‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సూపర్ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి. వీరిద్దరి కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తూ మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. దాదాపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లోగోని ఈ రోజు లాంచ్ చేసారు.
ఎంఎం కీరవాణి చేతుల మీదుగా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ అనే టైటిల్ ని లాంచ్ చేసారు. కొద్ది రోజుల క్రితం లావణ్య త్రిపాటి నెక్స్ట్ మూవీ లాల్(LOL) అని ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అసలు ఈ లాల్ వెనకున్న అసలు టైటిల్ ఏంటి అనేదాని ఈ రోజు రివీల్ చేసారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా చాలా కామెడీగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పకనే తెలియజేస్తోంది. టైటిల్ కూడా ఆసక్తిని పెంచుతోంది. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య అపాత్రాలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.