలవుతాయి, ఆ భావాలూ ఏమిటి, నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏమి జరిగింది, ఈ జన్మకు ఆ జన్మకు గల సంభందం ఏమిటి, ప్రేమికులు ఏ విధంగా కలుసుకుంటారు.
నచ్చే అంశాలు :
మొదటి సీన్ మనసును కదిలించే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజభవనం యొక్క అంధాలు ప్రేక్షకులకు ఒక అనుభూతిని కలిగిస్తాయి. సాంకేతిక అంశాలు సినిమా విజయానికి ధోహదపడే విధంగా ఉన్నాయి. సంగీతం ఫరవాలేదనిపించింది. ఫోటోగ్రఫీ బాగుంది. హీరొ సినిమా మొదటి భాగంలో క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. కాజల్ పర్వాలేదనిపించింది. కల(ఆర్ట్) చాలా సహజంగా, గొప్పగా ఉంది. పోరాట దృశ్యాలు ఫర్వలేధనిపించాయి.
|