విడుదల తేది : 16 మార్చి 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5 |
దర్శకుడు : నారాయణ |
నిర్మాత : వంశీ కృష్ణ శ్రీనివాస్ |
సంగిత డైరెక్టర్ : భీమ్స్ |
తారాగణం : అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ, విమలా రామన్ |
అల్లరి నరేష్ ,శ్రియ మరియు శర్వానంద్ లు కలిసి చేసిన చిత్రం “నువ్వా-నేనా” పి.నారాయణ దర్శకత్వం లో ఎస్ వి కే సినిమా బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం నేఫధ్యం త్రికోణ ప్రేమ కథ. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
అవినాష్(అల్లరి నరేష్) తన స్నేహితుడు అలీ తో కలిసి అమలాపురం లో చిన్నపాటి దొంగతనాలు చేసుకుంటూ ఉండే ఒక కుర్రాడు ఒకానొక భారి దొంగతనం తరువాత నరేష్ మరియు అలీ లు అరవై లక్షల తో హైదరాబాద్ కి పారిపోయి వచ్చేస్తారు. అనుకోకుండా డాక్టర్ నందిని (శ్రియ) ని చూసిన నరేష్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు అప్పటి నుండి ఆమె ప్రేమను గెలుపొందడానికి అన్ని రకములయిన పథకాలు అమలు చేస్తూ ఉంటాడు ఈ మధ్యలో అరవింద్(శర్వానంద్) ఒక భయస్తుడి పాత్రలో డాక్టర్ నందిని దగ్గరకు చికిత్స కోసం వస్తాడు అరవింద్ కూడా నందిని ఇష్టపడటం తో కథ మలుపు తిరుగుతుంది. అవినాష్ మరియు అరవింద్ ల మధ్య ఘర్షణ మొదలవుతుంది. నందిని ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉంటారు అనుకోకుండా వీళ్ళు ఇద్దరికీ ఆకూ భాయ్ (బ్రహ్మానందం) పోటి వస్తాడు శ్రియ మనసుని ఎవరు గెలుచుకున్నారు అనేది మిగిలిన కథ.
ప్లస్ :
అల్లరి నరేష్ అవినాష్ పాత్రలో బాగా నటించారు ఈ పాత్ర అతనికి సరిగ్గా సరిపోయింది. తన హాస్య చతురత మరియు కొన్ని సీన్ ల లో అయన చూపించిన ఈజ్ చూడటానికి చాలా బాగుంది. భయస్తుడి పాత్రలో శర్వానంద్ చాలా బాగా చేశారు కొన్ని సన్నివేశాలలో కాస్త ఎక్కువగా చేసినట్టు అనిపించినా తప్పు అతనిది కాదు పాత్ర అలా ఉంది మరి. శ్రియ చూడటానికి చాలా బాగుంది చీర కట్టులో అందాన్ని ఆరబోసింది తన అందాలతో ఆకట్టుకోవటానికి తన దగ్గర ఇంకా ప్రతిభ ఉంది. ఆకూ భాయ్ గా బ్రహ్మానందం మాములుగానే అలరించారు చాలా రోజుల తరువాత బ్రహ్మానందం పాత్ర బాగా నవ్వించింది మొదటి అర్ధ భాగం లో మంచి హాస్యాన్ని పండించారు బ్లాక్ బెర్రీ పాట చిత్రీకరణ చాలా బాగుంది “బడే మియా చోటే మియా” చిత్రం లో “ఓయ్ మక్నా” పాటను తలపించింది విమల రామన్ ఐటెం సంగ్ పరువాలేదు అనిపించింది.
మైనస్ :
చిత్రం మొదటి అర్ధ భాగం లో హాస్యం బాగా పండించినా రెండవ అర్ధ భాగం లో డైరెక్టర్ కథను చెప్పటం లో విఫలం అయ్యాడు. పతాక సన్నివేశాలు అనవసరంగా పొడిగించినట్టు అనిపించింది. కోవై సరళ పాత్ర చిరాకు తెప్పించింది శ్రియ ,నరేష్ మరియు శర్వానంద్ ల మధ్య లో ప్రేమ కథ సరిగ్గా పండలేదు ప్రేక్షకులు కథలో లీనం కాలేకపోయారు విమల రామన్ ఐటెం సాంగ్ చూడటానికి బాగున్నా కథలో ఇమడకపోవడం తో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. చిత్రం లో లాజిక్ అసలు కనపడలేదు శర్వానంద్ ని ఒకరు డమ్మీ గన్ తో భయపెడతారు అదే గన్ ని లాక్కొని శర్వానంద్ ఆతని మీదకు చూపిస్తే ఎందుకు బయపడ్డాడో ఎవరికీ తెలియని ప్రశ్న. ఇలా ఒప్పుకోలేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఇవన్ని చిత్రం లో మంచి అంశాలను కప్పేశాయి.
సాంకేతిక అంశాలు:
అక్కడక్కడ హాస్యానికి కావాల్సిన విధంగా డైలాగ్స్ పడ్డాయి. ఎడిటింగ్ అసలు బాలేదు చిత్రం అతుకుల బొంతల కనిపిస్తుంది ఇంకా భీమస్ ఇచ్చిన సంగీతం పరవాలేదనిపించగా మణిశర్మ ఇచ్చిన నేఫధ్య సంగీతం ఇంకా బాగుండాల్సింది దర్శకత్వం ఇంకా చాలా మెరుగ్గా ఉండాల్సింది ప్రత్యేకంగా రెండవ అర్ధ భాగం లో అయితే దర్శకుడు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు.కోరియోగ్రఫీ,నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ పరవలేదనిపించాయి.
తీర్పు :
రెండవ అర్ధ భాగం లో స్క్రీన్ ప్లే మరియు క్లైమాక్స్ సాగదీయకుండా ఉంది ఉంటె నువ్వా – నేనా చిత్రం మంచి ఎంటర్ టైనర్ గా ఉండేది. ఈ చిత్రం లో అనుభవజ్ఞులయిన నటులు వారి పాత్ర మేరకు న్యాయం చేశారు. శ్రియ తన అందాలతో ఆకట్టుకోగా బ్రహ్మానందం చాలా రోజుల తరువాత బాగా నవ్వించారు ఈ చిత్రం ఒక టైం పాస్ చిత్రం గా ముగుస్తుంది. ఒకవేళ ఈ చిత్రం చూడాలి అనుకుంటే ఎటువంటి అంచనాలు లేకుండా చుడండి.
123తెలుగు.కాం రేటింగ్ : 2.75/5
అనువాదం : – రవి