విశాఖలో విధ్వంశం సృష్టించిన హుధూద్ తుఫాన్ బారిన పడ్డ భాదితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహిస్తున్న ఫండ్ రైజింగ్ కార్యక్రమం ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్’. నేడు ఈ కార్యక్రమం లోగోను అధికారికంగా విడుదల చేశారు.
సహాయం అందించడానికి సిద్దంగా ఉన్న చేతులను ఒక చెట్టు ఆకారంలో పొందుపరిచారు. కింద మేము సైతం అక్షరాలను, చెట్టును గ్రీన్, బ్లూ కలర్ లో రాశారు. సింబాలిక్ గా గ్రీన్ కలర్లో రాయడం అంటే విశాఖ పర్యావరణం అభివృద్ధికి, పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం, శక్తిని ఇస్తాం అని అర్ధం. బ్లూ కలర్లో రాయడం అంటే త్రికరణ శుద్ధితో, మనస్పూర్తితో, నిజాయితిగా పని చేస్తున్నాం. మీలో విశ్వాసాన్ని నింపుతాం అని అర్ధం. లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తర్వాత ఈ లోగోను రూపొందించినట్టు మనకు అర్ధం అవుతుంది.
నవంబర్ 30వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ స్టార్ నైట్ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు.