ప్రకాష్ రాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రం ‘ధోనీ’ మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. ఈ చిత్రాన్ని గత కొన్ని రోజులుగా పాండిచేరి లో చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రకాష్ రాజ్, ఆకాష్, రాధిక ఆప్టే, నాజర్, బ్రహ్మానందం ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తోన్న తొలి తెలుగు చిత్రం ఇది. ఈ మూవీని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రానికి, కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్.
డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక తండ్రి తన కుమారున్ని ఉన్నత చదువులు చదివించాలనుకుంటే, కొడుకు క్రికెటర్ కావాలనుకుంటాడు. ఈ తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.