స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ కొత్త వెంచర్ నవంబర్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో ఇలియానా హీరోయిన్ గా నటించబోతుంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తారు.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం రొమాంటిక్ కోణంలో సాగే ఈ కామెడి ఎంటర్టైనర్ ను దానయ్య నిర్మిస్తున్నారు. భుజం గాయం కు చికిత్స నిమిత్తం అల్లు అర్జున్ ఆస్ట్రేలియా వెళ్లి రావటం కారణంగా ఈ చిత్ర ప్రారంభం కాస్త ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.
గాయం నుంచి తను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నానంటున్నారు అల్లు అర్జున్.