అమితాబ్ బచ్చన్ మీద క్రిమినల్ కేసు

అమెరికా కేంద్రంగా గల ఒక సిక్కు సంస్థ, బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ఒక క్రిమినల్ కేసు దాఖలు చేసింది. 1984 లో ఇందిరాగాంధీ హత్యననంతరం జరిగిన అల్లర్లలో అమితాబ్ పాత్ర ఉందంటూ వీరి ప్రధాన ఆరోపణ. ఈ నేర ఫిర్యాదును ఆస్ట్రేలియా కామన్వెల్త్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యుషన్ కు సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ ఎఫ్ జె) సంస్థ నివేదించింది.

కాగా, అమితాబ్ ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈ ప్రముఖ చిత్రంలో లియోనార్డో డి కాప్రియో కూడా నటిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇంతవరకూ అధికారిక సమాచారం ఏమీ వెలువడలేదు. ఇదిలావుంటే, ఆస్ట్రేలియన్ చట్టం కింద, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక విదేశీయుడు లేదా విదేశీయువతిని యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా హింసాత్మకంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై వాళ్ళు ఆస్ట్రేలియా లో ఉన్నంత కాలం విచారణలు చేయవచ్చు.

అయితే, న్యాయ నిపుణులు ఇది అమితాబ్ కు చిన్న తలనొప్పి మాత్రమే అంటున్నారు.

Exit mobile version