స్నేహా ఉల్లాల్ తమిళ చిత్ర సీమలో అడుగిడేందుకు రంగం సిద్దమైంది. గతేడాది ఆమె, క్రిష్ యొక్క ‘వానం’ (వేదం రీమేక్) లో ఒక కీలక పాత్ర పోషిస్తారని భావించారు. అయితే, ఆమె ఆ ప్రాజెక్టు లో ఆమె భాగస్వామి కాలేకపోయారు.
తాజాగా ఇప్పుడు, అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఈ అమ్మడు. విశాల్, త్రిషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సమరన్’ అనే పేరుతో వస్తోన్న కొత్త తమిళ చిత్రం లో నటించేందుకు స్నేహా ఉల్లాల్ సంతకం చేసింది. తిరు ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని ప్రచారం జరుగుతున్న, ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం కంపోజ్ చేస్తున్నారు. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రాఫర్.
స్నేహా ఉల్లాల్ ఇటీవల నటించిన తెలుగు సినిమా ‘మడత కాజ’ బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ ఫలితాలు అందుకుంటోంది. అన్నట్టు…ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమా లో నటించేందుకు ఈమధ్యే సంతకం కూడా చేసింది.