ఆగస్ట్ 8న ‘గీతాంజలి’ విడుదల..?

geetanjali
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’. కోన వెంకట్ సమర్పణలో యంవివి పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ‘గీతాంజలి’ చిత్రంలో అంజలి నటనతో పాటు సైతాన్ రాజుగా బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రేపు(జూలై 17) గీతాంజలి ప్రమోషనల్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ పాటలో అంజలి, బ్రహ్మానందం, రావురమేష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రధాన తారాగణం అంతా నటించారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో ప్రత్యెక గీతంలో నటించనుందని కోన వెంకట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ ఎవరనేది గోప్యంగా ఉంచారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బలుపు’ చిత్రాలతో అంజలి ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వివాదాలు వెంటాడడం, ‘మసాలా’ చిత్రం పరాజయంతో అవకాశాల వేటలో అంజలి వెనుకబడింది. తెలుగులో ఆమెకు ‘గీతాంజలి’ విజయం చాలా కీలకంగా మారింది.

Exit mobile version