సమీక్ష : స్పీడున్నోడు – టైం పాస్ ఎంటర్టైనర్

Speedunnodu review

విడుదల తేదీ : 05 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు

నిర్మాత : భీమనేని సునీత

సంగీతం : డిజే వసంత్

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సొనారిక బడోరియా, ప్రకాష్ రాజ్..


మొదటి సినిమా అయిన అల్లుడు శీను’లోనే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘స్పీడున్నోడు’. ‘సుడిగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రీమేక్స్ కి రారాజు భీమనేని శ్రీనివాసరావు చేసిన ‘సుందర పాండ్యన్’ రీమేక్ సినిమానే ఇది. సొనారిక బడోరియా హీరోయిన్ గా నటించగా, తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ సినిమా ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుండు అంది ఇప్పుడు చూద్దాం..

కథ :

కర్నూల్ జిల్లా రాప్తాడు నియోజగావర్గంలోని వెంకటాపురం – రామగిరి ప్రానతలకు మధ్య ఈ సినిమా జరుగుతుంది. ఇక అసలు కథలోకి వెళితే రామగిరి పంచాయితీ పెద్ద అయిన వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్). డిగ్రీ పూర్తి నాలుగేళ్ళయినా ఎలాంటి పనీ లేకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ని బిందాస్ గా గడుపుతుంటాడు. శోభన్ వీక్ నెస్ ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్ కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికన్నా సిద్దమవుతాడు. అలా తన ఫ్రెండ్ అయిన గిరి(మధు) ఒకమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిని గిరికి సెట్ చేయడం కోసం ఇక రోజు తను వెళ్ళే బస్ ఎక్కుతారు. ఆ అమ్మాయే మన హీరోయిన్ వాసంతి(సొనారిక బడోరియా).

గిరికి వాసంతికి సెట్ చేసే క్రమంలో వాసంతి శోభన్ ప్రేమలో పడుతుంది. ఫైనల్ గా ఓ రోజు ఈ విషయం చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ మధ్య అండర్ స్టాండింగ్ తో శోభన్ – వాసంతిల మధ్య ప్రేమ మొదలవుతుంది. కట్ చేస్తే వీరి ప్రేమ వాసంతి వాళ్ళ ఇంట్లో తెలిసి మొదటి సమస్య మొదలవుతుంది.. ఇదిలా ఉండాగానే శోభన్ కి మరికొన్ని సమస్యలు రావడం మొదలవుతాయి. వీటన్నిటికి కారణం వీరిద్దరి ప్రేమ మరియు శోభన్ కి ఆ రేంజ్ సమస్యలు రావడానికి కారణం మదన్(చైతన్య కృష్ణ), జగన్(కబీర్ సింగ్ దుహాన్). అసలు వీరిద్దరూ ఎవరు? ఎందుకు శోభన్ కి ఇబ్బందులు క్రియేట్ చేసారు? వీరికి శోభన్ కి ఏమన్నా సంబంధం ఉందా? శోభన్ – వాసంతిల ప్రేమ వల్ల జగన్, మదన్ లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

‘స్పీడున్నోడు’ సినిమా చాలా స్పీడ్ గా మొదలవ్వడం, అంతే స్పీడ్ గా కథలోకి వెళ్ళడం, అదే స్పీడ్ తో ఎంటర్టైనింగ్ గా పాత్రలని పరిచయం చేయడమే మొదట అందరికీ బాగా నచ్చే పాయింట్. సినిమా ప్రారంభం చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ మరియు లవ్ ట్రాక్ తో సినిమాని ఎంటర్టైనింగ్ గా ముందుకు నడిపించడం సినిమాకి హైలైట్. ఇకపోతే ఈ సినిమాకి ఇంటర్వెల్ బాంగ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం ఫ్రెండ్ పాత్ర చేసిన శ్రీనివాస్ రెడ్డి, మధులు పంచ్ డైలాగ్స్ తో నవ్విస్తారు. మరో వైపు ఇల్లరికపు అల్లుల్లుగా పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్ లు అక్కడక్కడా నవ్వించారు.

నటీనటుల ఏ మేరకు సినిమాకి సహాయం చేసారు అనే విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ సినిమాలో కూడా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు ఇరగదీశాడు. ఇంట్రడక్షన్ సాంగ్, బెల్లంకొండ మరియు తమన్నా సాంగ్ లో శ్రీనివాస్ స్టెప్స్ అదుర్స్. అలాగే మొదట సారి తను క్లైమాక్స్ లో చేసిన ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. హీరోయిన్ సొనారిక సీన్స్ లో పల్లెటూరి అమ్మాయిలా లంగావొనీల్లో కనిపించి, పాటల్లో మాత్రం అల్ట్రా గ్లామరస్ గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకుంది. నటనాపరంగా పరవాలేదనిపించుకుంది. స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా అందాల ఆరబోతతో ముందు బెంచ్ వారిని పిచ్చెక్కించిందని చెప్పాలి. ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి సపోర్ట్ ని ఇచ్చాడు. ఇక ఫ్రెండ్స్ గా చేసిన మధు, శకలక శంకర్ లు అక్కడక్కడా నవ్వించారు. చైతన్య కృష్ణ మరియు కబీర్ దుహన్ సింగ్ లు నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించారు. కమెడియన్స్ గా కనిపించిన పోసాని కృష్ణ మురళి, పృధ్వీరాజ్, అలీ మరియు ఝాన్సీలు తమదైన తరహాలో అక్కడక్కడా నవ్వించారు. ఇక ముఖ్య పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, పవిత్రా లోకేష్ లు ఉన్న పాత్రలకి మంచి సపోర్ట్ ఇచ్చారు.

స్నేహం ఎంత గొప్పది అనే చెప్పే ఓ కథని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథని జోడించి చెప్పడం బాగుంది. మెయిన్ గా ఈ సినిమా చివరికి వచ్చేసరికి వరుసగా రివీల్ అయ్యే ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే చివరి 20 నిమిషాలు సినిమాకి ఆయువు పట్టు అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చడమే కాకుండా ఫ్రెండ్షిప్ గురించి చెప్పే లైన్స్ ఓ మంచి ఫీల్ ని ఇస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఇది రీమేక్ సినిమా.. ఒక నేటివిటీ కథని మన నేటివిటీకి సెట్ అయ్యేలా చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. ఆ మార్పులు సెట్ అయితే సినిమా పెద్ద హిట్ లేదా ప్రేక్షకులకి నచ్చదు. అలాగే ఇది పక్కా తమిళ్ నేటివిటీ సినిమా, ఆ నేటివిటీనే ఆ సినిమాకి హెల్ప్. దాని తెలుగులోకి అన్నప్పుడు నేటివిటీని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఈ సినిమాకి ఎంచుకున్న నేటివిటీ పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. ఎందుకంటే మెయిన్ గా నేటివిటీ అనేది ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ఉండాలి కానీ ఆ పరంగా దానిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎస్టాబ్లిష్ చేయకపోవడమే కాకుండా ఎక్కువ కమర్షియల్ అంశాలను జత చేయడం వలన బోరింగ్ అంశాలు చాలానే సినిమాలో ఉన్నాయి.

ఇకపోతే ఫస్ట్ హాఫ్ ని ఆసక్తిగా స్టార్ట్ చేసినా మధ్య మధ్యలో సినిమా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది, అదీ కాక అలాంటి ప్లేస్ లలో కామెడీ కూడా లేకపోవడం బోరింగ్ గా ఉంటుంది. ఇకపోతే సాంగ్స్ ప్లేస్ మెంట్ మరో మైనస్. ఫస్ట్ హాఫ్ లో అన్ని సాంగ్స్ అవసరం లేదు. మెయిన్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ మరియు సత్య – సొనారిక మధ్య వచ్చే సాంగ్ అవసరం లేదు. ఇక ఆసక్తికర ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికి సినిమా స్లో అయిపోతుంది, అదీకాక పూర్తి డ్రామా ఫార్మాట్ లోకి వెళ్తుంది. ఆ ఎపిసోడ్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. అలాగే ఓవరాల్ రం టైం ని కూడా ఓ 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఈ సినిమాకి చాలా డిపార్ట్ మెంట్స్ వెన్నుదన్నుగా నిలబడ్డాయి. ముందుగా విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా చాలా కలర్ఫుల్ గా విజువల్స్ బాగా గ్రాండ్ గా ఉండేలా కేర్ తీసుకున్నాడు. పాటల పిక్చరైజేషన్ సూపర్బ్. డిజే వసంత్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం ఇంకా బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. మెయిన్ గా సినిమా కథకి తగ్గట్టు సెట్స్ వేసిన కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ లో అక్కడక్కడా సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ మధ్యలో, సెకండాఫ్ మొదట్లో లాగ్ ఫీల్ ఎక్కువ ఉంటుంది. రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. భీమనేనిశ్రీనివాసరావు – ప్రవీణ్ వర్మ కలిసి రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

ఇదొక రీమేక్ సినిమా,, మెయిన్ గా ఒరిజినల్ స్టొరీ లైన్ బాగుంది. ఇక తెలుగు వెర్షన్ కి తగినట్టుగా మార్పులు చేర్పులతోపాటు కథనం – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది భేమనేని శ్రీనివాసరావు. మార్పులు చేర్పుల్లో భాగంగా పక్కా నేటివిటీ అండ్ రియలిస్టిక్ గా అనిపించే కథని బాగా కమర్షియల్ చేసేసాడు. ఈ విషయంలో కొన్ని చోట్ల సక్సెస్ అయితే కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు. కథనం పరంగా చూసుకుంటే.. ఫస్ట్ హాఫ్ కొద్ది సేపటి తర్వాత అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుంది, అలాగే సెకండాఫ్ మొదట్లో డ్రామా ఎక్కువై స్లో అనిపిస్తుంది. అందుక ఆయన కథనంలో రన్ టైంని తగ్గించి నేరేషన్ ని స్పీడ్ చేసుంటే బాగుండేది. దర్శకుడిగా భీమనేని శ్రీనివాసరావు 90% సక్సెస్ అయ్యాడు. ఆ 10% తగ్గడానికి కారణం కథలో ఇంకాస్త బలమైన ఎమోషనల్ టచ్ కి. కామెడీకి స్కోప్ ఉన్నా ఆయన దానిని ఉపయోగించుకోలేకపోవడమే.. భీమనేని సునీత నిర్మాణ విలువలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి.

తీర్పు :

మన నిజజీవితంలో రోజులో చాలా సార్లు వాడుకునే పదం ఫ్రెండ్ లేదా ఫ్రెండ్షిప్.. అలాంటి ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకున్న ఓ మంచి స్టొరీ లైన్ తో పాటు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైనింగ్ కూడా ఉన్న సినిమానే ఈ ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సినిమా మొత్తాన్ని నడిపించి, చివర్లో ఆడియన్స్ ని ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేయడం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే పాయింట్. రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్, చివర్లో ట్విస్ట్ తో కూడిన ఎమోషనల్ సీన్, తమన్నా గ్లామర్ అట్రాక్షన్, అలాగే తెలుగు సినిమాల్లో ఉండే కొన్ని రెగ్యులర్ అంశాలు ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచాయి. అక్కడక్కడా బోరింగ్, సినిమా రన్ టైం, అసందర్భంగా అనిపించే పాటలు, నేటివిటీ అండ్ ఎమోషనల్ కంటెంట్ లోపించినట్లు అనిపించడం ఈ సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఈ స్పీడున్నోడు సినిమాని ఈ వారాంతంలో టైం పాస్ ఎంటర్టైనర్ గా చూడదగిన సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version